వైసీపీలో అంతా గప్‌చుప్‌.. రీజ‌నేంటి ?


తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లో దొంగ ఓట్ల దందా అంటూ.. టీడీపీ స‌హా ఇత‌ర ప్ర‌తిప‌క్షాలు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించాయి. టీడీపీ అనుకూల మీడియా అయితే.. వీడియోలు, ఆడియోల‌తో స‌హా వైసీపీపై నిప్పులు చెరిగింది. ఈ క్ర‌మంలో వైసీపీ నేత‌ల్లో ఒక్క పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి మాత్రం దీనిపై స్పందించారు. మిగిలిన వారిలో ముఖ్యంగా తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌కు ఇంచార్జ్‌గా ఉన్న మంత్రి అనిల్‌కుమార్ కానీ, ఫైర్ బ్రాండ్ మంత్రి కొడాలి నానీ కానీ.. ఎవ‌రూ నోరు మెద‌ప‌లేదు. అక్క‌డ జ‌రిగింది త‌ప్ప‌నికానీ, మేం చేయ‌లేద‌ని కానీ.. ఎవ‌రూ చెప్ప‌లేదు.

పోనీ.. వీళ్లేమ‌న్నా రాష్ట్రంలో లేరా ? ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించ‌లేదా ? అంటే.. అన్నీ చేస్తున్నారు. అన్నీ చూస్తున్నారు. కానీ, ఏ ఒక్క‌రూ మాట్లాడ‌లేదు. దీనికి రీజ‌నేంటి ? అనే విష‌యంపై వైసీపీలో నే చ‌ర్చ సాగుతోంది. పార్టీ అధిష్టానం ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ నుంచి మౌఖిక ఆదేశాలు రావ‌డంతోనే ఎవ‌రూ మాట్లాడ‌డం లేద‌ని స‌మాచారం. ఇది కూడా అంతా సైలెంట్‌గానే చ‌ర్చించు కుంటున్నారు. “కొన్ని కొన్ని విష‌యాలు సైలెంట్‌గానే ఉంటాయి. వాటిని అక్క‌డితో వ‌దిలేయ‌డం మంచిది” అని ఒక‌రిద్ద‌రు నేత‌లు అంటున్నారు. అంటే.. తిరుప‌తి పార్ల‌మెంటులో జ‌రిగిన విష‌యంపై ఎవ‌రూ మాట్లాడ‌రాద‌ని అధిష్టానం నుంచి గ‌ట్టిగానే ఆదేశాలు అందాయ‌ని స‌మాచారం.

ఒక్క తిరుప‌తి అనేకాదు.. కేంద్రంపైనా.. బీజేపీ నేత‌ల‌పైనా కూడా ఎవ‌రూ విమ‌ర్శ‌లు చేయ‌కుండా క‌ట్ట‌డి చేస్తున్న‌ట్టు వైసీపీలో గుస‌గుస వినిపిస్తోంది. ఇలాంటి విష‌యాల్లో మౌనంగా ఉంటే.. అవే స‌ర్దుకుంటాయ‌ని.. అయినా.. కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి అన్ని తెలుసుకనుక‌.. అధికారులు చూసుకుంటార‌ని.. పార్టీ అధిష్టానం నుంచి స‌మాచారం రావ‌డంతో ఎవ‌రికి వారు ఏమీ తెలియ‌న‌ట్టుగా ఉన్నారు. ఇది కూడా ఒకందుకు మంచిదే.. అయితే.. ప్ర‌తిప‌క్షం నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు రావ‌డం.. ముఖ్యంగా టీడీపీ,… బీజేపీ నేత‌లు మ‌రింత‌గా రెచ్చిపోవ‌డం వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీ ఇంత సైలెంట్‌గా ఉండ‌డం కూడా రాజ‌కీయంగా ప్రాదాన్యం సంత‌రించుకోవ‌డం గ‌మ‌నార్హం.