తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో నిత్యం ఏదో ఒక రగడ కొనసాగుతూనే వుంది. ఒకరుపోతే మరొకరు అసంతృప్తి గళం వినిపించడం మామూలై పోయింది. ఒక మంత్రి వారసురాలు ఏకంగా ముఖ్యమంత్రికి వార్నింగ్ ఇస్తే మరో సీనియర్ ఎమ్మెల్యే కాబోయే ముఖ్యమంత్రిని నేనే అంటూ ప్రకటించుకోవడం ప్రజలంతా చూశారు. చింత చచ్చినా పులుపు చావలేదనట్టు కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు మారట్లేదని ప్రజలు కామెంట్ చేస్తున్నారు.
ఈమధ్య ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకొని విమర్శలు సంధిస్తున్నారు. అభివృద్ధి నిధులు అడిగిన వారిని సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేయడాన్ని తప్పు పట్టారు. నిధుల గురించి ప్రశ్నించిన వారిని “తొక్కేస్తాను” అన్నట్లుగా సీఎం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన సీఎంను ఉద్దేశించి నువ్వేం సీఎంవి ? నీ భాష ఏంది ? అదృష్టం కలిసొచ్చి ముఖ్యమంత్రి అయ్యావు, మిగిలిన రెండేళ్లయినా మంచిగా ఉండి ప్రజలను పట్టించుకో” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టించింది. మునుగోడు అభివృద్ధికి నిధులు ఆపితే అది మరో కురుక్షేత్రం తప్పదని హెచ్చరించారు.
దాంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహనం నసించినట్టుంది. సిద్దిపేట సభలో బరెస్టయ్యారు. రాజగోపాల్ రెడ్డి పేరు ప్రస్థావించకుండా మాస్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలకు పిచ్చికుక్క కరిచినట్టు ఉందని, మైకు దొరికితే చాలు పిచ్చి పట్టినట్టు వాగుతున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అదుపుతప్పి మాట్లాడుతున్న వారిని మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎర్రగడ్డ ఆసుపత్రికి పంపిస్తారని పరోక్షంగా హెచ్చరించారు. మైకులో విమర్శలు చేస్తున్న కొందరు దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం చెవిలో గుసగుసలాడుతున్నారని ఎద్దేవా చేశారు. కొడంగల్ కు నిధులు తీసుకెళ్లుతున్నానని విమర్శలు చేస్తున్నారని, బరాబర్ 10 వేల కోట్లు తీసుకెళ్లుతా, ఏం పీక్కుంటారో పీక్కో అంటూ సవాల్ విసిరారు.
దీంతో తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అంతకుముందు మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత కూడా ఇలాగే మాట్లాడారు. పరకాల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డికే మళ్లీ టికెట్ ఇస్తామని సీఎం ప్రకటించడాన్ని తప్పుపట్టిన సుస్మిత నేరుగా ముఖ్యమంత్రి మీద విమర్శలు స్టార్ట్ చేశారు. ఒక దశలో తీవ్రమైన విమర్శలు చేశారు. కూతురి విమర్శలను కొండా సురేఖ ఖండించలేదు. చివరికి సురేఖ మంత్రి పదవి పోగొట్టుకున్నారు.
ఇప్పుడు మంత్రి పదవి రాలేదన్న అక్కసుతో రాజగోపాల్ రెడ్డి సీఎం మీద విమర్శల దాడి మొదలుపెట్టారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ లైన్ దాటుతున్న వారిపై అధిష్టానం తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పార్టీ శ్రేణులు చెబుతున్నారు.
This post was last modified on November 20, 2026 2:13 pm
మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ కుటుంబాల మధ్య అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వీళ్లిద్దరూ బావ బావమరదులన్న…
ఇవాళ విడుదలైన ఆకాశంలో ఒక తార హీరోయిన్ సాత్విక వీరవల్లి ఇండస్ట్రీ దృష్టిలో బలంగా పడటం హాట్ టాపిక్ గా…
తెలుగు సినిమాల్లో ఒకప్పుడున్న కామెడీ వైభవం.. ఇండియాలోని ఇతర భాషల్లోనే కాదు, ప్రపంచంలోనే మరే సినీ పరిశ్రమలోనూ లేదు అంటే అతిశయోక్తి…
టాలీవుడ్లో అడివి శేష్.. రాహుల్ రవీంద్రన్.. వెన్నెల కిషోర్.. సుజీత్.. ఈ నలుగురూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్న సంగతి ఇండస్ట్రీలో…
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ హవా భారీగా తగ్గిపోయిందా? ఆయన…
బీఆర్ ఎస్ అగ్రనాయకుడు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఆయన…