ఇప్పుడు సెలబ్రిటీ స్టేటస్ తెచ్చుకున్న చాలామంది ఒకప్పుడు సామాన్యులే. అలా కామన్ మ్యాన్ గా ఉన్నపుడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు, వెల్లడించిన అభిప్రాయాలు ఇప్పుడు చూస్తే కొంచెం కామెడీగా, అలాగే వివాదాస్పదంగానూ ఉండొచ్చు. ఇలాంటివి దొరికితే నెటిజన్లు ఆడుకుంటారు. అందుకే సెలబ్రిటీ స్టేటస్ అందుకునే ముందే సోషల్ మీడియా అకౌంట్లను క్లీనప్ చేస్తుంటారు చాలామంది. అలా చెయ్యని పక్షంలో వాళ్ల పాత పోస్టులు వార్తలుగా మారిపోతాయి.
ఇప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకడిగా ఎదుగుతున్న వివేక్ ఆత్రేయ ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నాడు. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, అంటే సుందరానికి, సరిపోదా శనివారం లాంటి వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకున్న వివేక్.. సినీ రంగంలోకి రావడానికి ముందు సగటు సినీ అభిమానిగా వివిధ చిత్రాల మీద పెట్టిన పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో పెద్ద హిట్లలో ఒకటైన బృందావనం సినిమా తొక్కలా ఉందని వివేక్ వ్యాఖ్యానించడం విశేషం. గుండెల మీద చెయ్యేసుకుని చెప్తున్నా బృందావనం తొక్కలా ఉంది అని 2010లో పెట్టిన పోస్టులో వివేక్ పేర్కొన్నాడు. మరోవైపు తన అభిమాన నటుడు మహేష్ బాబు కెరీర్లో పెద్ద డిజాస్టర్ గా నిలిచిన ఖలేజా మూవీని మాత్రం తెగ పొగిడేశాడు ఒక పోస్టులో వివేక్. అది డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో నడిచిన మంచి సినిమా అని వ్యాఖ్యానించాడు.
ఈ సినిమాల గురించి వివేక్ సింపుల్ కామెంట్లే పెట్టాడు కానీ.. శక్తి, నాగవల్లి సినిమాల గురించి మాత్రం హార్ష్ కామెంట్స్ చేశాడు. ఇవి ఎలాంటి చిత్రాలో చెబుతూ వాటి డైరెక్టర్లు మెహర్ రమేష్, పి.వాసులను బూతులు తిట్టాడు వివేక్. వాసుకైతే కొన్ని రోజులు ఇటు వైపు రాకు అని సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఎవరు తవ్వి తీస్తున్నారో కానీ ఫేస్ బుక్ లో ఎప్పుడో వివేక్ పెట్టిన పోస్టులు ఇప్పుడు అనుకోకుండా చర్చనీయాంశం అవుతున్నాయి. సెలబ్రిటీలు తమ పాత పోస్టులను క్లియర్ చెయ్యడం ఎంత అవసరమో చెప్పడానికి ఇది ఉదాహరణ.
This post was last modified on November 26, 2026 4:15 pm
గత కొన్నేళ్లుగా మలయాళంలో చాలా థ్రిల్లర్లు వచ్చాయి. వాటిలో కొన్ని అద్భుతం అనిపించగా, మరికొన్ని తలనెప్పి కూడా తెప్పించాయి. అయినా…
తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఇటీవల ఒక భక్తుడు 121 కిలోల బంగారు ఆభరణాలు కానుకగా సమర్పించనున్నట్లు…
అక్కినేని అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు బ్రేక్ వేస్తూ అఖిల్ కి తొలి హిట్ గా నిలిచిన లెనిన్ జపాన్ దేశానికి వెళ్తోంది.…
సాత్విక వీరవల్లి.. గత వారం రోజులుగా చర్చనీయాంశం అవుతున్న పేరు. దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాదినేని దర్శకత్వంలో గీతా…
తమిళ స్టార్ హీరో కార్తి కెరీర్లో బెస్ట్ అనదగ్గ చిత్రాల్లో ఖైదీ ఒకటి. లోకేష్ కనకరాజ్ ను సౌత్ ఇండస్ట్రీలో…
రాజకీయ పార్టీలకు కార్యకర్తలు, నాయకుల బలం అత్యంత ముఖ్యం. ఈ విషయంలో ఏ చిన్న తేడా వచ్చినా.. గెలుపునే కాదు..…