Political News

చంద్రబాబు 3సీ ఫార్ములా… ఇది కలెక్టర్ల కోసమే

ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల కోసం కొత్తగా 3సీ ఫార్ములాను తీసుకువచ్చారు. వినూత్న ఆలోచనలతో పరిపాలనలో నూతన సంస్కరణలను ప్రవేశపెట్టడంలో చంద్రబాబు ముందుంటారు. ఈ క్రమంలోనే ఆయన కలెక్టర్ల కోసం కొత్త ఫార్ములాను రూపొందించి వారి ముందు ఉంచారు.

రెండు రోజులుగా ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్నారు. రెండో రోజు ఆయన కలెక్టర్లకు దశ నిర్దేశం చేశారు. పెట్టుబడులను రాబట్టేందుకు కలెక్టర్లకు 3సీ ఫార్మూలను నిర్దేశించారు. అదే కమిట్మెంట్… కన్విన్స్… కో ఆపరేట్. జిల్లాల్లో పెట్టబుడులను రాబట్టేలా కలెక్టర్లు కమిట్మెంట్‌తో పెట్టుబడిదారులను అన్వేషించి… పెట్టుబడులు పెట్టేందుకు కన్విన్స్ చేసి.. ముందుకు తీసుకురావాలంటూ సూచించారు. 

ఆయా జిల్లాలకున్న ప్రత్యేకతలను, అనుకూలతలను దృష్టిలో పెట్టుకుని ఆయా రంగాల్లో అభివృద్ధి చేయాలి. జిల్లాలకున్న అడ్వాంటేజీలను ప్రమోట్ చేసి పెట్టుబడులను ఆకర్షించాలన్నారు. జిల్లాల్లో వచ్చిన పెట్టుబడులు, ఉద్యోగాలు, తలసరి ఆదాయం ఎంతమేర పెంచాం అన్నదానిపై జిల్లా కలెక్టర్లు దృష్టి పెట్టాలి.

తదుపరి సమావేశం నుంచి ఏ జిల్లా కలెక్టర్ ఎంతమేర పరిశ్రమల్ని ప్రోత్సహించారన్న దానిపై సమీక్షిస్తాం అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పెట్టుబడులపై జిల్లాల్లో కూడా సమావేశాలు నిర్వహించాలి. పెట్టుబడులు రాబట్టేందుకు కలెక్టర్లు చొరవ తీసుకోవాలి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంపై జిల్లాల వారీగా ర్యాంకులిస్తాం అని సీఎం ప్రకటించారు.

This post was last modified on March 12, 2026 7:21 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

5 minutes ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

1 hour ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

2 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

3 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

4 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

4 hours ago