Political News

తెరవెనుక చక్రం తిప్పుతోందా ?

సరిగ్గా ఎన్నికల ముందు ఈమధ్యనే జైలు నుండి విడుదలైన వి. శశికళ తెరవెనుక నుండి చక్రం తిప్పుతున్నారా ? తమిళ రాజకీయాలను చూస్తుంటే అదే అనుమానం పెరిగిపోతోంది. ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి తానే అని శశికళ ఎంత చెప్పుకున్నా సాధ్యమయ్యేట్లు కనిపించటం లేదు. ఇదే సమయంలో రాబోయే ఎన్నికల్లో డీఏకే కూటమిదే అధికారం అని సర్వేలు చెబుతున్నాయి. జరుగుతున్న పరిణామాలు తనకు ఏమాత్రం ఆశాజనకంగా లేవని శశికళకు అర్ధమైపోయింది.

దీంతో ఏమి చేయాలో అర్ధంకాని చిన్నమ్మ చివరకు ఇటు ఏఐఏడీఎంకే కూటమి, అటు డీఎంకే కూటమిలోని అసంతృప్త పార్టీలను కూడగట్టి మూడో కూటమి ఏర్పాటు జరుగుతోంది. తృతీయ కూటమికి తెరపై నటుడు, సమత్తువ మక్కల్ కట్చి (ఎస్ఎంకే) అధ్యక్షుడు శరత్ కుమార్ కనిపిస్తున్నా తెరవెనుక మాత్రం శశికళే ఉందనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. ఈమధ్యనే వీళ్ళద్దరి మధ్య భేటి జరగటమే ఈ ప్రచారానికి కారణమైంది.

తృతీయకూటమిలో చేరాల్సిందిగా ఇప్పటికే మక్కళ్ నీది మయ్యం(ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమలహాసన్ కు కూడా ఆహ్వానం అందిదట. అలాగే పై రెండు కూటముల్లోని అసంతృప్త పార్టీలకు కూడా గాలం వేస్తున్నారట. ఏఐఏడీఏంకే కూటమిలో బీజేపీ, పీఎంకే, డీఎండీకేతో పాటు మరో రెండు చిన్నపార్టీలున్నాయి. అలాగే డీఎంకే కూటమిలో కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే పార్టీలున్నాయి. 234 అసెంబ్లీ సీట్లున్న రాష్ట్రంలో కూటముల మధ్య సీట్ల సర్దుబాటు ఎప్పుడూ సమస్యలుగానే ఉంటాయి.

ఇపుడా సమస్యపైనే మూడోకూటమి దృష్టి పెట్టిందట. సీట్ల సర్దుబాటులో అసంతృప్తులుగా ఉన్న పార్టీల అధినేతలకు గాలం వేస్తున్నట్లు సమాచారం. ఇండియా జననాయక కట్చి (ఐజెకే) పార్టీ తృతీయ కూటమిలో చేరింది. ఐజేకే తర్వాతే శరత్ కుమార్ కూడా తృతీయకూటమిలో చేరటంతో అందరు ఆశ్చర్యపోయారు. రేపో మాపో కమల్ హాసన్ తో కూడా తృతీయ నేతలు భేటీ అవబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తృతీయ కూటమి అధికారంలోకి రావటం సంగతిని పక్కనపెట్టేస్తే ఏఐఏడీఎంకేని దెబ్బ కొట్టడమే శిశకళ లక్ష్యంగా అర్ధమవుతోంది. చూడాలి చివరకు ఏమవుతుందో.

This post was last modified on March 1, 2021 5:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అకీరా అరంగేట్రంపై రేణు…

ఓవైపు నందమూరి వారసుడు మోక్షజ్ఞ అరంగేట్రానికి రంగం సిద్ధమవుతుండగా.. ఆ తర్వాత మోస్ట్ అవైటెడ్ డెబ్యూ అంటే అకీరా నందన్‌దే.…

59 minutes ago

భీమ్స్‌కు ‘మెగా’ ఛాన్స్?

టాలీవుడ్లో సంగీత దర్శకుడు భీమ్స్‌ది ఎంతో ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయక ప్రయాణం. పేద కుటుంబానికి చెందిన అతను.. యుక్త వయసులో పడ్డ…

2 hours ago

జేసీ నోట `క్ష‌మా` మాట‌.. స‌ర్దుకున్న‌ట్టేనా?

ఏపీలో కూటమిగా ఉన్న టీడీపీ-బీజేపీ మ‌ధ్య స‌ఖ్య‌త బాగానే ఉన్నా.. క్షేత్ర‌స్థాయిలో కొన్ని కొన్ని నియోజ‌క వ‌ర్గాల్లో చోటు చేసుకుంటున్న…

2 hours ago

ప్ర‌గ‌తి ర‌థం రైలు బండి… రేవంత్ జ‌మానాలో మెరుపులు!

ప్ర‌గ‌తి ర‌థం రైలు బండి పోతున్నాది.. అంటూ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు పాడుకుంటున్నారు. ఏడాది పాల‌న‌లో తెలంగాణ‌లో సీఎం రేవంత్…

2 hours ago

జ‌నం… జ‌గ‌న్‌ను మ‌రిచిపోతున్నారు: నారా లోకేష్‌

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్‌ను…

4 hours ago

‘డాకు’ కోసం దుల్కర్‌ను అనుకున్నారు కానీ…

ప్రస్తుతం పెద్ద సినిమాల్లో ప్రత్యేక అతిథి పాత్రలను క్రియేట్ చేసి పేరున్న నటులతో వాటిని చేయించడం ట్రెండుగా మారింది. ఈ…

4 hours ago