Political News

ప్రభుత్వాలపై పెరిగిపోతున్న ఒత్తిడి

కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత పెరిగిపోతున్నకొద్దీ లాక్ డౌన్ విషయంలో ప్రభుత్వాలపై బాగా ఒత్తిడి పెరిగిపోతోంది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత తగ్గాలంటే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించటం ఒకటే ఏకైక మార్గమని ఒకవైపు న్యాయస్ధానాలు మరోవైపు శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణులు పదే పదే చెబుతున్నారు. దీంతో లాక్ డౌన్ పెట్టక వేరే దారి కనబడటంలేదు.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సుప్రింకోర్టు, రాష్ట్రాల ప్రభుత్వాలపై హైకోర్టులు అనేకసార్లు లాక్ డౌన్ విధించే విషయాన్ని పరిశీలించమని చెప్పాయి. లాక్ డౌన్ విధిస్తే ఆర్ధికంగా తీరని నష్టాలు తప్పవన్న ఏకైక కారణంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనకాడుతున్నాయి. అయితే ఆర్ధిక విషయాల గురించి ఆలోచిస్తుంటే పోతున్న ప్రజల ప్రాణాల గురించి ఎవరు ఆలోచించాలి ? అంటు కోర్టులు ప్రభుత్వాలను చాలా సీరియస్ గా ఆక్షేపిస్తున్నాయి.

ఇదే సమయంలో శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణులు మాట్లాడుతు కరోనా వైరస్ తీవ్రతను అడ్డుకోవటానికి లాక్ డౌన్ పెట్టక వేరేమార్గం లేదని పదే పదే సలహాలిస్తున్నారు. దీంతో లాక్ డౌన్ విధించే విషయంలో ప్రభుత్వాలపై బాగా ఒత్తిడి పెరిగిపోతోంది. వీళ్ళ సలహాలు, సూచనల సంగతిని పక్కన పెట్టేస్తే ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నది మాత్రం వాస్తవం. రోజుకు వేలాదిమంది చనిపోతున్నారు. అలాగే రోజుకు 4 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.

కరోనా వైరస్ మొదటి దశతో పోల్చుకుంటే రెండో దశ చాలా వేగంగా వ్యాపిస్తోంది. అలాగే తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. రెండో దశ వైరస్ సోకిన రోగుల్లో ఊపిరితిత్తులు, గుండె పై బాగా ఒత్తిడి పెరిగిపోతోంది. దీనివల్ల ఆక్సిజన్ అవసరం ఒక్కసారిగా పెరిగిపోతోంది. అందుకనే రోజుకు 450 టన్నుల ఆక్సిజన్ సరఫరా ఉన్నా జనాలకు సరిపోవటంలేదు. ముందు రోజుల్లో ఆక్సిజన్ అవసరం రోజుకు వెయ్యిటన్నులు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా లాక్ డౌన్ విధించే విషయంలో ప్రభుత్వాలపై ఒత్తిడి పెరిగిపోతోందన్నది మాత్రం వాస్తవం.

This post was last modified on May 7, 2021 1:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

2000 కోట్లు ఎలా ఊహించుకున్నారు

కంగువ విడుదలకు ముందు నిర్మాత జ్ఞానవేల్ రాజా ఓ సందర్భంలో మాట్లాడుతూ తమ సినిమా రెండు వేల కోట్లు వసూలు…

54 mins ago

పుష్ప 2 సంగీతం – నేనే కాదు చాలా మంది చేస్తున్నారు

టాలీవుడ్ లోనే కాదు అటు ఉత్తరాదిలోనూ మోస్ట్ వెయిటెడ్ ప్యాన్ ఇండియా మూవీగా విపరీతమైన అంచనాలు మోస్తున్న పుష్ప 2…

1 hour ago

వైన్ షాపులో బన్నీ.. ఎవరి కోసం?

సెలబ్రెటీలు ఏం చేసినా వార్తే. అలాంటిది ఒక స్టార్ హీరో వైన్ షాపుకి వెళ్లి మద్యం కొంటే అంతకంటే వార్త…

2 hours ago

మరణాన్ని వణికించే ‘డాకు మహారాజ్’

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న భారీ చిత్రానికి డాకు మహారాజ్ టైటిల్ నిర్ణయించారు. ఈ లీక్…

2 hours ago

మెగా హీరో మళ్ళీ ట్రాక్ తప్పాడు

పాపం దురదృష్టాన్ని భుజాన వేసుకుని తిరుగుతున్నట్టు ఉంది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పరిస్థితి. రెండు వారాలుగా ఎడతెరిపి లేకుండా…

2 hours ago

బాలయ్య & బన్నీ – భలే భలే కబుర్లు

ఇద్దరి హీరోల అభిమానులు ఎదురు చూస్తున్న అన్ స్టాపబుల్ 4 బాలకృష్ణ, బన్నీల ఇంటర్వ్యూలో మొదటి భాగం నిన్న అర్ధరాత్రి…

3 hours ago