రీల్ లో తిరుగులేని స్థానాన్ని సొంతం చేసుకొని.. రియల్ లైఫ్ లో పొలిటీషియన్ గా కెరీర్ ను స్టార్ట్ చేయటం కొత్తేం కాదు. చాలా పాతది. అయితే.. ఇటీవల కొత్త ట్విస్టు ఒకటి షురూ అయ్యింది. గతంలో రీల్ దేవతలు ఎన్నికల బరిలోకి దిగితే.. వెనుకాముందు ఆడకుండా గెలుపు వారి సొంతమయ్యేది. ఇప్పుడు అందుకు భిన్నంగా ఓటమిపాలవుతున్నారు. తాజాగా వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడుకు కాబోయే సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ తప్పించి మరే సినీతార ఎన్నికల్లో గెలవలేదు.
తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారతారన్న ప్రచారం జరిగిన విశ్వనటుడు కమల్ హాసన్ సైతం ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయారు. ఆయనతో సహా.. ఆయన పార్టీ అభ్యర్థులంతా ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. కమల్ హాసన్ మాత్రం తాను పోటీ చేసిన కోయంబత్తూర్ సౌత్ లో చివరి వరకు అధిక్యతలో సాగినా.. చివర్లో ఆయన ప్రత్యర్థిగా నిలిచిన బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ విజయాన్ని సాధించి సంచలనంగా మారారు.
తమిళనాడులో వనతి శ్రీనివాసన్ పరిచయమే కానీ.. బయట వారికి మాత్రం ఆమె కొత్తనే. తమిళనాడులో బీజేపీ విజయం సాధించటం.. అది కూడా కమల్ హాసన్ బరిలో దిగిన చోట కావటంతో ఆమె గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువ అవుతోంది. ఇంతకూ ఆమె ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటన్న విషయాల్లోకి వెళితే.
వనతి శ్రీనవాసన్ సీనియర్ అడ్వకేట్. అది కూడా ఎంత ఫేమస్ అన్న విషయానికి చిన్న ఉదాహరణతో ఇట్టే అర్థమయ్యేలా చెప్పేస్తాం. న్యాయవాదిగా ఆమె చేసిన సేవలకు ప్రతిగా 2012లో అప్పటి మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్న జస్టిస్ ఇక్బాల్ చేతుల మీదుగా అవుట్ స్టాండింంగ్ వుమెన్ లాయర్ గా అవార్డును సొంతం చేసుకున్నారు. రెండు దశాబ్దాలుగా లాయర్ గా పని చేసిన ఆమె.. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. మొదట్లో రెండింటిని కాస్త బ్యాలెన్సు చేసినా.. ఆతర్వాత మాత్రం రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించటం షురూ చేశారు.
1993లో బీజేపీ సభ్యురాలిగా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా ఆమె ఎంపికయ్యారు. 2016లో కూడా బీజేపీ తరఫున పోటీ చేశారు కానీ.. ఆమె ఓట్ల వేట 33వేలకే పరిమితమయ్యారు. తాజాగా మాత్రం.. చివరి రౌండ్లలో చెలరేగిపోయిన ఆమె.. అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్నారు. కాకుంటే.. ఎక్కువ మెజార్టీ కాదు. అధిక్యత పరంగా చూస్తే 1728 ఓట్లు మాత్రమే అయినప్పటికీ.. గెలుపు గెలుపే కదా? అందులోకి ఒక పార్టీ అధ్యక్షుల వారిని ఓడించటం సామాన్యమైన విషయం కాదు కదా?
రాజకీయంగానే కాదు.. వనతి శ్రీనివాసన్ స్వచ్చంద సేవా కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. ఏదైనా ఇష్యూ మీద బాధితుల తరఫున పోరాటం ఆమెకు అలవాటే. పలు అంశాల మీద పోరాడిన ఆమె.. విజయాన్ని సాధించారు కూడా. పలు ఫోరంలు ఏర్పాటు చేశారు. ఆమె భర్త శ్రీనివాసన్. వారికి ఇద్దరు అబ్బాయిలు. ఏమైనా.. కమల్ ను ఓడించటం ద్వారా ఇప్పుడామె ఒక్కసారిగా జాతీయ స్థాయిలో అందరి కంట్లో పడ్డారని చెప్పక తప్పదు.
This post was last modified on May 6, 2021 7:03 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…