అట్టర్ ఫ్లాప్ అయిన ఎంఐఎం

అనేక రాష్ట్రాల ఎన్నికల్లో గణనీయంగా పుంజుకుంటున్న ఎంఐఎం ఈసారి అట్టర్ ఫ్లాప్ అయ్యింది. బీహార్ ఎన్నికలు, గుజరాత్ ఎన్నికలు అంతకుముందు మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంఐఎం పోటీచేసి మంచి ఫలితాలనే సాధించింది. మరీ బీహార్ ఎన్నికల్లో అయితే గణనీయమైన విజయాలను కూడా సాధించింది. అదే ఊపులో ఇపుడు పశ్చిమబెంగాల్, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల్లో కూడా పోటీచేసింది.

ఏ రాష్ట్రంలో పోటీచేసినా ప్రధానంగా ముస్లిం మైనారిటి ఓట్లపైనే దృష్టిపెట్టింది. అదేపద్దతిలో ఇపుడు కూడా ముస్లిం ఓటర్లపైనే దృష్టిపెట్టింది. ఇందులో కూడా పశ్చిమబెంగాల్లో పోటీ చేయటాన్ని ప్రధానంగా టార్గెట్ గా తీసుకుంది. తమిళనాడులో పోటీచేసిన మూడు స్ధానాల్లోను ఓడిపోయింది. అలాగే బెంగాల్లో ఏడుచోట్ల పోటీచేసింది. అయితే ఎక్కడా గెలవలేదు. అలాగే అస్సాంలో పోటీచేసిన అన్నీ నియోజకవర్గాల్లో కూడా వెనకబడేఉంది.

మొత్తంమీద ఎంఐఎం హవాకు బ్రేకులు పడిందనే చెప్పాలి. హైదరాబాద్ లోని ఓల్డ్ సిటిలో మొదలైన ఎంఐఎం ప్రస్ధానం మెల్లిగా ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రారంభమైంది. పోటీచేసిన కొన్ని రాష్ట్రాల్లో స్ధానిక పరిస్ధితుల ఆధారంగా మంచి ఫలితాలనే సాధించింది. అయితే ఇపుడు మాత్రం నూరుశాతం బోల్తాపడింది.