ఎవరు మాత్రం ఊరికేనే రాజకీయాలు వదిలేస్తారు? ఎవరికి మాత్రం పదవులంటే ఆదరణ ఉండదు. కానీ, ఆ సీనియర్ నాయకుడు మాత్రం.. వచ్చే ఎన్నికల్లో తప్పుకొంటున్నట్టు ఇప్పటికే ప్రకటించేశారు. దీంతో అందరూ ఉలిక్కిపడతారని.. తనకు ప్రాధాన్యం పెరుగుతుందని అనుకున్నారు. కానీ.. అలాంటివేవీ జరగలేదు. ఆయనే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. 1983 బ్యాచ్‌కు చెందిన టీడీపీ నేత. పార్టీ అధికారంలో ఉన్నా.. లేకున్నా.. తాను చెప్పాల్సిందేదో చెప్పే స్తారు. టీడీపీ వ్యవహారాలు, నాయకత్వ పోకడలపై బుచ్చయ్య చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు.
దానికితోడు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బుచ్చయ్య చౌదరి.. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడయ్యారు. అలాంటి కీలక పొజిషన్‌లో ఉన్న నాయకుడు ఆకస్మికంగా.. రిటైర్మెంట్ ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడి కంటే కొందరు నేతల తీరుపైనే బుచ్చయ్యకు మొదటి నుంచి అసంతృప్తి ఉన్నారనేది నిజం. పార్టీని సరైన దిశలో తీసుకువెళ్లడంలో.. అధినేతకు సరైన సలహాలు ఇవ్వడంలో తప్పు దోవ పట్టిస్తున్నారని ఆయన ఎప్పుడూ ఓపెన్‌గానే చెప్పేస్తున్నారు. పార్టీలో ఒక కోటరీ అధిష్ఠానాన్ని రాంగ్ డైరెక్షన్‌లో తీసుకెళ్తుంద నేది బుచ్చయ్య గట్టి వాదన. మరీ ముఖ్యంగా.. 2014లో తనకు మంత్రి పదవి వస్తుందని చివరి వరకు ఆశించారు. అయితే.. అది దక్కలేదు.
2017లో మంత్రి వర్గ ప్రక్షాళన సమయంలో పనిగట్టుకుని విజయవాడలో మకాం వేసి మరీ.. చంద్రబాబు ను అభ్యర్థించారు. అయినప్పటికీ.. ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో అప్పటి నుంచి తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు. ఇక, ఇప్పుడు తను యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరం అవుతున్నానని.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆయన ప్రకటించి.. పెను సంచలనం సృష్టించాలని అనుకున్నారు.కానీ, ఎవరూ పట్టించుకోలేదు. ఆఖరుకు.. చంద్రబాబు కానీ, ఆయన తనయుడు లోకేష్ నుంచి కానీ.. బుచ్చయ్యకు ఫోన్ రాలేదు. దీంతో ఇప్పుడు ఏం చేయాలనే విషయంపై బుచ్చయ్య సమాలోచలనలు చేస్తున్నారు.
తనకు పోటీ నుంచి విరమించుకోవడం ఇష్టం లేదు.కానీ, ఇప్పుడున్న పరిస్థితిలో కొత్తవారికి, అందునా.. తనముందు చాలా జూనియర్లకు కీలక పదవులు దక్కుతుంటే.. తను నీళ్లు నమలడం.. జగన్ సునామీని తట్టుకుని విజయం సాధించినా.. ఫలితం కనిపించకపోవడం వంటివి బుచ్చయ్యకు తీవ్ర ఇబ్బందికరంగా ఉంది. ఈ క్రమంలోనే ఆయన రిటైర్మెంట్ అస్త్రం ప్రకటించారు. అయితే.. బుచ్చయ్య రేంజ్‌లో ఆ ప్లేస్‌ను రీప్లేస్ చేసే నాయకులు లేకపోవడం.. పార్టీకి ఇబ్బందికరంగా ఉంటే.. ఇదే తనకు ప్లస్‌గా ఉందని.. ఇప్పుడు కాకపోతే.. మరికొన్ని రోజులకైనా.. పార్టీ అదిష్టానం.. తనతో బేరానికి రాకతప్పదని.. బచ్చయ్య భావిస్తున్నా రు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates