ఓవైపు డబ్బింగ్ సినిమాలేమో ఒక్కొక్కటిగా దున్నేస్తున్నాయి. తెలుగు సినిమాల కంటెంట్ ఏమో వీక్‌గా ఉంటోంది. అవిప్రేక్షకుల ఆదరణకు నోచుకోవడం లేదు. కొన్ని వారాలుగా ఇదే పరిస్థితి. గత నెలలో ‘జైలర్’ సినిమా దుమ్ము దులిపితే.. రణబాలి, ఆదర్శ కుటుంబం లాంటి మన సినిమాలు ఆశించిన ఫలితాలు అందుకోలేదు. ఈ నెలలో రామాయణం, సీన్ లాంటి పరభాషా చిత్రాలు మంచి ఆదరణ దక్కించుకుంటే.. ఏ తెలుగు చిత్రమూ మెప్పించలేకపోయింది.
ఇక ఈ వీకెండ్లో రెండు తెలుగు సినిమాలకు తోడు ఓ తమిళ అనువాదం ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆ సినిమా కూడా మన చిత్రాలను దెబ్బ కొడుతుందేమో అన్న సందేహాలు కలిగాయి. కానీ ఆ భయాలేమీ పెట్టుకోవాల్సిన పని లేదు. రెండు తెలుగు సినిమాలూ ప్రేక్షకుల ఆదరణా పొందుతున్నాయి. తమిళ సినిమానే తుస్సుమనిపించేలా కనిపిస్తోంది.
గురువారం రిలీజైన ‘ఈఎన్ఈ రిపీట్’కు బాగుందనే టాక్ రావడంతో.. బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడింది. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాను ఇష్టపడ్డ యూత్ ఈ చిత్రానికి వచ్చిన టాక్‌తో సంబంధం లేకుండా ఎగబడి చూస్తోంది. ప్రిమియర్స్ నుంచే అదరగొట్టిన సినిమా తర్వాత స్టడీగా సాగుతోంది.
ఇక నిన్న రాత్రి పెయిడ్ ప్రిమియర్స్ నుంచి ‘ఆకాశంలో ఒక తార’ అదిరిపోయే టాక్ తెచ్చుకుంది. ఇది చాన్నాళ్లు గుర్తుండిపోయే సినిమా అని, ఇది తెలుగు సినిమాకు గర్వకారణం అని చూసిన వాళ్లంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. సినిమా కొంచెం స్లో అనే కంప్లైంట్ తప్పిస్తే.. అందరికీ నచ్చే సినిమా ఇదనడంలో సందేహం లేదు. ఈ మూవీకి అనేక అవార్డులు కూడా వస్తాయని భావిస్తున్నారు. తొలి రోజు కొంచెం నెమ్మదిగానే మొదలైనప్పటికీ.. టాక్ చాలా బాగుండడంతో పుంజుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి.
మొత్తానికి ఈ వీకెండ్ తెలుగు సినిమాకు టైం వచ్చినట్లే కనిపిస్తోంది. తెలుగులో సరైన సినిమాలు రావట్లేదంటూ పర భాషా చిత్రాలను ఆదరిస్తూ వచ్చిన మన ఆడియన్స్.. ఇప్పుడు మంచి సినిమాలు వచ్చాయి కాబట్టి వాటిని ఏ రేంజికి తీసుకెళ్తారో చూడాలి.
This post was last modified on November 20, 2026 7:58 pm
పాత పాటలను కొత్త సినిమాల కోసం రీమిక్స్ చేసి వాడుకోవడం కొత్త కాదు. దాదాపు అందరు హీరోలు చేశారు. అల్లరి…
పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు సాధారణంగా కఠిన తనిఖీలు, నిఘా కెమెరాలు, ప్రత్యేక బృందాలను ఉపయోగిస్తుంటారు. అయితే దక్షిణ కొరియా అధికారులు…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొస్తోంది. క్లిష్టమైన పనులను సులభతరం చేస్తూ, వేగంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి…
పరిటాల రవి, పరిటాల సునీతల వారసుడు, టీడీపీ యువనాయకుడు పరిటాల శ్రీరామ్.. తాజాగా జరిగిన జిల్లా పరిషత్.. చైర్మన్ ఎంపికలో…
బీజేపీ అడ్డాగా చెప్పుకునే రాష్ట్రాల్లో ఒకటైన రాజస్థాన్ లో స్థానిక ఎన్నికల ఫలితాలు కమలనాధులకు దిమ్మతిరిగేలా వచ్చాయి. ఆ రాష్ట్రంలోని…
ఒకప్పుడు బ్లాక్ బస్టర్స్ చూసిన నితిన్ ను గత కొన్నేళ్లుగా వరస డిజాస్టర్లు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కొత్త వాళ్లకు…