రాజకీయంగా ఎంతటి శత్రుత్వం అయినా ఉండొచ్చు. అంతమాత్రాన కనీస గౌరవ మర్యాదల్ని అస్సలు విడిచి పెట్టకూడదు. మహిళల విషయంలో బెంగాల్ బీజేపీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ఛీప్ గా ఉండటమే కాదు.. కమలనాథుల నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు కూడా వస్తాయా? అన్న విస్మయం వ్యక్తమవుతోంది. బెంగాల్ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్న సంగతి తెలిసిందే. పోటీ ఎంత తీవ్రంగా ఉంటే మాత్రం.. మర్యాదల్ని వదిలేసి.. గల్లీ నేతలు సైతం మాట్లాడుకోలేనంత దారుణమైన వ్యాఖ్య చేయటమా? అన్న విస్మయం వ్యక్తమవుతోంది.
తాజాగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలపై విస్మయం వ్యక్తవుతోంది. పురూలియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. మమత తన విరిగిన కాలిని అందరికి చూపించాలని అనుకుంటున్నారని.. అలాంటప్పుడు ఆమె చీర కట్టుకోవటం ఏందుకు? అని ప్రశ్నించారు.
దానికి కొనసాగింపుగా.. ‘చెడ్డీలు వేసుకుంటే అందరికి స్పష్టంగా కనిపిస్తుంది కదా’ అంటూ చేసిన అమర్యాదకరమైన వ్యాఖ్య ఇప్పుడు వివాదంగా మారింది. ఆయన చేసిన వ్యాఖ్యల్నిపలువురు తప్పుపడుతున్నారు. అందరూ ఆగ్రహం వ్యక్తం చేసిన దానికి తగ్గట్లే ఆయన వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. ‘‘ఒక కాలు కనిపించి మరో కాలు కనిపించకుండా ఆమె చీర కట్టుకుంటున్నారు. నేనెప్పుడూ ఇలా చీర కట్టుకోవటం చూడలేదు. నీ కాళ్లు చూపించాలని అనుకుంటే చీర కట్టుకోవటం ఎందుకు? చెడ్డీలు వేసుకోవచ్చు కదా’ అని దారుణ వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీఎంసీ నేతలు తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఈ చెడ్డీ వ్యాఖ్యలు దుమారంగా మారనున్నాయి. ఛీ.. ఛీ .. అనిపించేలా ఈ చెడ్డీ వ్యాఖ్యలేంది కమలనాథులు?
This post was last modified on March 25, 2021 2:29 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…