Movie News

నితిన్ సినిమా.. జస్ట్ 48 రోజుల్లో

ఈ రోజుల్లో చిన్న సినిమాలకు కూడా వర్కింగ్ డేస్ బాగా పెరిగిపోతున్నాయి. ఒకప్పటిలా నెలా రెండు నెలల్లో సినిమాలు తీసే రోజులు పోయాయి. మిడ్ రేంజ్ సినిమాలను కూడా నెలల తరబడి తీస్తున్నారు. కొన్నిసార్లు వాటికి కూడా సంవత్సరాలు పట్టిపోతున్నాయి. ఇలాంటి టైంలో నితిన్ లాంటి నోటబుల్ హీరో సినిమాను కేవలం 48 రోజుల్లో పూర్తి చేశారంటే ఆశ్చర్య పోవాల్సిందే.

నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో నితిన్ హీరోగా తెరకెక్కిన అలియాస్ రుక్మిణి చిత్రాన్ని ఇంత తక్కువ వర్కింగ్ డేస్ లోనే పూర్తి చేసిందట టీం. ఈ విషయాన్ని నితిన్ ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో వెల్లడించాడు. అలియాస్ రుక్మిణి షూటింగ్ ఆగస్టు 17న మొదలైందని.. డిసెంబర్ 4న, అంటే షూట్ ఆరంభమైన 108 రోజుల్లోనే రిలీజ్ చేస్తున్నామని.. కేవలం 48 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశామని నితిన్ తెలిపాడు.

సినిమా మొదలవడానికి ముందే తన చేతికి బౌండ్ స్క్రిప్ట్ వచ్చిందని.. అప్పటికే నాని సోదరి, నిర్మాత దీప్తి తన టీంతో కలిసి లొకేషన్లు, ఆర్టిస్టులు సహా అన్ని ఫైనలైజ్ చేసి పక్కా ప్లానింగ్ తో షూటింగ్ మొదలుపెట్టడం వల్లే సినిమా ఇంత వేగంగా పూర్తయిందని నితిన్ చెప్పాడు.

ఇక అలియాస్ రుక్మిణి తన కెరీర్ లోనే బెస్ట్ ఫిలిం అనే సారీ మాటను మరోసారి నొక్కి వక్కాణించాడు నితిన్. ఈ సినిమా తనకు ఎంత స్పెషల్ చెబుతూ ఎప్పుడో షూటింగ్ పూర్తయినప్పటికీ ఇంకా ఈ సినిమా లుక్ ను కంటిన్యూ చేస్తూ కళ్ళజోడు పెట్టుకుంటున్నట్లు నవ్వుతూ నితిన్ చెప్పాడు. ఈ చిత్ర దర్శకుడు మురళీకాంత్ ను నితిన్ బాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీతో పోల్చడం విశేషం. నాని లేకుంటే ఈ సినిమా లేదని కమర్షియల్ సినిమాలు చేసుకునే తనతో ఇలాంటి సినిమా చేయించడం తన ఘనతే అని నితిన్ చెప్పాడు.

This post was last modified on November 26, 2026 10:08 pm

Share

Recent Posts

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ గైర్హాజరు

అత్యంత వివాదాల నడుమ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూతురు అంజలీ, డాక్టర్ సోమల రఘురామి రెడ్డి వివాహం సన్నిహిత…

19 minutes ago

గొప్పగా చెప్పుకునేంతగా ‘హాఫ్’లో ఏముంది

గత కొన్నేళ్లుగా మలయాళంలో చాలా థ్రిల్లర్లు వచ్చాయి. వాటిలో కొన్ని అద్భుతం అనిపించగా, మరికొన్ని తలనెప్పి కూడా తెప్పించాయి. అయినా…

4 hours ago

శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు ఇచ్చింది ఇతడే…

తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఇటీవల ఒక భక్తుడు 121 కిలోల బంగారు ఆభరణాలు కానుకగా సమర్పించనున్నట్లు…

4 hours ago

జపాన్ లెనిన్ సరే… అసలు వార్త ఎప్పుడు

అక్కినేని అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు బ్రేక్ వేస్తూ అఖిల్ కి తొలి హిట్ గా నిలిచిన లెనిన్ జపాన్ దేశానికి వెళ్తోంది.…

5 hours ago

సాత్విక తెలుగమ్మాయే.. తెలుగు రాదు.. ఎందుకంటే?

సాత్విక వీరవల్లి.. గత వారం రోజులుగా చర్చనీయాంశం అవుతున్న పేరు. దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాదినేని దర్శకత్వంలో గీతా…

5 hours ago

దర్శకుడి పాత పోస్టులు తవ్వుతున్నారు

ఇప్పుడు సెలబ్రిటీ స్టేటస్ తెచ్చుకున్న చాలామంది ఒకప్పుడు సామాన్యులే. అలా కామన్ మ్యాన్ గా ఉన్నపుడు సోషల్ మీడియాలో పెట్టిన…

6 hours ago