ప్రస్తుతం ఏపీ, తెలంగాణల మధ్య నీటి వాటాలపై సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావుల మధ్య మాటల యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాలను వాడుకోవడంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారని హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. అయితే, వైఎస్సార్, జగన్ ల కోసం తెలంగాణ నీటి హక్కులను తాకట్టుపెట్టింది హరీశ్ రావు అని తాజాగా రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఏపీ మాజీ సీఎం జగన్ త పాటు ఏపీ సీఎం చంద్రబాబు, కేసీఆర్ లపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రోళ్లు 11 టీఎంసీల కృష్ణా జలాలను రాయలసీమ, శ్రీశైలం నుంచి వెనక నుంచి వెనకనే జలదొంంగల్లాగా, గజదొంగల్లాగా దోచుకుపోతున్నారని రేవంత్ ఆరోపించారు. పోతిరెడ్డిపాడు, హంద్రీ నీవా, మాల్యాద్రి ముచ్చమర్రి ప్రాజెక్టు నుంచి తరలించుకుపోతుంటే జగన్ పళ్లు తోమావా..జగన్ కు గులాంగిరీ చేశావా అంటూ హరీశ్ రావుపై రేవంత్ మండిపడ్డారు. 2015లో ఉమాభారతిని ఢిల్లీలో చంద్రబాబు, కేసీఆర్, హరీష్, ఢిల్లీలో కలిశారని, తెలంగాణకు మరణ శాసనం రాసి సంతకాలు పెట్టారని విమర్శించారు. కష్ణా జలాల్లో 811 టీఎంసీలలో తెెలంగాణకు 299 టీఎంసీలు చాలని, ఏపీకి 512 టీఎంసీలు ఇవ్వొచ్చని కేసీఆర్, హరీశ్ రావు సంతకం పెట్టారని విమర్శించారు.
శాశ్వతంగా తెలంగాణ ప్రజల హక్కులను మామా అల్లుళ్లు కలిసి ఆంధ్రోళ్లకు తాకట్టు పెట్టారని ఆరోపించారు. చంద్రబాబు మోచేతి నీళ్లు కేసీఆర్ తాగితే..వైఎస్ఆర్ మోచేతి నీళ్లు హరీష్ రావు…తాగాడని విమర్శలు గుప్పించారు. హరీశ్ రావు నిజమైన గురువు వైఎస్సార్ అని, కనీసం వార్డు మెంబర్ కూడా కాని హరీశ్ రావును 2004లో ఎమ్మెల్యేగా, ఆ తర్వాత మంత్రిగా చేసిన ఘనత వైఎస్సార్ ది అని అన్నారు. అందుకే, జగన్, వైఎస్సార్ లను హరీష్ రావు తిట్టడని అన్నారు.
మామ కేసీఆర్ నైనా ప్రైవేటుగా తిడతాడని, కానీ, వారిని పల్లెత్తు మాటనడని ఎద్దేవా చేశారు. వైఎస్సాఆర్ మోచేతి నీళ్లు తాగి, ఆయన విసిరిన ఎంగిలి మెతుకులు తిని, రోజమ్మ రొయ్యల పులుసు తిని తెలంగాణ ప్రజల హక్కులు తాకట్టు ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చారని ఆరోపించారు. ఆ దుర్మార్గాన్ని రేవంత్ రెడ్డిపై రుద్దాలి అనుకుంటున్నారని, తాను నిఖార్సైన తెలంగాణ బిడ్డను అని రేవంత్ అన్నారు.
This post was last modified on November 26, 2026 10:23 pm
ఈ రోజుల్లో చిన్న సినిమాలకు కూడా వర్కింగ్ డేస్ బాగా పెరిగిపోతున్నాయి. ఒకప్పటిలా నెలా రెండు నెలల్లో సినిమాలు తీసే…
అత్యంత వివాదాల నడుమ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూతురు అంజలీ, డాక్టర్ సోమల రఘురామి రెడ్డి వివాహం సన్నిహిత…
గత కొన్నేళ్లుగా మలయాళంలో చాలా థ్రిల్లర్లు వచ్చాయి. వాటిలో కొన్ని అద్భుతం అనిపించగా, మరికొన్ని తలనెప్పి కూడా తెప్పించాయి. అయినా…
తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఇటీవల ఒక భక్తుడు 121 కిలోల బంగారు ఆభరణాలు కానుకగా సమర్పించనున్నట్లు…
అక్కినేని అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు బ్రేక్ వేస్తూ అఖిల్ కి తొలి హిట్ గా నిలిచిన లెనిన్ జపాన్ దేశానికి వెళ్తోంది.…
సాత్విక వీరవల్లి.. గత వారం రోజులుగా చర్చనీయాంశం అవుతున్న పేరు. దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాదినేని దర్శకత్వంలో గీతా…