Political News

వైసీపీ ఒక డెడ్ బాడీ – నాగబాబు

వైసీపీ మీద మరోసారి విరుచుకొని పడ్డారు ఎమ్మెల్సీ నాగబాబు. వైసీపీ ఒక డెడ్ బాడీ అని, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కామెంట్స్ చేశారు. సాదాసీదాగా కనిపించే ఆయన ప్రత్యర్థుల మీద  చేసే కామెంట్స్ చాలా తీవ్రంగా ఉంటాయి. మండుతున్న పుండు మీద కారం చల్లినట్టు భగ్గుమంటాయి. గతంలో అనేకసార్లు వైసీపీ మీద తనదైన స్టైల్లో చేసిన విమర్శలు వివాదం అయ్యాయి. వైసీపీని అరాచక పార్టీగా అభివర్ణించిన ఆయన అరాచకం, దుర్మార్గం, దౌర్జన్యం కలగలిస్తే వైసీపీ పార్టీ అవుతుందని చురకేశారు. ఇప్పుడు అదే రకమైన కామెంట్ చేశారు.

తాజాగా వైసీపీని మృతదేహంగా అభివర్ణించడం వివాదాస్పదం అయ్యింది. 

వైసీపీ ఒక డెడ్ బాడీ. అది ఎప్పుడో చనిపోయింది. బతికిఉన్నట్టు భ్రమలో తిరుగుతుంది. మేము దాన్ని పట్టించుకోవడం ఎప్పుడో మానేశాం అని నాగబాబు చేసిన విమర్శ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడి రాజేసింది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ మీద నాగబాబు విరుచుకొని పడ్డారు. వైసీపీ ఎప్పుడో మరణించిందని, దాంట్లో ప్రాణం లేదని చెప్పారు. ఆ పార్టీ గురించి వర్రీ పడొద్దని పార్టీ శ్రేణులకు సూచించారు. నేనెవర్ని విమర్శించడానికి రాలేదని చెబుతూనే ఘాటుగా విమర్శలు చేయడంతో అక్కడ వున్న కార్యకర్తల్లో హుషారు నింపినట్లయ్యింది. 

నాగబాబు చేసే విమర్శలేప్పుడూ అలాగే వుంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన ఏదో గొంతు చించుకున్నట్లు మాట్లాడరు. సుత్తి లేకుండా సుతిమెత్తగా కత్తి దింపినట్టు మాట్లాడటం నాగబాబు స్టైల్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద విమర్శలు చేసిన వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి నోళ్లు మూయించారు.

This post was last modified on November 20, 2026 6:09 pm

Share

Recent Posts

రాములమ్మని వాడుకోవడం తెలివైన ఐడియా

పాత పాటలను కొత్త సినిమాల కోసం రీమిక్స్ చేసి వాడుకోవడం కొత్త కాదు. దాదాపు అందరు హీరోలు చేశారు. అల్లరి…

1 hour ago

ఇది వింటే ఇక జన్మలో కాపీ కొట్టరు

పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు సాధారణంగా కఠిన తనిఖీలు, నిఘా కెమెరాలు, ప్రత్యేక బృందాలను ఉపయోగిస్తుంటారు. అయితే దక్షిణ కొరియా అధికారులు…

2 hours ago

ఏఐని గుడ్డిగా నమ్మితే ఇలాగే ఉంటుంది

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొస్తోంది. క్లిష్టమైన పనులను సులభతరం చేస్తూ, వేగంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి…

2 hours ago

ఎట్ట‌కేల‌కు ప‌రిటాల వార‌సుడి సుడి తిరిగింది!

ప‌రిటాల ర‌వి, ప‌రిటాల సునీతల వార‌సుడు, టీడీపీ యువ‌నాయ‌కుడు ప‌రిటాల శ్రీరామ్‌.. తాజాగా జ‌రిగిన జిల్లా ప‌రిష‌త్‌.. చైర్మ‌న్ ఎంపిక‌లో…

2 hours ago

అధికారంలో ఉన్న బీజేపీ కంటే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు

బీజేపీ అడ్డాగా చెప్పుకునే రాష్ట్రాల్లో ఒకటైన రాజస్థాన్ లో స్థానిక ఎన్నికల ఫలితాలు కమలనాధులకు దిమ్మతిరిగేలా వచ్చాయి. ఆ రాష్ట్రంలోని…

2 hours ago

నితిన్ ఇచ్చింది చాలా పెద్ద స్టేట్‌మెంట్

ఒకప్పుడు బ్లాక్ బస్టర్స్ చూసిన నితిన్ ను గత కొన్నేళ్లుగా వరస డిజాస్టర్లు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కొత్త వాళ్లకు…

2 hours ago