రాసలీలల సీడీ కేసులో ఊహించని ట్విస్టు

కర్ణాటకలోనే కాదు.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది కర్ణాటక రాసలీలల కేసు. తన దగ్గరకు ఉద్యోగం కోసం వచ్చిన మహిళనను మోసం చేసి.. ఆమెను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారంటూ కర్ణాటక రాష్ట్ర మంత్రి రమేశ్ జార్కిహోళిపై కంప్లైంట్ చేయటం.. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చివరకు బీజేపీ అధినాయకత్వం ఒత్తిడితో మంత్రి తన పదవికి రాజీనామా చేశారు.

ఈ సీడీలోని మహిళ కనిపించకపోవటం ఒక ఎత్తు అయితే.. మరికొందరు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి బ్లాక్ మొయిల్ చేస్తున్నట్లుగా విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ సీడీ వ్యవహారాన్ని వెలుగులోకి తీసకొచ్చిన సామాజిక కార్యకర్త దినేశ్ తాను పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ ను వెనక్కి తీసుకున్నారు.

తాజాగా తన న్యాయవాదితో వచ్చిన దినేశ్.. తాను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. మంత్రులపై దినేశ్ కుట్రలు చేస్తున్నారని ఒకవైపు.. మరోవైపు డీల్ కుదుర్చుకొని బ్లాక్ మొయిల్ చేస్తున్నట్లుగా మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆరోపణలు చేయటంతో తాను విసిగిపోయినట్లుగా ఆయన పేర్కొన్నారు. అందుకే తాను కేసును వెనక్కి తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు.

సంచలనంగా మారిన సీడి వ్యవహారం ఇప్పుడు కంప్లైంట్ నే వెనక్కి తీసుకోవటంతో.. ఈ ఉదంతాన్ని కేసు కట్టలేదని పోలీసులు చెబుతున్నారు. సీడీలోని మహిళ మొదట కనిపించకపోవటం..కంప్లైంట్ చేసిన సామాజికవేత్త వెనక్కి తగ్గటం చూస్తే.. కనిపించని వ్యవహారం ఏదో తెర వెనుక పెద్ద ఎత్తున జరుగుతుందన్న భావన వకలుగక మానదు.