“కష్టపడేవాళ్లను వెతికి పట్టుకుని మరీ గుర్తింపు ఇస్తాను. ఎవరు కష్టపడుతున్నారో.. ఎవరు పార్టీ కోసం శ్రమి స్తున్నారో.. నాకు అన్నీ తెలుసు!“- ఇదీ తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ప్రచారంలో చంద్రబాబు టీడీపీ నేతలను ఉద్దేశించి చెప్పిన మాట. సో.. తిరుపతి ఫలితం ఎలా ఉన్నప్పటికీ.. పార్టీని ప్రక్షాళన మాత్రం చేస్తా రనే విషయం ఈ వ్యాఖ్యలను బట్టి స్పష్టమైంది. అయితే.. ఇక్కడే ఉంది అసలు చిక్కంతా అంటున్నారు పరిశీలకులు. 2019 ఎన్నికలు పూర్తయ్యాక.. ఆ ఎన్నికల్లో సత్తా చాటని వారిని పక్కన పెట్టి.. కొత్తవారికి అవకాశం ఇస్తానని.. చంద్రబాబు చెప్పారు.
అయితే.. పాత వారిని మాత్రం పక్కన పెట్టకుండా.. కొత్త పదవులు సృష్టించి.. కొత్తవారికి అవకాశం అయితే.. ఇచ్చారు. ఈ క్రమంలోనే పార్లమెంటరీ జిల్లాల ఇంచార్జ్‌లు, మండల స్థాయి ఇంచార్జ్‌లు.. మహిళా పార్లమెం టరీ నేతలు.. తెలుగు మహిళ(పాతదే)లోనూ కొత్తవారికి అవకాశం ఇచ్చారు. ఇంత వరకు బాగానే ఉన్నప్ప టికీ.. ఈ కొత్తవారికి ఎక్కడా అధికారం అప్పగించలేదు. మళ్లీ పాత నేతలు, కురువృద్ధుల ఐడియాలనే పాటించాలని.. వారి కనుసన్నల్లోనే ముందుకు సాగాలని పైనుంచి మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. దీనికితోడు.. కొందరిని పక్కన పెట్టినా.. వారికి ఉన్న హవాను మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. ఫలితంగా ఈ ప్రయోగం వికటించిందనేది వాస్తవం.
ఈ క్రమంలో స్థానిక ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజయం ఎదురైంది. ఈ పరిణామం నిశితంగా గమనించిన చంద్రబాబు.. తిరుపతిలో అందరినీ కలుపుకొనిపోయేందుకు బాగానే ప్రయత్నించారు. కానీ, ఇతర ప్రాం తాల నుంచి నేతలు(వీరిలో కురువృద్ధులు కూడా ఉన్నారు) వచ్చారే తప్ప.. స్థానికంగా ఉన్న నాయకులు మాత్రం.. ముందుకు రాలేదు. దీంతో తిరుపతిలో పోరు ఒంటి చేత్తో నెట్టుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈక్రమంలోనే చంద్రబాబు మళ్లీ ప్రక్షాళన బాట పట్టారు. పార్టీని ప్రక్షాళన చేస్తానని.. కష్టపడుతున్నవారిని వెతికి పట్టుకుని మరీ పదవులు ఇస్తానని ఆయన చెప్పుకొచ్చారు. అయితే.. ఎన్నిసార్లు ప్రక్షాళన చేస్తారు? అనేది ఓ వర్గం తమ్ముళ్ల వాదన.
ప్రక్షాళన ముఖ్యమే అయినా.. ప్రధానంగా పనిచేస్తున్నవారికి అవకాశం ఇవ్వాలని.. అధికారం అప్పగించా లని అంటున్నారు. జెండా పట్టుకోవాలన్నా.. జెండా దింపాలన్నా.. కొందరి అనుమతి ఉండాల్సి వస్తోంద న్న విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రక్షాళన అంటే.. వ్యక్తులను అటు ఇటు మార్చడం కాకుండా.. ఎవరు ఏ స్థాయి వారైనా పార్టీ కోసం నిలబడితే.. టికెట్ ఖాయం.. అనే విధంగా సమూల మార్పులు తెస్తే.. తప్ప టీడీపీలో ఊపు రాదని కుండబద్దలు కొడుతుండడం గమనార్హం. మరి ఇలా సంచలన నిర్ణయం తీసుకునే ధైర్యం చంద్రబాబుకు ఉందా? ఇలా చేస్తే.. సీనియర్లు(కురువృద్ధులు) ఊరుకుంటారా? మిలియన్ డాలర్ల ప్రశ్న.. తెరమీద కనిపిస్తూనే ఉంది.
This post was last modified on April 19, 2021 6:49 am
పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే…
మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్పై మరోసారి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…