Political News

లవ్ కు అడ్డొస్తున్నాడని తమ్ముడ్ని దారుణంగా చంపేసిన నటి

మానవ సంబంధాలు అంతకంతకూ దారుణంగా మారుతున్నాయి. సినిమాల ప్రభావమో.. టీవీ సీరియల్స్ పుణ్యమో.. వ్యక్తిగత స్వార్థం ముందు మరేదీ ముఖ్యం కాదన్నట్లుగా పరిస్థితులు మారుతున్నాయి. క్షణిక సుఖం కోసం అయినోళ్లను అత్యంత దారుణంగా చంపేసే వైనం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. ఇలాంటి వాటిల్లో ఒక నటి నేరుగా ఉండటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. శాండల్ వుడ్ లో సంచలనంగా మారిన ఈ దారుణ హత్యోదంతంలోకి వెళితే..

మూడేళ్ల క్రితం కన్నడ చిత్రపరిశ్రమకు పరిచయమయ్యారు షనయ కాట్వే. ఇదం ప్రేమం జీవినంలో తొలిసారి నటించిన ఆమె..ఇటీవల ఒక అడల్ట్ కామెడీ చిత్రంలోనూ నటించారు. అయితే..ఆమె అప్ కమింగ్ ఆర్టిస్ట్ నియాజ హమీద్ కటిగర్ ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమకు షనయ సోదరుడు తీవ్ర అభ్యంతరం పెడుతున్నాడు. దీంతో.. తమ్ముడ్ని చంపేస్తే తమకు అడ్డు ఉండే వారు లేరన్న దారుణ ఆలోచనకు వచ్చిన ఆమె.. ప్రియుడు నియాజ హమీద్ కు చెప్పి.. చంపేయాలంటూ ప్రోత్సహించింది.

దీంతో.. తన ప్రియురాలి తమ్ముడ్ని చంపేందుకు మరో ముగ్గురు సాయం తీసుకున్న నియాజ హమీద్ భారీ ప్లాన్ వేశారు. తాము అనుకున్నట్లే ఇంట్లోనే షనయ సోదరుడు రాకేశ్ గొంతు కోసి హత్య చేశారు. అనంతరం తలను ఒక చోట.. బాడీని మరో చోట పడేశారు. చేయాల్సిందంతా చేసి.. తన సోదరుడు కనిపించటం లేదంటూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ఇదిలా ఉండగా.. ఈ నెల 12న హబ్బళ్లి నగర శివారులో కంపచెట్లు.. వ్యర్థాలు పడేసే దిబ్బల వద్ద తలకాయ లేని గుర్తు తెలియని డెడ్ బాడీని స్థానికులు గుర్తించారు. ఆ విషయం పోలీసులకు చేరుకుంది.

రంగంలోకి దిగిన పోలీసులు.. తల లేని మొండాన్ని తీసుకొని గుర్తు తెలియని డెడ్ బాడీగా కేసు నమోదు చేసిన దర్యాప్తు షురూ చేశారు. ఇదే సమయంలో మొండం నుంచి వేరైన తలను నగరంలోని మరో ప్రాంతంలో గుర్తించారు. దీంతో.. తామకు లభించిన తల.. మొండెం ఒకరిదేనని గుర్తించారు. ఇటీవల కనిపించకుండా పోయిన కేసుల్లో రాకేశ్ దే.. డెడ్ బాడీగా గుర్తించారు. తనని హత్య చేయాల్సిన అవసరం ఎవరికుందన్న కోణంలో విచారణను మొదలు పెట్టారు.

ఈ క్రమంలో వారు షాకింగ్ నిజాన్ని గుర్తించారు. రాకేశ్ ను హతమార్చిన హంతకుల్లో ఒకరిని గుర్తించటం.. వారి ఆధారంగా మిగిలిన వారిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు వారిని తమదైన స్టైల్లో విచారించగా.. నిజాల్ని చెప్పేశారు. దీంతో.. నటి షయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా.. తన ప్రియుడు నియాజ్.. అతడి స్నేహితులు కలిసి తన సోదరుడ్ని హతమార్చిన వైనాన్ని ఒప్పుకోవటం.. తమ ప్రేమకు అడ్డు వస్తున్నాడనే అలా చేసినట్లు చెప్పటం షాకింగ్ గా మారింది. ఈ హత్య కేసుకు సంబంధం ఉన్న వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టు ఆదేశాల నేపథ్యంలో రిమాండ్ కు తరలించారు. సొంత సోదరుడు తన ప్రేమకు అడ్డు వస్తున్నాడని హత్య చేసిన నటి వ్యవహారం శాండల్ వుడ్ లో సంచలనంగా మారి.. హాట్ టాపిక్ గా మారింది.

This post was last modified on April 28, 2021 12:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అల్లు అర్జున్ కు మరోసారి లీగల్ నోటీసులు!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…

60 minutes ago

అవసరమైతే విదేశీ డాక్టర్లతో రేవతి కుమారుడు శ్రీతేజ్ కు వైద్యం!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…

1 hour ago

కరోనా వేళ ప్రభాస్‌తో డైరెక్టర్ శంకర్ చర్చలు!

తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…

2 hours ago

పార్ట్ 2 మంత్రం పని చేయలేనట్టేనా…?

విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…

4 hours ago

వైల్డ్ ఫైర్ ఎఫెక్ట్ : ఆంధ్ర వైపు సంక్రాంతి సినిమాల చూపు!

పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…

4 hours ago

ఉదయం 4 గంటలకు డాకు మహారాజ్ షోలు : సాధ్యమేనా?

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…

4 hours ago