మెగాస్టార్ చిరంజీవి మెగావర్స్ కి రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 30 హైదరాబాద్ నార్సింగ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున లాంచ్ ఈవెంట్ చేస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుని దీని ప్రమోషన్ నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంది. ట్రైలర్ కట్ ని ప్రత్యేకంగా హరీష్ శంకర్ తో డైరెక్ట్ చేయించడం అందులో భాగమే. త్వరలోనే బయటికి వదలనున్నారు. ఇప్పటికే నాగార్జున, ,కమల్ హాసన్, బ్రహ్మానందం బ్యాచ్, రవితేజ, నాని, ప్రభుదేవా తదితరుల ఎపిసోడ్ల షూటింగ్ పూర్తయిపోయాయి.
ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఒక వర్గం ఇప్పుడు అన్‌స్టాపబుల్ పోలికను తీసుకొస్తోంది. బాలయ్య ఎనర్జీని, స్వాగ్ ని మరిపించేలా మొదటిసారి యాంకరింగ్ చేస్తున్న చిరంజీవి అంచనాలు నిలబెట్టుకుంటారా అనే ప్రశ్న లేవనెత్తుతున్నారు. అయితే ఇక్కడ మిస్సవుతున్న లాజిక్ ఏంటంటే చిరు హోస్ట్ గా మారడం ఇది మొదటిసారి కాదు. అన్‌స్టాపబుల్ కన్నా చాలా ముందు ఎవరు మీలో కోటీశ్వరుడు షో ఒక సీజన్ నడిపించారు. తర్వాత నాగార్జున దాన్ని తిరిగి కొనసాగించారు.
సో యాంకర్ గా అనుభవం లేకపోవడం అన్న ప్రశ్న లేదు. ఇక కంపారిజన్ల విషయానికి వస్తే రెండు షోలకు రచయిత బివిఎస్ రవి కర్త కర్మ క్రియ కావడం వల్ల కొన్ని సారూప్యతలు అయితే ఉంటాయి. టాక్ షో సంస్కృతి కొత్తగా రాలేదు. ఎప్పటి నుంచో ఉంది. ఈటీవీలో జయప్రదతో మొదలుపెట్టి ఆహాలో సమంత దాకా, దగ్గుబాటి రానా నుంచి తేజ సజ్జ వరకు ఎందరో చేశారు, చేస్తూనే ఉన్నారు. సో ఇది చిరంజీవి బాలకృష్ణ మొదలుపెట్టింది కాదు, వాళ్ళతోనే ఆగేది కాదు. ఇంకా ఎందరో వస్తారు.
ఇద్దరు సీనియర్ స్టార్ల మధ్య ఇలాంటి పోలికే అసంబద్ధం అనేది ఒప్పుకోవాల్సిన మాట. సినిమాల విషయంలో ఇద్దరూ గతంలో పోటాపోటీగా ఉండేవారనేది నిజమే. ఇప్పుడది బుల్లితెరకు కూడా వస్తోంది. ఆహా కన్నా నెట్ ఫ్లిక్స్ రీచ్ చాలా ఎక్కువ కాబట్టి మెగావర్స్ నూటా తొంబైకి పైగా దేశాల్లో అందుబాటులోకి రానుంది. షూట్ కి హాజరైన వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం చిరంజీవి ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందట. ఊహించని ఎన్నో సర్ప్రైజులు మూవీ లవర్స్ కి షాక్ ఇస్తాయని అంటున్నారు.
This post was last modified on November 25, 2026 10:15 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రచ్చ దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్లో ఒక సినిమా కోసం సన్నాహాలు జరిగి.. ఏడాదికి…
క్రికెట్లో బౌలర్‌కు ఫ్రీ హిట్ లాంటి అవకాశం వస్తే ఎలా ఉంటుంది? ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో సరిగ్గా…
రాజ్యసభ మాజీ సభ్యుడు, వైసీపీ మాజీ కీలక నాయకుడు, కొత్త పీఆర్పీ అధ్యక్షుడు విజయసాయి రెడ్డి గందరగోళంలో వున్నట్టు కనిపిస్తుంది.…
రచయితగా విక్టరీ వెంకటేష్ కు నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి క్లాసిక్స్ ఇచ్చాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన దర్శకత్వంలో…
రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో కొంతమంది నాయకుల మాటలు వివాదాస్పదం అవుతున్నాయి. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం చెడగొడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి…
డిసెంబర్ 25 విడుదలకు రియాలిటీ రెడీ అవుతోంది. ఇప్పటికే రెండు పాటలు వచ్చేశాయి. మూడోది ఈ వారంలో వదులుతున్నారు. ఆల్రెడీ…