భారతదేశం ఇక లాక్ డౌన్ నుంచి బయటకు రావడానికి పూర్తిగా సిద్ధమైపోయినట్టే కనిపిస్తోంది. కొన్నాళ్లుగా సడలింపులతో మెల్లగా కొన్ని కార్యకలాపాలకు అనుమతిస్తూ వచ్చిన కేంద్రం ఈ రోజు సంచలన నిర్ణయం వెల్లడించింది. మే 12 నుంచి సాధారణ ప్రజలకు రైళ్లు ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రభుత్వం దీనిని ఆమోదించింది. ఇది సడెన్ సర్ ప్రైజ్ అని చెప్పాలి.
ఎందుకంటే లాక్ డౌన్ తీసేసినా రైళ్లు, బస్సులు, సినిమా హాళ్లు చాలా ఆలస్యంగా ప్రారంభిస్తారని అందరూ భావించారు. కానీ ఇలా ఉంటే ఎకానమీ ఎన్నటికీ కోలుకోలేదని… ప్రయాణాలు నిషేధించినంత కాలం లాక్ డౌన్ తీసేసినా ఉపయోగం ఉండదని భావించిన కేంద్రం రైళ్ల ప్రయాణాలకు పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు రైల్వే శాఖ ఓ ప్రకటన విడుదల చేస్తూ… రేపటి నుంచి రిజర్వేషన్లు చేసుకోవచ్చని, ఎల్లుండి నుంచి రైళ్లు నడుస్తాయని పేర్కొంది.
అయితే, దేశమంతటా అన్ని రైళ్లు ప్రారంభించడం లేదు. ఢిల్లీ నుంచి ప్రధాన నగరాలకు మాత్రమే ప్రస్తుతం 15 రైళ్లను తొలిదశలో నడుపుతారు. తద్వారా ప్రయాణాల్లో భౌతిక దూరం, మాస్కులు, ప్రయాణికుల రక్షణ వంటివన్నీ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తారు. తదనంతరం ప్రారంభయమయ్యే అన్ని రైళ్లకు ఇవే నిబంధనలు ఉంటాయి.
ఈ రైళ్లు ఢిల్లీ నుంచి కింది ప్రాంతాలకు నడుస్తాయి
- దిబ్రూఘర్
- అగర్తలా
- హౌరా
- పాట్నా
5.బిలాస్ పూర్ - రాంచి
- భువనేశ్వర్
- సికింద్రాబాద్
- బెంగుళూరు
10.చెన్నై - త్రివేండ్రం
- మడగావ్
- ముంబై సెంట్రల్
- అహ్మదాబాద్
- జమ్ముతావి.
వీటికి రేపు సాయంత్రం 4 గంట నుంచి రిజర్వేషన్లు చేసుకోవచ్చు.