Movie News

జపాన్ లెనిన్ సరే… అసలు వార్త ఎప్పుడు

అక్కినేని అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు బ్రేక్ వేస్తూ అఖిల్ కి తొలి హిట్ గా నిలిచిన లెనిన్ జపాన్ దేశానికి వెళ్తోంది. డిసెంబర్ 11 అక్కడ గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. వినరో భాగ్యము విష్ణుకథ ఫేమ్ మురళికిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ రస్టిక్ విలేజ్ డ్రామాని మాస్ ఆడియన్స్ బాగా ఆదరించారు. రెగ్యులర్ లవ్ స్టోరీలను దూరం పెట్టి అఖిల్ తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాన్నే ఇచ్చింది. అయితే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నది జపాన్ లెనిన్ కాదు.

నెలలు గడిచిపోతున్నా అఖిల్ కొత్త సినిమా ప్రకటన ఇప్పటిదాకా రాలేదు. ఇకపై గ్యాప్ ఇవ్వనని వేగంగా చేస్తానని పబ్లికి స్టేజి మీద హామీ ఇచ్చిన అఖిల్ ఇప్పటిదాకా ఆ మాట నిలబెట్టుకునే దిశగా అడుగులు వేయలేదు. సక్సెస్ వచ్చినప్పుడు జాగ్రత్త పడటం అవసరమే. అలాని పదేళ్ల తర్వాత కూడా నెమ్మదిగా నడుస్తానంటే కష్టం. మురళికిషోర్ తోనే ఇంకో మూవీ చేసేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం కథ సిద్ధంగా లేదని టాక్. అందుకే అక్కినేని ఫ్యామిలీ వేరే ఆప్షన్ల వైపు చూస్తోందని టాక్.

నాగార్జున ఆల్రెడీ నెమ్మదించారు. తన కెరీర్ బిగ్గెస్ట్ మైలురాయి కింగ్ 100 కోసం చాలా సమయం తీసుకున్నారు. బిగ్ బాస్ షో నడిపిస్తున్నారు కానీ గతంలో పోల్చుకుంటే దాని ఆదరణ తగ్గినట్టు వ్యూస్ చెబుతున్నాయి. ఇకపై పుంజుకుంటుందో లేదో కూడా చెప్పలేని పరిస్థితి. కూలి, కుబేరలో సపోర్టింగ్ రోల్స్ చేశాక నాగ్ తిరిగి హీరో రూటుకి వచ్చేశారు. తమిళ దర్శకుడు ఆర్ కార్తీక్ కి అవకాశం ఇవ్వడం ద్వారా రిస్క్ తీసుకున్నట్టు అనిపిస్తున్నా ఇన్ సైడ్ టాక్ అయితే పాజిటివ్ గానే ఉంది.

నాగచైతన్య గురించి తెలిసిందే. వృషకర్మ కోసం చాలా కష్టపడ్డాడు. డిసెంబర్ 4 తీర్పు రానుంది. నెక్స్ట్ ప్రాజెక్టు త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. క్లాక్స్ దర్శకత్వంతో సాత్విక వీరవల్లి హీరోయిన్ గా త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. ఇంతే క్లారిటీ అఖిల్ కు ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. లెనిన్ ఎలాగూ మార్కెట్ సృష్టించి ఇచ్చింది కాబట్టి దాన్ని నిలబెట్టుకునే అడుగులు వేయాలనేది వాళ్ళ ఆకాంక్ష. మరి అఖిల్ వీలైనంత త్వరగా ఆ శుభవార్త చెప్పేస్తే టెన్షన్ ఉండదు. 

This post was last modified on November 26, 2026 5:35 pm

Share

Recent Posts

సాత్విక తెలుగమ్మాయే.. తెలుగు రాదు.. ఎందుకంటే?

సాత్విక వీరవల్లి.. గత వారం రోజులుగా చర్చనీయాంశం అవుతున్న పేరు. దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాదినేని దర్శకత్వంలో గీతా…

17 minutes ago

దర్శకుడి పాత పోస్టులు తవ్వుతున్నారు

ఇప్పుడు సెలబ్రిటీ స్టేటస్ తెచ్చుకున్న చాలామంది ఒకప్పుడు సామాన్యులే. అలా కామన్ మ్యాన్ గా ఉన్నపుడు సోషల్ మీడియాలో పెట్టిన…

1 hour ago

ఖైదీ సేతుపతి చేసి ఉంటే..?

తమిళ స్టార్ హీరో కార్తి కెరీర్లో బెస్ట్ అనదగ్గ చిత్రాల్లో ఖైదీ ఒకటి. లోకేష్ కనకరాజ్ ను సౌత్ ఇండస్ట్రీలో…

2 hours ago

అంగ‌బ‌ల‌మే కాదు… ఆర్థికంగానూ టీడీపీనే ఫ‌స్ట్‌!

రాజ‌కీయ పార్టీల‌కు కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల బలం అత్యంత ముఖ్యం. ఈ విష‌యంలో ఏ చిన్న తేడా వ‌చ్చినా.. గెలుపునే కాదు..…

2 hours ago

చంద్రబాబు, జగన్ ఎప్పుడైనా కొట్టుకున్నారా?

రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరుగుతున్న వేళ ఎక్కడ చూసినా ఘర్షణలు, గొడవలు, దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్నా…

2 hours ago

“మీరు ఒంట‌రిగా ఉన్నారా?“… అయితే ఈ `మోసం` మీకోస‌మే!

సోష‌ల్ మీడియాను హ్యాండిల్ చేసే విష‌యంలో అప్ర‌మ‌త్త‌త అత్యంత ముఖ్యం. క‌నిపించిన ప్ర‌తి సందేశాన్నీ.. ఆక‌ట్టుకునే మాట‌ల‌తో ఆక‌ర్షించే అమ్మాయిల…

2 hours ago