కేంద్రప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ను చూసిన తర్వాత అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ధక్షిణాది రాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడు, కేరళ కు నిధుల వరద పాటించారు. కర్నాటక తమ పాలిత రాష్ట్రమే కాబట్టే మెట్రో రైలు ప్రాజెక్టుకు భారీ నిధులు కేటాయించారు.
ఇక తమిళనాడు, కేరళకు ఎందుకు అంత భారీగా నిధులు కేటాయించారు ? ఎందుకంటే తొందరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టే అని అర్ధమైపోతోంది. ఎలాగైనా కేరళ, తమిళనాడు ఎన్నికల్లో బోణి కొట్టాలని బేజేపీ శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటివరకు పెద్దగా అవకాశాలు కనబడటం లేదు. అందుకనే ఏఐఏడిఎంకే లాంటి పార్టీతో పొత్తపెట్టుకుని ఎన్నికల్లో లబ్దిపొందాలని గట్టి ప్రయత్నాల్లో ఉంది.
రాజకీయంగా పొత్తుల విషయాన్ని పక్కన పెట్టేస్తే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఎలాగూ వచ్చింది కాబట్టి తమిళనాడు, కేరళపై కేంద్రానికి అపారమైన ప్రేమ ఉన్నట్లు చూపించాలనే ప్రయత్నం జరిగింది. చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టుకు ఏకంగా రూ. 63,246 కోట్లను కేటాయించింది. అలాగే కేరళ లోని మెట్రో రైలు ప్రాజెక్టుకు సుమారు రూ. 18 వేల కోట్లు కేటాయించారు. ఇక బెంగుళూరు మెట్రో ప్రాజెక్టుకు రూ. 14,788 కోట్లు కేటాయించారు.
బడ్జెట్ కేటాయింపులు చూస్తుంటే కేరళ, తమిళనాడులో జరగబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే వేలాది కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పకతప్పదు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే పై రెండు రాష్ట్రాల్లో వేలాది కోట్లు కేటాయించారు బాగానే ఉంది. మరి కేంద్రం అశించినట్లుగా కేరళ, తమిళనాడుల్లో బీజేపీ బోణి కొట్టకపోతే ఏమవుతుంది ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.