ఏపీ సర్కారు అనిశ్చితిలో పడిందనే వాదన వస్తోంది. ఆర్థికంగా ఒకవైపు తీవ్ర ఇబ్బందులు పడుతున్న జగన్ సర్కారుకు ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ భారీగా తగిలిందనేది విశ్లేషకుల అంచనా. సాధారణ ప్రజలకు కరోనా వస్తే.. ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన.. రంగంలోకి దిగి ప్రజలకు సేవ చేసింది. అయితే.. ఇప్పుడు కరోనా రెండో దశ వ్యాప్తి భారీ ఎత్తున కొనసాగుతోంది. దీంతో.. ప్రభుత్వం ఇరుకునపడుతోంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపించింది. మరోవైపు.. ప్రభుత్వ ఉద్యోగులు కూడా కరోనా భారిన పడి.. మృతి చెందుతున్న ఘటనలు పెరుగుతున్నాయి.
ఒకే రోజు నలుగురు సచివాలయ అధికారులు మృతి చెందడం.. జగన్ సర్కారుకు ఇబ్బందిగా మారింది. దీంతో సచివాలయాన్ని మూసివేసే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నుంచి తమకు భరోసా కావాలని.. ఉద్యోగులు రోడ్డెక్కారు. తమకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని.. వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక, నలుగురు మృతి చెందడంతో ఉద్యోగులు హడలి పోతున్నారు. అంతేకాదు.. విధులకు రాలేమని ఖరాకండీగా చెబుతున్నారు. దీంతో జగన్ సర్కారుకు సంకట స్థితి ఏర్పడింది. పరిస్థితి ఇలానే ఉంటే.. ప్రభుత్వ యంత్రాంగం కూడా కుప్పకూలుతుందని.. అంటున్నారు పరిశీలకులు.
తాజాగా సీఎం జగన్.. చేసిన సమీక్షలో ఇదే విషయం ప్రస్తావనకు వచ్చింది. అయితే.. ఇంటి నుంచి పనిచేసుకునే వెసులుబాటు ఇవ్వాలని కొందరు ఉన్నతాధికారులు కోరినా.. సీఎం జగన్ దీనిని లైట్ తీసుకున్నట్టు ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. దీంతో కొందరు అనధికార సెలవులు పెడుతున్నారు. మరికొందరు హైదరాబాద్‌లో ఇళ్ల నుంచి కనీసం బయటకు కూడా రావడం లేదు. ఈ పరిణామాలతో ఉన్నవారిపైనే ఎక్కువగా భారం పడుతోందనే వాదన వస్తోంది. ఫలితంగా ప్రభుత్వ పథకాలపైనా ఇది ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఇదే కనుక జరిగితే.. వరుసగా రెండో ఏడాది కూడా జగన్ సర్కారుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవడం ఖాయమని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on April 20, 2021 6:06 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…