తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం మాత్రమే ఉంది. కేసీఆర్ ఎన్నికల డ్రీమ్ కేబినెట్‌ను ఏర్పాటు చేసుకుని ఈ రెండేళ్లు ప్రజల్లో మరింత స్ట్రాంగ్ అయ్యి వచ్చే ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయిపోయారు. కేటీఆర్‌ను సీఎం చేస్తారంటూ వస్తోన్న వార్తలకు ఆయన పూర్తిగా చెక్ పెట్టేసి.. వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచి తాను హ్యాట్రిక్ కొట్టి మరోసారి తెలంగాణ సీఎం అవ్వాలని ఆయన డిసైడ్ అయిపోయారు. కేటీఆర్ సీఎం అంటే అనేకానేక పుకార్లు, సందేహాలు వస్తున్నాయి. వీటికి తావు ఇవ్వకూడదని కేసీఆరే ఇటీవల పలు ఆపరేషన్లలో రంగంలోకి దిగిపోతున్నారు.
తెలంగాణలో 2018 డిసెంబర్లో సాధారణ ఎన్నికలు జరిగాయి. మళ్లీ వచ్చే లోక్‌సభ ఎన్నికల కంటే ముందుగానే 2023లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఇక టీఆర్ఎస్ ఇప్పటికే తెలంగాణలో వరుసగా ఏడేళ్ల నుంచి అధికారంలో ఉంది. అక్కడ నేతలు ఎక్కువ మంది ఉన్నారు. పార్టీ బండి ఓవర్ లోడ్ అయ్యింది. అయితే పదవులు మాత్రం కొద్ది మందికే దక్కాయి. అక్కడ మంత్రి పదవి ఆశిస్తోన్న సీనియర్ ఎమ్మెల్యేల లిస్ట్ చాలానే ఉంది. కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యాక కూడా సామాజిక, ప్రాంతీయ సమీకరణల నేపథ్యంలో చాలా మంది నేతలకు పదవులు కల్పించలేదు.
ఇక ఇప్పుడు కేబినెట్‌ను సమూలంగా ప్రక్షాళన చేసి కొత్త నేతలకు అవకాశం ఇవ్వడంతో పాటు ఎన్నికల డ్రీమ్ కేబినెట్‌గా ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత కేబినెట్లో కొందరి పదవులు ఊస్ట్ కావడం ఖాయమనే అంటున్నారు. ఇప్పుడున్న కేబినెట్లో కేసీఆర్ తన మంత్రి వర్గంలో ఐదు నుంచి ఆరుగురు మంత్రులను తప్పించేస్తారని అంటున్నారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాల పట్ల కూడా ఆయన సంతృప్తిగా లేరు. ఈ లెక్కన చూస్తే గ్రేటర్ పరిధిలో మంత్రులతో పాటు ఉత్తర తెలంగాణలో పనితీరు సరిగా లేని మంత్రులపై ఈ సారి వేటు ఖాయమని తెలుస్తోంది.
ఇక ఈ సారి కేబినెట్లోకి తీసుకునే వారిలో సీనియర్ ఎమ్మెల్యేలతో పాటు ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా ఉంటారని చెపుతున్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితాల తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండే అవకాశముంది. ఇక ఎలాగూ గ్రేటర్ వరంగల్, ఖమ్మంతో పాటు ఐదు మున్సిపాల్టీల ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఒకేసారి కేబినెట్‌లో ప్రక్షాళన చేసుకుని.. ఆ టీంతోనే ఆయన 2023 ఎన్నికలకు రెడీ కానున్నారు.
This post was last modified on April 19, 2021 2:58 pm
డిసెంబరు బాక్సాఫీస్‌కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…
అలియా భట్ ఎలా అన్ని బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుందో చూసి చాలామందికి ఆశ్చర్యమే. కొత్త ఇల్లు, సినిమాలు, బిజినెస్ పనులు,…
రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…
శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…
ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…