రాజకీయంగా ఎంత శత్రుత్వం ఉన్నప్పటికీ.. ఒక పార్టీ అధినేత పుట్టిన రోజు లాంటి సందర్భం వచ్చినప్పుడు మరో పార్టీకి చెందిన ముఖ్య నేతలు మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు చెప్పడం ఆనవాయితీ. ఇది ఎప్పట్నుంచో వస్తున్న సంప్రదాయమే. రాజకీయాలు ఎంతగా దిగజారినప్పటికీ.. ఇలాంటి సందర్భాల్లో మాత్రం నాయకులు హుందాగానే ప్రవర్తిస్తారు. అవతలి పార్టీ నేత మీద లోపల ఎలాంటి అభిప్రాయం ఉన్నప్పటికీ.. బయటికి మాత్రం మర్యాదపూర్వకంగానే శుభాకాంక్షలు చెబుతుంటారు. ఒకవేళ శుభాకాంక్షలు చెప్పడం ఇష్టం లేకుంటే సైలెంటుగా ఉండిపోవచ్చు కానీ.. కించపరిచేలా మాత్రం వ్యాఖ్యలు చేయరు. ఐతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తర్వాత అత్యంత ముఖ్య నేత అయిన విజయసాయి రెడ్డికి మాత్రం ఇలాంటి పట్టింపులేమీ ఉండవు.
ఒక ఎంపీ అయి ఉండి ఆయన ట్విట్టర్లో పెట్టే పోస్టులు చూస్తే ఎవరికైనా చిరాకు పుడుతుంది. ఊరూ పేరూ లేని అనామకుల తరహాలో దిగజారుడు పోస్టులు పెడుతుంటారాయన. ఈ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన వెనక్కి తగ్గరు. తాజాగా మంగళవారం ఏపీ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడి పుట్టిన రోజు సందర్భంగా ఆయన పెట్టిన పోస్టు చూస్తే విజయ సాయి ఎప్పటికీ మారరు అని స్పష్టమవుతుంది. 420 అనే నంబరులో చంద్రబాబు ఫొటోలు పెట్టి గ్రాఫిక్ చేయించి.. “ఏపీలో ఆఫీసులు మూసెయ్యడంతో పక్క రాష్ట్రంలో పుట్టిన రోజు జరుపుకుంటున్న 420కి జన్మదిన శుభాకాంక్షలు. పైగా కరోనా వల్ల బర్త్ డే ఘనంగా చెయ్యవద్దంటూ సందేశం.17 తర్వాత ‘పార్టీ లేదు బొక్కాలేదన్న సందేశాన్ని’ ఇప్పటికే మీవాళ్లు పాటిస్తున్నారులే బాబు. మళ్ళీ నీ బ్రీఫ్ డు అవసరం లేదు” అంటూ వ్యాఖ్య జోడించారు విజయసాయి.
చంద్రబాబు మీద ఎంత ద్వేషం ఉన్నా సరే.. పుట్టిన రోజు నాడు ఒక ఎంపీ ఇలాంటి పోస్ట్ పెట్టడం దారుణం. ఈయన ఇలా ఉంటే.. జగన్ మాత్రం తన స్థాయికి తగ్గట్లు హుందాగానే చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పారు. విజయసాయి స్వయంగా ఇలాంటి పోస్టులు పెడతారో.. ఎవరితోనైనా పెట్టిస్తారో కానీ.. తాను ఒక ఎంపీ అని మరిచిపోయి మరీ ఇంత దిగజారుడు పోస్టులు పెట్టడం వల్ల జనాల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయో జగన్ అండ్ కో ఆలోచించాల్సిందే.
This post was last modified on April 20, 2021 5:30 pm
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…
అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…
టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…
విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…
మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…