Political News

శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు ఇచ్చింది ఇతడే…

తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఇటీవల ఒక భక్తుడు 121 కిలోల బంగారు ఆభరణాలు కానుకగా సమర్పించనున్నట్లు వార్తలు రావడం తెలిసిందే. అతడి పేరు, ఊరు, ఇతరా వివరాలు వెల్లడించక పోవడంతో ఆ భక్తుడు ఎవరన్న ఆసక్తి నెలకొంది. అప్పట్నుంచి ఆ భక్తుడి వివరాలు తెలుసుకునేందుకు అనేకమంది సెర్చ్ చేస్తున్నారు. దేశంలో అదానీ, అంబానీలు అత్యంత ధనవంతులుగా అగ్రస్థానంలో వున్నారు. నెంబర్ వన్ పొజిషన్లో వున్నప్పటికి వారు కూడా ఎప్పుడూ ఇంత భారీ మొత్తంలో శ్రీవారికి కానుకలు ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ ఊరు, పేరు తెలియని ఒక భక్తుడు రికార్డు స్థాయిలో బంగారు ఆభరణాలు కానుకగా ఇవ్వడమంటే మాటలు కాదు కదా.

అయితే అతడు చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త అనే విషయం బయటకు వచ్చింది. గురువారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి స్వామివారిని దర్శించుకొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా 121 కేజీల స్వర్ణాభరణాలను టీటీడీ ఈవోకు అందజేశారు. దాంతో ఆయన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి.

ఆయన పేరు వర్ధమాన్ జైన్. చెన్నైకి చెందిన వర ఫ్యూచర్ ఎల్ఎల్‌పీ సంస్థ చైర్మన్. చెన్నైలోని లయోలా కళాశాల నుంచి స్టాటస్టిక్స్‌లో డిగ్రీ చదివారు. ఆ తర్వాత అమెరికాలోని ఆస్టిన్‌లోని టెక్సాస్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ చేశారు. అక్కడే ఆయన ఐటీ కంపెనీ స్థాపించారు.

వర్థమాన్ జైన్‌కు హెల్త్ కేర్ టెక్నాలజీ, బీపీవో, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ రంగాలలో మంచి అనుభవం ఉన్నట్లు సమాచారం. ఇమేజ్ ప్రాసెసింగ్, మెడికల్ కోడింగ్‌లో కూడా ఆయనకు అనేక పేటెంట్లు ఉన్నట్టు తెలుస్తోంది. హెల్త్‌కేర్ రెవెన్యూ సైకిల్ మేనేజ్‌మెంట్‌లో అగ్రగామి సంస్థ అయిన యాక్సెస్ హెల్త్‌కేర్‌కు వ్యవస్థాపకుడిగా, వైస్ ఛైర్మన్‌గా పనిచేశారు. 2025లో ఆయన తన కంపెనీలోని 70 శాతం వాటాను ఒక అమెరికన్ సంస్థకు సుమారు రెండు బిలియన్ డాలర్లకు అమ్మేసి కార్పొరేట్ ప్రపంచం దృష్టిలో పడ్డారు. ప్రస్తుతం చెన్నైలోని ఆయన ఏషియా ఇంజనీరింగ్ అనే సివిల్ ఇంజనీరింగ్ సంస్థకు పార్టనర్ గా వ్యవహారిస్తున్నారు. వర ఫ్యూచర్ ఎల్‌ఎల్‌పికి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

ఆ మధ్య వర కంపెనీకి చెందిన 60 శాతం షేర్ ను 6000 కోట్లకు అమ్మి వేశారు. వచ్చిన డబ్బులోంచి స్వామి వారికి 150 కోట్ల రూపాయల విలువ చేసే 121 కిలోల బంగారు ఆభరణాలను కానుకగా ఇచ్చారు. కిరీటం, శంఖుచక్రాలు, వడ్డాణం, కటి వరద హస్తాలు, పాదుకలతో సహా మొత్తం 46 రకాల ఆభరణాలను ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అందజేశారు. ఇంత భారీ మొత్తంలో ఇప్పటి వరకు ఎవరూ కనుక ఇవ్వలేదు. దాంతో వర్ధమాన్ జైన్  పేరు మారుమోగుతోంది.

This post was last modified on November 26, 2026 6:10 pm

Page: 1 2 3

Share

Recent Posts

గొప్పగా చెప్పుకునేంతగా ‘హాఫ్’లో ఏముంది

గత కొన్నేళ్లుగా మలయాళంలో చాలా థ్రిల్లర్లు వచ్చాయి. వాటిలో కొన్ని అద్భుతం అనిపించగా, మరికొన్ని తలనెప్పి కూడా తెప్పించాయి. అయినా…

18 minutes ago

జపాన్ లెనిన్ సరే… అసలు వార్త ఎప్పుడు

అక్కినేని అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు బ్రేక్ వేస్తూ అఖిల్ కి తొలి హిట్ గా నిలిచిన లెనిన్ జపాన్ దేశానికి వెళ్తోంది.…

1 hour ago

సాత్విక తెలుగమ్మాయే.. తెలుగు రాదు.. ఎందుకంటే?

సాత్విక వీరవల్లి.. గత వారం రోజులుగా చర్చనీయాంశం అవుతున్న పేరు. దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాదినేని దర్శకత్వంలో గీతా…

1 hour ago

దర్శకుడి పాత పోస్టులు తవ్వుతున్నారు

ఇప్పుడు సెలబ్రిటీ స్టేటస్ తెచ్చుకున్న చాలామంది ఒకప్పుడు సామాన్యులే. అలా కామన్ మ్యాన్ గా ఉన్నపుడు సోషల్ మీడియాలో పెట్టిన…

2 hours ago

ఖైదీ సేతుపతి చేసి ఉంటే..?

తమిళ స్టార్ హీరో కార్తి కెరీర్లో బెస్ట్ అనదగ్గ చిత్రాల్లో ఖైదీ ఒకటి. లోకేష్ కనకరాజ్ ను సౌత్ ఇండస్ట్రీలో…

3 hours ago

అంగ‌బ‌ల‌మే కాదు… ఆర్థికంగానూ టీడీపీనే ఫ‌స్ట్‌!

రాజ‌కీయ పార్టీల‌కు కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల బలం అత్యంత ముఖ్యం. ఈ విష‌యంలో ఏ చిన్న తేడా వ‌చ్చినా.. గెలుపునే కాదు..…

3 hours ago