Political News

వైఎస్ చ‌నిపోయాక‌ జ‌గ‌న్ సీఎం సీటుకు ప‌ట్టుబ‌ట్టారు: సాయిరెడ్డి

వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి చ‌నిపోయిన త‌ర్వాత‌.. తాను ముఖ్య‌మంత్రి కావాల‌ని జ‌గ‌న్ ప‌ట్టుబ‌ట్టార‌ని, ఈవిష‌యంపై పార్టీలో తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ జ‌రిగింద‌ని ప‌రివ‌ర్త‌న్ రాజ‌నీతి పార్టీ(పీఆర్‌పీ) అధ్య‌క్షుడు, వైసీపీ మాజీ నేత వి. విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. డిల్లీలో బుధ‌వారం సాయంత్రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ నెల 11న కొత్త పార్టీ ప్ర‌క‌ట‌న చేసిన ఆయ‌న‌.. త‌ర్వాత మౌనంగా ఉన్నారు. తాజాగా మ‌రోసారి మీడియా ముందుకు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా వైసీపీలో తాను ఎదుర్కొన్న అవ‌మానాలు, పార్టీ ప‌రిస్థితి, ష‌ర్మిల‌-జ‌గ‌న్ ఆస్తుల వివాదం వంటి కీల‌క అంశాల‌పై ప‌లు విష‌యాలు చెప్పారు.

“వైఎస్ చ‌నిపోయి.. మేమంతా ఆవేద‌న‌లో మునిగిపోయాం. ఆ స‌మ‌యంలో జ‌గ‌న్ మాత్రం ముఖ్య‌మంత్రి పీఠంపై ఆశ‌లు పెట్టుకున్నారు. తాను త‌దుప‌రి ఉమ్మ‌డి రాష్ట్ర ముఖ్య‌మంత్రి కావాల‌ని అనుకున్నారు. ఈ విష‌యంపై కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చ‌ర్చ‌సాగింది. కొంద‌రు సంత‌కాల సేక‌ర‌ణ చేశారు.“ అని వెల్ల‌డించారు. వైసీపీలో త‌న‌కు ఊరికేనే ప‌ద‌వులు ఇవ్వ‌లేద‌ని సాయిరెడ్డి చెప్పారు. తాను పార్టీ కోసం ఎంతో క‌ష్ట‌పడ్డాన‌ని, జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసుల్లో ఇరుక్కుని ఆయ‌న‌తో పాటే జైల్లో ఉన్నాన‌ని.. అందుకే పార్టీలో ప‌ద‌వి ఇచ్చార‌ని, ఇదేమీ అయాచితంగా వ‌చ్చింది కాద‌ని సాయిరెడ్డి అన్నారు. తాను చేసిన క‌ష్టంతోనే పార్టీ నిల‌బ‌డింద‌న్నారు.

అయితే.. పార్టీ నుంచి అవ‌మాన‌క‌రంగా బ‌య‌ట‌కు పంపించార‌ని సాయిరెడ్డి ఆరోపించారు. తాను ఏం చేసినా.. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డికి చెప్పి చేయాల‌ని ఆదేశించార‌ని.. ప్ర‌తి విష‌యాన్నీ ఆయ‌న‌కు రిపోర్టు చేయాల‌ని అన్నార‌ని చెప్పారు. ఈ అవ‌మానం భరించ‌లేకే తాను బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని తెలిపారు. జ‌గ‌న్‌కు ఈ విష‌యాలు అన్నీ తెలుసున‌న్నారు. “జ‌గ‌న్‌కు అన్నీ తెలుసు“ అని వ్యాఖ్యానించారు. పార్టీలో ఏం జ‌రుగుతోందో ఆయ‌న‌కు తెలియ‌కుండా ఉంద‌ని ఎవ‌రూ అనుకోర‌ని చెప్పారు. పార్టీలో త‌న‌ను ఘోరంగా అవ‌మానించార‌ని సాయిరెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ప్ర‌స్తుతం వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు, ఏపీసీసీ చీఫ్ ష‌ర్మిల‌కు మ‌ధ్య జ‌రుగుతున్న ఆస్తుల వివాదంపై స్పందిస్తూ.. ఇది పూర్తిగా వారి వ్య‌క్తిగ‌త విష‌యమ‌ని చెప్పారు. అయితే.. వారి ఆస్తుల పంప‌కాలు, మూలాలు వంటివి త‌న‌తో పాటు పీవీపీ రామ‌చంద్ర‌రావు(వైఎస్ ఆత్మ‌గా గుర్తింపు పొందారు)కు మాత్ర‌మే తెలుసున‌ని అన్నారు. కానీ, ఇప్పుడు వాటిని బ‌హిరంగ ప‌ర‌చ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని చెప్పారు. వైఎస్ ఫ్యామిలీకి 40 ఏళ్ల‌కుపైగా సేవ చేశాన‌ని.. అన్ని విష‌యాలు త‌న‌కు తెలుసున‌ని వ్యాఖ్యానించారు. తాను చేసిన త్యాగాల వ‌ల్లే.. ప‌ద‌వులు వ‌చ్చాయి త‌ప్ప‌.. `ఎవ‌రి` ద‌యాదాక్షిణ్యాల వ‌ల్లో త‌న‌కు ప‌ద‌వులు ద‌క్క‌లేద‌ని సాయిరెడ్డి చెప్పారు.

This post was last modified on November 25, 2026 10:42 pm

Share

Recent Posts

త్రివిక్రమ్… ఇది మామూలు డ్యామేజ్ కాదు

రచయితగా విక్టరీ వెంకటేష్ కు నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి క్లాసిక్స్ ఇచ్చాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన దర్శకత్వంలో…

8 minutes ago

ఓటు వేయడానికి మీరు కారం పొట్లాలతో రండి

రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో కొంతమంది నాయకుల మాటలు వివాదాస్పదం అవుతున్నాయి. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం చెడగొడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి…

16 minutes ago

కిరణ్ కళ్ళ ముందు రియాలిటీ రిస్క్

డిసెంబర్ 25 విడుదలకు రియాలిటీ రెడీ అవుతోంది. ఇప్పటికే రెండు పాటలు వచ్చేశాయి. మూడోది ఈ వారంలో వదులుతున్నారు. ఆల్రెడీ…

38 minutes ago

అనుపమ దూరానికి కారణం ఏమిటో

ఎల్లుండి విడుదల కాబోతున్న భోగి మీద మాస్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. టీమ్ గత వారం రోజులుగా విస్తృతంగా ప్రమోషన్లు…

1 hour ago

బండ్ల గణేష్ చెక్ బౌన్స్ గొడవకు తెరపడింది

ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ పెద్ద వివాదం నుంచి బయటపడ్డాడు. ఆయన ఇచ్చిన రూ. 95 లక్షల చెక్…

2 hours ago

కోడ్ రెడ్ యాక్టివేట్ చేసిన మైక్రోసాఫ్ట్

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగించే మైక్రోసాఫ్ట్ సంస్థకు ఇటీవల ఎదురైన సాంకేతిక సమస్యలు పెద్ద సవాలుగా మారాయి. సంస్థకు చెందిన…

4 hours ago