కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు మరోసారి ఫైరైంది. ప్రస్తుతం దేశాన్ని చుట్టుముట్టి.. కరోనా సెకండ్ వేవ్‌ను అడ్డుకోవడంలోను, ప్రజలకు సరైన వైద్య సదుపాయాలు, ఆక్సిజన్ సరఫరా వంటి విషయాల్లో మోడీ సర్కారు పూర్తిగా విఫలమైందని సుప్రీం కోర్టు మరోసారి సీరియస్‌గా వ్యాఖ్యానించింది. దేశంలో కరోనా పరిస్థితులు, ఆక్సిజన్ సరఫరా వంటి పలు అంశాలపై.. సుమోటోగా విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. తాజాగా మరోసారి.. దీనిపై విచారణ జరిపింది.
ఈ సందర్భంగా కేంద్రం సమర్పించిన అఫిడవిట్ సహా.. పలు రాష్ట్రాలు.. తమకు ఆక్సిజన్ సరఫరా చేయడం లేదంటూ.. కొందరు ఆయా రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో వేసిన కేసులను కూడా సుప్రీం కోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ఇదే సమయంలో థర్డ్ వేవ్‌పై సుప్రీం కోర్టు మరింత ఆదోంళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఏమేరకు సన్నద్ధంగా ఉందని.. ప్రశ్నించింది. ముఖ్యంగా థర్డ్ వేవ్‌లో చిన్నారులపై ఎక్కువగా ప్రభావం పడుతుందని అంటున్న నిపుణుల హెచ్చరికలను కూడా సుప్రీం కోర్టు ప్రధానంగా ప్రస్తావించింది.
వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విపత్కర పరిస్థితిలో కేంద్రం ఎలా సహకరిస్తోందో చెప్పాలని కూడా నిలదీసింది. వ్యాక్సిన్ సరఫరాను మరింతగా పెంచాలని సూచించిన సుప్రీం కోర్టు.. థర్డ్‌వేవ్‌ను తట్టుకునేందుకు చిన్నారులకు కూడా వ్యాక్సిన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. అదేసమయంలో ఢిల్లీకి మెడికల్ ఆక్సిజన్‌ను అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
This post was last modified on May 6, 2021 3:44 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…