Movie News

గొప్పగా చెప్పుకునేంతగా ‘హాఫ్’లో ఏముంది

గత కొన్నేళ్లుగా మలయాళంలో చాలా థ్రిల్లర్లు వచ్చాయి. వాటిలో కొన్ని అద్భుతం అనిపించగా, మరికొన్ని తలనెప్పి కూడా తెప్పించాయి. అయినా సరే వీటిని తీయడం మల్లువుడ్ మేకర్స్ మానుకోవడం లేదు. తాజాగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా (ఐఫి)లో మన శంకరవరప్రసాద్ గారు, భక్త కన్నప్ప లాంటి తెలుగు సినిమాల ప్రదర్శన జరిగిన సంగతి తెలిసిందే. ఇవి మనం చూసినవే కానీ హాఫ్ అనే మలయాళ మూవీ గురించి ఆహుతులు తెగ మాట్లాడుకుంటున్నారు.

కేవలం గంటా నలభై నిమిషాలలోపే ఉన్న ఈ రివెంజ్ థ్రిల్లర్ కి సంజాద్ దర్శకత్వం వహించారు. ఇతను గతంలో తీసిన గోళం మంచి విజయం సాధించింది. ఓటిటిలో విపరీతంగా చూశారు. ఇప్పుడీ హాఫ్ కు చిత్రోత్సవాల్లో వస్తున్న స్పందన చూసి తెలుగుతో పాటు ఇతర భాషల్లో డబ్బింగ్ చేసే జనవరిలో విడుదల చేసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారు. హాఫ్ లో అమలా పాల్, వినీత్ లాంటి మనకు తెలిసిన ఆర్టిస్టులు ఉన్నారు. ఇంతగా జనాల దృష్టిని ఆకర్షించే థ్రిల్లింగ్ కంటెంట్ ఏముందో ఓ లుక్ వేద్దాం.

ఇదో కవల అన్న చెల్లెలి కథ. ఈతన్, ఐవి అనే ట్విన్స్ పగటిపూట మాములు మనుషులు. రాత్రి మాత్రం ఒంట్లో ఉన్న రక్తపిశాచి కణాల వల్ల వ్యాంపైర్స్ గా మారుతూ ఉంటారు. ఓసారి రాజస్థాన్ లో రోడ్డు ప్రయాణం చేస్తుండగా ఒక దొంగల ముఠా దాడి చేసి, చాలా దారుణంగా హింసించి, ఇద్దరూ చనిపోయారని భావించి ఎడారిలో పారేసి పోతారు. చీకటి పడగానే ఈతన్, ఐవి దెబ్బలను పోగొట్టుకుని ఒక్కో దొంగని వెతికి వేటాడి కిరాతకంగా చంపడం మొదలుపెడతారు. వీళ్ళ రక్తం వెనుక ఉన్న రహస్యమే అసలు స్టోరీ.

మొదటి పావు గంట సెటప్ చేయడానికి కొంత టైం తీసుకున్నా ఆ తర్వాత స్క్రీన్ ప్లే పరుగులు పెడుతుంది. ముఖ్యంగా అన్న చెల్లెలు కలిసి దొంగలను వేటాడే క్రమం, దానికన్నా ముందు వీళ్ళ మధ్య జరిగే హింస చాలా డెప్త్ గా చూపించారు. క్లైమాక్స్ ఘటాన్ని మెయిన్ హైలైట్ గా చెప్పుకోవచ్చు. యాక్షన్ ఎపిసోడ్లు చాలా కొత్తగా ఉన్నాయి. ఈ పాయింట్ కు దగ్గరగా అనిపించేలా బాలీవుడ్ లో ఒకప్పుడు జునూన్ వచ్చింది కానీ అంతగా ఆకట్టుకోలేదు. కానీ హాఫ్ మాత్రం టాక్ అఫ్ ది ఆడియన్స్ అయ్యేలా ఉంది.

This post was last modified on November 26, 2026 5:38 pm

Share

Recent Posts

శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు ఇచ్చింది ఇతడే…

తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఇటీవల ఒక భక్తుడు 121 కిలోల బంగారు ఆభరణాలు కానుకగా సమర్పించనున్నట్లు…

3 hours ago

జపాన్ లెనిన్ సరే… అసలు వార్త ఎప్పుడు

అక్కినేని అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు బ్రేక్ వేస్తూ అఖిల్ కి తొలి హిట్ గా నిలిచిన లెనిన్ జపాన్ దేశానికి వెళ్తోంది.…

4 hours ago

సాత్విక తెలుగమ్మాయే.. తెలుగు రాదు.. ఎందుకంటే?

సాత్విక వీరవల్లి.. గత వారం రోజులుగా చర్చనీయాంశం అవుతున్న పేరు. దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాదినేని దర్శకత్వంలో గీతా…

4 hours ago

దర్శకుడి పాత పోస్టులు తవ్వుతున్నారు

ఇప్పుడు సెలబ్రిటీ స్టేటస్ తెచ్చుకున్న చాలామంది ఒకప్పుడు సామాన్యులే. అలా కామన్ మ్యాన్ గా ఉన్నపుడు సోషల్ మీడియాలో పెట్టిన…

5 hours ago

ఖైదీ సేతుపతి చేసి ఉంటే..?

తమిళ స్టార్ హీరో కార్తి కెరీర్లో బెస్ట్ అనదగ్గ చిత్రాల్లో ఖైదీ ఒకటి. లోకేష్ కనకరాజ్ ను సౌత్ ఇండస్ట్రీలో…

5 hours ago

అంగ‌బ‌ల‌మే కాదు… ఆర్థికంగానూ టీడీపీనే ఫ‌స్ట్‌!

రాజ‌కీయ పార్టీల‌కు కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల బలం అత్యంత ముఖ్యం. ఈ విష‌యంలో ఏ చిన్న తేడా వ‌చ్చినా.. గెలుపునే కాదు..…

6 hours ago