Political News

రివర్సు కొట్టిన బీజేపీ బ్రహ్మాస్త్రం

పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో బీజేపీ బ్రహ్మాస్త్రం రివర్సుకొట్టింది. ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ ప్రధానంగా బయటకుతీసేది హిందుత్వ అంశాన్నే. గెలుపు అవకాశాలు ఉన్నాయని అనుకున్న ప్రతి ఎన్నికలోను హిందుత్వఅంశాన్నే అస్త్రంగా ప్రత్యర్ధులపైకి ప్రయోగిస్తుంటుంది. ఇందులో భాగంగానే బెంగాల్ ఎన్నికల్లో కూడా పదే పదే హిందుత్వ కార్డును నరేంద్రమోడి, అమిత్, జేపే నడ్డా అండ్ కో మమతాబెనర్జీ పైకి ప్రయోగించింది.

అయితే ఫలితాల తర్వాత చూస్తే ఆ అస్త్రం అట్టర్ ఫ్లాప్ అయినట్లు అర్ధమవుతోంది. తాము ప్రయోగించిన హిందుత్వ అస్త్రం చివరకు తమనే రివర్సులో దెబ్బకొట్టేసిందని ఇఫుడు కమలనాదులకు అర్ధమైంది. మామూలుగా ఎన్నికల్లో డెవలప్మెంట్ అంశాలను కూడా ప్రస్తావిస్తారు. కానీ బెంగాల్ ఎన్నికల్లో మాత్రం రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ఏమి చేసింది, చేయబోతోందనే అంశాలను మోడి అండ్ కో పెద్దగా ప్రస్తావించలేదు. ఎంతసేపు ముస్లింలు-హిందువులు, బంగ్లాదేశ్ నుండి బెంగాల్లోకి వలసవచ్చిన ముస్లింల అంశం, అవినీతిని మాత్రమే టచ్ చేశారు.

అయితే దీన్ని దీదీ ముందే ఊహించారట. అందుకనే తన కులమేంటి, తన గోత్రమేంటి అనే విషయాలను పదే పదే ప్రస్తావించారు. ప్రతి బహిరంగ వేదికమీద కాళీమాత పారాయణం చేశారు. మంత్రాలను, స్తోత్రాలను పఠించారు. తాను మంత్రాలను చెప్పటమే కాకుండా ఇవే మంత్రాలను మోడి, అమిత్ షాలు చెప్పాలంటు చాలెంజ్ విసిరారు. పక్కా హిందువునైన తనను హిందువ్యతిరేకిగా ముద్రవేయాలని మోడి అండ్ కో చేస్తున్న ప్రయత్నాలను డైరెక్టుగానే చీల్చిచెండాడారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మంత్రాలను పఠించటంలో దీదీ చాలెంజ్ ను మోడి, షా ఒక్కసారిగా స్వీకరించలేదు. ఇక్కడే వీళ్ళకు సమస్యలు మొదలయ్యాయట. ఇదే సమయంలో బంగ్లాదేశ్ నుండి వలసలను నిరోధించాల్సిన కేంద్రం ఆ విషయంలో ఫెయిలై అదే మమత మీదకు నెట్టేస్తోందన్న విషయం జనాలకు బాగా అర్ధమైంది.

ఎన్నికల ప్రచారం జరిగిన దాదాపు రెండు నెలలు కూడా మమతను పదే పదే హిందువ్యతిరేకిగా ముద్ర వేయటానికి మోడి, షా చేసిన ప్రయత్నంతో జనాలకు చిర్రెత్తిందట. దాంతో హిందు-ముస్లిం అన్నతేడా లేకుండా మెజారిటి సెక్షన్లు మమతకే మద్దతుగా నిలబడటంతో అఖండ విజయం సాధ్యమైంది. మొత్తానికి తమ చేతిలోని బ్రహ్మాస్త్రమే తమకు రివర్సు కొట్టిందని ఇపుడు కమలనాదులు విశ్లేషించుకుంటున్నారట.

This post was last modified on May 4, 2021 10:11 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేటీఆర్ పై కేసు..అరెస్టు తప్పదా?

బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ…

13 minutes ago

4వ దెయ్యంతో లారెన్స్ రిస్కు!

హారర్ కామెడీ జానర్‌లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్‌లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం…

53 minutes ago

వైసీపీకి ప్ర‌మోట‌ర్స్ కావ‌లెను… !

ఏపీ ప్రతిప‌క్షం వైసీపీకి ప్ర‌మోట‌ర్స్ కావాలా? పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు ర‌చించ‌డంతోపాటు.. ప్ర‌జ‌ల‌కు పార్టీని చేరువ చేసేందుకు ప్ర‌మోట‌ర్ల…

1 hour ago

ముందు రోజు ప్రీమియర్లు….జెండా ఊపిన బచ్చల మల్లి!

కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…

2 hours ago

చరణ్ భుజాల మీద భారతీయుడి బరువు!

మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…

3 hours ago

వైసీపీ హయాంలో వ్యూహం సినిమాకు 2.15 కోట్లు

ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…

3 hours ago