ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకునే నాయకులు నేటి రాజకీయాల్లో పెరిగిపోయారు. ఎప్పుడు ఎటు అవకాశం వస్తే.. అటు వెళ్లిపోవడం.. ఎక్కడ పదవి వరిస్తుందని తెలిస్తే.. ఆ సర్కారుకు జై కొట్టడం.. పార్టీ సిద్ధాంతాలు, రాద్ధాంతాలు వంటివాటిని సైతం పక్కన పెట్టడం వంటివి నేటి రాజకీయాల్లో కామన్‌గా మారిపోయాయి. అయితే.. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి.. డాక్టర్ డీఎల్ రవీంద్రారెడ్డి మాత్రం ఆత్మాభిమానం చంపుకోలేక పోతున్నారనే వాదన వినిపిస్తోంది. ఆయన కాంగ్రెస్‌లో రాజకీయం ప్రారంభించారు. చాలా సంవత్సరాలు ఆ పార్టీలోనే ఉన్నారు. మైదుకూరు నుంచి వరుస విజయాలు దక్కించుకున్నారు.
ఇటు వైద్య వృత్తిని కొనసాగిస్తూనే రాజకీయాల్లోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో కూడా పనిచేశారు. అయితే, రాష్ట్ర విభజన తర్వాత.. ఆయన కాంగ్రెస్‌కు దూరమయ్యారు. వాస్తవానికి కాంగ్రెస్ పుంజుకుంటుందని ఆశించిన నేతల్లో డీఎల్ కూడా ఒకరు. అయితే.. వేచి చూసినా.. పార్టీ పుంజుకోక పోయేసరికి.. ఆయన మౌనంగా ఉన్నారు. ఈ క్రమంలో అనేక మంది కాంగ్రెస్ నాయకులు.. ముఖ్యంగా కడప జిల్లాకే చెందిన వారు కూడా వైసీపీ, టీడీపీ వైపు వెళ్లిపోయారు. పదవులు సైతం పొందారు. ఈ క్రమంలో డీఎల్ కూడా వైసీపీ నుంచి ఆఫర్లు వచ్చాయి. అయితే.. ఆయన మాత్రం మొగ్గు చూపలేదు.
గత ఎన్నికలకు ముందు కారణాలు ఏవైనా.. ఆయన టీడీపీలోకి వస్తారనే ప్రచారం కూడా సాగింది. కానీ, ఇటు కూడా మొగ్గు చూపలేదు. దీనికి ఆయన ఆత్మాభిమానం.. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందేమోననే ఆవేదన వంటివి కారణాలు అయి ఉండవచ్చు. దీంతో ఇప్పుడు ఎటూ ఆయన వెళ్లలేని పరిస్థితి ఉంది. వివాద రహితుడుగా.. అవినీతి మరకలు లేని నాయకుడిగా.. ప్రజావైద్యుడిగా ఆయన పేరు తెచ్చుకున్నా.. రాజకీయంగా మాత్రం వ్యూహాత్మక అడుగులు వేయలేక పోవడం.. ఆయనకు మైనస్‌గా మారిపోయాయి.
దీంతో ఇప్పుడు ఆయనను పట్టించుకునేవారు ఎవరూ కనిపించడం లేదు. అయితే.. మరో రెండేళ్లయినా.. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని.. ఎదురు చూస్తున్న సీనియర్ల జాబితాలో డీఎల్ పేరు కనిపిస్తుండడం గమనార్హం. అదే సమయంలో వైసీపీలోకి వెళ్లాలా ? వద్దా ? అన్న ఊగిసలాటలో కూడా ఉన్నారు. మరి డీఎల్ రాజకీయం ఎలా మారుతుందో ? చూడాలి.
This post was last modified on June 2, 2021 6:09 am
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…