అత్యంత వివాదాల నడుమ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూతురు అంజలీ, డాక్టర్ సోమల రఘురామి రెడ్డి వివాహం సన్నిహిత బంధువుల సమక్షంలో జరిగింది. వివాహ వేడుకలు బెంగళూరు సమీపంలోని నందిహిల్స్‌లో ఉన్న ‘మనధీర’ రిసార్టులో జరిగాయి. తొలుత క్రైస్తవ పద్దతిలో వివాహం జరిగింది. తర్వాత హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిపించారు.
అయితే అందరూ అనుకున్నట్టుగానే మేనకోడలి వివాహానికి జగన్, ఆయన సతీమణి భారతి హాజరు కాలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను స్వయంగా కలిసి ఆహ్వానించిన షర్మిల సోదరుడు జగన్ కు మాత్రం ఆహ్వానించలేదని తెలుస్తోంది.
యలహంకా ప్యాలెస్ లో తన కూతురు అంజలీ వివాహం చేయాలని షర్మిల ప్లాన్ చేసుకున్నారు. పెళ్లి పత్రికల మీద యలహంకా వేదిక చిరునామా ఇచ్చారు. అయితే యలహంకాలో పెళ్లి చేసేందుకు జగన్ అంగీకరించలేదు. దాంతో అన్నా చెల్లెళ్ళ మధ్య వివాదం మరింతగా ముదిరింది.
అయితే ఆస్తి వివాదాలు ఎలా ఉన్నప్పటికీ ఒక అన్నగా జగన్ ఈ పెళ్ళికి హాజరైవుంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రిగా, వైసీపీ అధినేతగా ప్రజా జీవితంలో వున్న ఆయన సొంత మేనకోడలి వివాహానికి దూరంగా వుండటం విమర్శలకు తావిస్తుంది. అయినా సరే జగన్ కు ఇవేమి పట్టినట్టు లేదు. ప్రజలు అన్నీ విషయాలు గమనిస్తున్నారన్న కనీస ఆలోచన కూడా ఆయనకు లేకుండా పోయిందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
జగన్ పరిపాలన విధానం కంటే కూడా ఆయన వ్యక్తిగత విషయాలే ఎక్కువగా చర్చకు దారితీస్తున్నాయి. ఇప్పటికే సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బాబాయ్ హత్యలో అంతిమ లబ్ధిదారుడు జగనే అని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఒకవైపు అది కొనసాగుతుండగానే సొంత చెల్లెలితో ఆస్తి వివాదం రచ్చకెక్కింది. ఆస్తి కోసం తోడబుట్టిన చెల్లెల్ని ఇంటి నుంచి గెంటేశాడన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.
వివేకానంద రెడ్డి హత్య, షర్మిల ఆస్తి వివాదం వెరసి కడప జిల్లాలో వైసీపీ ఓటమి మూట కట్టుకుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మేనకోడలి వివాహానికి సైతం డుమ్మా కొట్టడం జగన్ కు పెద్ద మైనస్ పాయింట్ అనే చెప్పాలి. తాను అధికారంలో వున్నప్పుడు రాష్ట్రంలోని చిన్నారులకు మేనమామగా ప్రచారం చేసుకున్న ఆయన ఇప్పుడా హక్కును కోల్పోయారనే చెప్పాలి.
This post was last modified on November 26, 2026 10:00 pm
ఈ రోజుల్లో చిన్న సినిమాలకు కూడా వర్కింగ్ డేస్ బాగా పెరిగిపోతున్నాయి. ఒకప్పటిలా నెలా రెండు నెలల్లో సినిమాలు తీసే…
గత కొన్నేళ్లుగా మలయాళంలో చాలా థ్రిల్లర్లు వచ్చాయి. వాటిలో కొన్ని అద్భుతం అనిపించగా, మరికొన్ని తలనెప్పి కూడా తెప్పించాయి. అయినా…
తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఇటీవల ఒక భక్తుడు 121 కిలోల బంగారు ఆభరణాలు కానుకగా సమర్పించనున్నట్లు…
అక్కినేని అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు బ్రేక్ వేస్తూ అఖిల్ కి తొలి హిట్ గా నిలిచిన లెనిన్ జపాన్ దేశానికి వెళ్తోంది.…
సాత్విక వీరవల్లి.. గత వారం రోజులుగా చర్చనీయాంశం అవుతున్న పేరు. దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాదినేని దర్శకత్వంలో గీతా…
ఇప్పుడు సెలబ్రిటీ స్టేటస్ తెచ్చుకున్న చాలామంది ఒకప్పుడు సామాన్యులే. అలా కామన్ మ్యాన్ గా ఉన్నపుడు సోషల్ మీడియాలో పెట్టిన…