రాజ్యసభ మాజీ సభ్యుడు, వైసీపీ మాజీ కీలక నాయకుడు, కొత్త పీఆర్పీ అధ్యక్షుడు విజయసాయి రెడ్డి గందరగోళంలో వున్నట్టు కనిపిస్తుంది. ఆయన మాటలు పరస్పర విరుద్ధంగా వుంటున్నాయి. తన ఉనికిని చాటుకోవాలన్న ఆత్రుత, తపన తప్ప మరొక లక్ష్యం లేకుండా ప్రసంగాలు చేస్తున్న ఆయన మున్ముందు మరో కేఏ పాల్ లాగ తయారుకావడం తద్యమన్నా అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. బుధవారం ఢిల్లీ వేదికగా మీడియాతో విజయసాయిరెడ్డి మాట్లాడిన దాన్ని ఒకసారి పరిశీలిస్తే…
తమ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజికవర్గాలకు అవకాశం కల్పిస్తుందని చెప్పుకున్న విజయసాయి రెడ్డి పీఆర్పీ అన్నీ కులాల్ని, మతాల్ని సమానంగా చూస్తుందని సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. అదే వేదిక మీద నుంచి వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు కులం గురించి, మాజీ ముఖ్యమంత్రి జగన్ పుచ్చుకున్న మతం గురించి విమర్శలు చేశారు.
ముస్లిం మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తామని, క్రిస్టియన్లను గౌరవిస్తామని చెబుతూనే హిందువులు వివక్షకు గురవుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడి నుంచి వచ్చే ఆదాయాన్ని పూజారులు, ఆలయ మరమ్మతుల పనులకు వినియోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన మసీదులు, చర్చిల కోసం ప్రభుత్వ నిధులను ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించడం అక్కడున్న వారిని విస్మయానికి గురి చేసింది. మళ్ళీ తనకు బీజేపీతో ఎలాంటి సంబంధం లేదని స్టేట్ మెంట్ ఇచ్చారు.
తనను వెన్నుపోటు దారుడని జగన్ అండ్ కో అనడం విడ్డూరంగా ఉందన్న ఆయన జగనే కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖరరెడ్డిని రెండుసార్లు ముఖ్యమంత్రిని చేసిందని గుర్తు చేశారు. వైఎస్ చనిపోయిన తర్వాత జగన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడాన్ని తప్పు పట్టారు. అయితే జగన్ ఎలా రాజీనామా చేశారో తాను కూడా అలాగే వైసీపీకి రాజీనామా చేశానని చెప్పడంతో మీడియా ప్రతినిధులు తలలు పట్టుకున్నారు.
గతంలో కూడా తనకు కులం లేదని ఆయన చెప్పుకున్నారు. అంతలోనే జగన్ రెడ్లను మోసం చేస్తున్నాడని, నాది ఒరిజనల్ రెడ్డి పార్టీ అని ప్రకటించారు. ఒక పార్టీ అధినేతగా మంచో చెడో ఒక మాటకు కట్టుబడి వుండాల్సిన అవసరం వుంది. విజయసాయి రెడ్డిలో ఆ లక్షణం కనిపించట్లేదని విశ్లేషకులు చెబుతున్నారు. విజయసాయి వ్యవహారం చూస్తే పార్టీ నుంచి తీసేసిన జగన్ మీద కోపం, టీడీపీలోకి రాకుండా గేట్లు మూసేసిన చంద్రబాబు మీద అక్కసు కనిపిస్తున్నాయని రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు.
This post was last modified on November 25, 2026 10:29 pm
మెగాస్టార్ చిరంజీవి మెగావర్స్ కి రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 30 హైదరాబాద్ నార్సింగ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున లాంచ్…
రచయితగా విక్టరీ వెంకటేష్ కు నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి క్లాసిక్స్ ఇచ్చాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన దర్శకత్వంలో…
రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో కొంతమంది నాయకుల మాటలు వివాదాస్పదం అవుతున్నాయి. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం చెడగొడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి…
డిసెంబర్ 25 విడుదలకు రియాలిటీ రెడీ అవుతోంది. ఇప్పటికే రెండు పాటలు వచ్చేశాయి. మూడోది ఈ వారంలో వదులుతున్నారు. ఆల్రెడీ…
ఎల్లుండి విడుదల కాబోతున్న భోగి మీద మాస్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. టీమ్ గత వారం రోజులుగా విస్తృతంగా ప్రమోషన్లు…
ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ పెద్ద వివాదం నుంచి బయటపడ్డాడు. ఆయన ఇచ్చిన రూ. 95 లక్షల చెక్…