స్టెరీన్ గ్యాస్.. ఈ ఉదయం నుంచి వార్తల్లో ప్రధానంగా వినిపిస్తున్న పేరిది. విశాఖపట్నంలోని గోపాలపట్నంలో ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి లీకై.. చుట్టుపక్కల ఐదు గ్రామాల ప్రజల్ని ఉక్కిరి బిక్కిరి చేసి.. ఎనిమిది మంది ప్రాణాలు కూడా పొట్టన పెట్టుకున్న గ్యాస్ ఇది. దీని కారణంగా వందల మంది ఆసుపత్రుల పాలయ్యారు. మరింత మంది ప్రాణాల కోసం పోరాడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఏంటీ స్టెరీన్ గ్యాస్.. ఇది ఎందుకు లీక్ అయింది.. దీని ప్రభావం మనుషులపై ఎలా ఉంటుంది అనే ప్రశ్నలు తలెత్తాయి. వీటికి నిపుణులు సమాధానం చెబుతున్నారు. లాక్ డౌన్ కారణంగా ఎల్జీ పాలిమర్స్ సంస్థ నెలన్నర పాటు మూతపడి ఉండగా.. రెండు రోజుల కిందటే ప్రభుత్వం సడలింపులు ఇవ్వడంతో దాన్ని తెరించారు. 213 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ కంపెనీలో.. రోజూ 417 టన్నుల పాలిస్టిరీన్ ఉత్పత్తి జరుగుతుంది. ఐతే స్టోరీన్ గ్యాస్‌ను ముడిసరుకుగా ఉపయోగించి ఈ పాలిస్టరీన్ తయారు చేస్తారు.
లాక్ డౌన్ కారణంగా నెలన్నరగా కంపెనీలో పనులు జరగకపోవడంతో స్టెరీన్ గ్యాస్‌ను నిల్వ ఉంచే చోట ఒత్తిడి పెరిగిందని.. ఫ్యాక్టరీని పున:ప్రారంభించడంతో గ్యాస్ లీక్ అయిందని అంటున్నారు. ఈ గ్యాస్ మిగతా గ్యాస్ వాయువులతో పోలిస్తే బరువైంది. దీని డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఈ గ్యాస్‌ను పీలిస్తే నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. మెదడు మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. వెంటనే పడే ప్రభావం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. ఈ గ్యాస్‌ను ఎక్కువ మోతాదులో తీసుకుంటే కిడ్నీ, క్యాన్సర్ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో కూడా సమస్యలు తలెత్తవచ్చు.
గురువారం ఈ గ్యాస్‌ను ఎక్కువ మోతాదులో పీల్చిన వారికి శ్వాస అందక అపస్మారక స్థితికి చేరడం, ప్రాణాలు కోల్పోవడం జరిగిందని నిపుణులు అంటున్నారు. ఈ గ్యాస్ ప్రభావం 3 కిలోమీటర్ల పరిధిలోని ఐదు గ్రామాలపై ఉండగా.. అక్కడి వాళ్లందరినీ ఖాళీ చేయించి.. వాటర్ స్టెరిలైజేషన్ చేయడం ద్వారా గ్యాస్ ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.
This post was last modified on May 7, 2020 4:43 pm
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…