తిరుమల తిరుపతి శ్రీవారికి నిత్యం సమర్పించే నైవేద్యాలు సహా.. భక్తులకు ఇచ్చే లడ్డూ ప్రసాదంలో నెయ్యిని వినియోగిస్తారు. రోజుకు వేల కిలోల నెయ్యిని వినియోగిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే.. వైసీపీ హయాంలో కల్తీ నెయ్యి రావడం.. దీనిపై పెద్ద దుమారం రేగడం తెలిసిందే. ముఖ్యంగా పాల నుంచి కాకుండా.. ప్రత్యేక రసాయనాలు, వెజిటబుల్ ఆయిల్ నుంచి కూడా నెయ్యిని తయారు చేసి తిరుమల శ్రీవారికి అంటగట్టారని నివేదికలు, దర్యాప్తు సంస్థలు కూడా వెల్లడించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం విచారణ పరిధిలో ఉంది. తాజాగా ఇక నుంచి సొంతంగానే తిరుమల శ్రీవారికి వినియోగించే నెయ్యిని తయారు చేసుకునే దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది.
ఈ క్రమంలో తొలి దశలో ఇప్పటికే ఉన్న గోవులకు తోడు.. మరో 500 గోవులను కొనుగోలు చేయాలని టీటీడీ స్పెసిఫైడ్ కమిటీ నిర్ణయించింది. దీని ప్రకారం.. నిత్యం ఆయా గోవుల నుంచి వచ్చే పాలను.. నెయ్యిగా తయారు చేసేందుకు ప్రత్యేక పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు. ఈ పాల నుంచి వచ్చే వెన్ననే స్వామికి ప్రసాదంగా (నవనీత ప్రసాదం ఉదయం సమర్పిస్తారు) ఇస్తారు. అలానే.. లడ్డూ ప్రసాదాలకు కూడా ఈ నెయ్యినే వినియోగించనున్నారు. అయితే.. ప్రస్తుతం కొనసాగుతున్న టెండర్లు అలానేకొనసాగుతాయని.. పూర్తిస్థాయిలో గోశాలను అభివృద్ధి పరిచిన తర్వాత.. సుమారు 5 వేల గోవుల వరకు సొంతంగా పెంచేందుకు కృషి చేస్తామని స్సెసిఫైడ్ కమిటీ పేర్కొంది.
తాజాగా బుధవారం ఈ కమిటీ సమావేశం నిర్వహించింది. దీనిలో రాబోయే మూడు మాసాల కాలానికి తీసుకునే చర్యలపై నిర్ణయానికి వచ్చారు. దీని ప్రకారం.. నెయ్యిని సొంతంగా తయారు చేసుకోవడంతోపాటు.. యాత్రికుల కొసం ప్రత్యేక ఒక టౌన్‌షిప్‌ను సుమారు 3 వేల కోట్ల రూపాయలతో నిర్మించనున్నారు. అలానే.. ఈ ఏడాది డిసెంబరులో వచ్చే వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భారీ ఏర్పాట్లు చేయనున్నారు. గత ఏడాది జరిగిన దుర్ఘటనలకు ఆస్కారం లేకుండా ఈ ఏడాది చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. అలానే టీటీడీ ఉద్యోగులకు సుమారు 17 వేల చొప్పు కానుకలుగా అందించాలని నిర్ణయించారు.
తిరుమల నడక మార్గంలో ఏర్పాట్లను మరింత సులభతరం చేయనున్నారు. తిరుమల ఆధ్వర్యంలో నడుస్తున్న ఆసుపత్రులకు ప్రత్యేక సాయం కింద నిధులు ఇచ్చి మౌలిక సదుపాయాలను మరిన్ని పెంచనున్నారు. అలానే భక్తులకు రవాణా మార్గాలను మరింత సౌకర్యంగా పెంచడంతోపాటు నడక మార్గంలో వచ్చే వారికి వన్యప్రాణుల నుంచి ఎలాంటి హాని కలగకుండా కూడా చర్యలు చేపట్టనున్నారు. ఈ మేరకు స్పెసిఫైడ్ కమిటీ చైర్మన్, ఈవో రవిచంద్ర వివరించారు.
This post was last modified on November 19, 2026 4:57 pm
టోల్ ప్లాజా దాటితే చాలు.. మీ వాహనానికి ఇన్సూరెన్స్ ఉందో లేదో ప్రభుత్వానికి తెలిసిపోతుంది. ఇప్పటివరకు టోల్ చెల్లింపులకే పరిమితమైన…
ఈ మధ్యకాలంలో భారతీయులపై పాశ్చాత్య సంస్కృతి ప్రభావం బాగా ఎక్కువైంది. విలాసవంతమైన జీవితం, మద్యపానం, ఖరీదైన భోజనం వంటి వాటిని…
తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను ఆయన సొంత నియోజకవర్గం కొళత్తూరులో ఓడించిన…
నిన్న రాత్రి ప్రీమియర్లతో ఈ నగరానికి ఏమైంది రిపీట్ విడుదలయ్యింది. ముఖ్యంగా ఒక్క రాత్రిలో హైదరాబాద్ నుంచి కోటి రూపాయల…
స్థానిక ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం కూటమి హవా కనిపించింది. మున్సిపల్ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సైతం అదే ఊపు…
రెండు వారాల క్రితం విడుదలైన సీన్ తెలుగులోనూ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. రిలీజ్ కు ముందు పెద్దగా…