Political News

వంశీ గెలిచారు.. కొడాలి ఓడారు.. !

తాజాగా జ‌రిగిన ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో అనేక ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని గ‌న్న‌వ‌రం, గుడివాడ నియోజ‌క‌వ‌ర్గాల‌పై కోస్తా వ్యాప్తంగా చ‌ర్చ సాగుతోంది. గ‌న్న‌వ‌రంలో మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీమోహ‌న్‌.. త‌న‌ప‌ట్టును నిలుపుకొన్నారు. ఇదేస‌మ‌యంలో గుడివాడ‌ను త‌న అడ్డాగా పేర్కొనే మాజీ మంత్రి కొడాలి నాని.. ప‌ట్టును కోల్పోయారు. వీరిద్ద‌రూ టీడీపీ నుంచే రాజ‌కీయాలు ప్రారంభించ‌డం.. అనంత‌రం వైసీపీలోకి రావ‌డం అదే టీడీపీకి స‌వాల్‌గా మారిన నేప‌థ్యంలో ఈ ఇద్ద‌రి రాజ‌కీయాలు ఆసక్తిగా మారాయి.

గన్నవరం జెడ్పీటీసీ స్థానాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దీంతో మాజీ ఎమ్మెల్యే వంశీ గ్రాఫ్ పెరిగిన‌ట్టేన‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మైంది. వైసీపీ అభ్యర్థి, వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడైన అనగాని రవి ఇక్కడి నుండి విజయం సాధించారు. అధికార కూటమి పొత్తులో భాగంగా ఈ స్థానం నుండి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి చిగురుపాటి కుమారస్వామి ప‌రాజ‌యం పాల‌య్యారు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో వైసీపీ అభ్యర్థి కేవలం 63 ఓట్ల అత్యల్ప మెజారిటీతో విజయం సాధించారు.

మండల పరిషత్ ఫలితాల విష‌యానికి వ‌స్తే.. గన్నవరం మండల పరిధిలోని అజ్జంపూడి ఏడులుముడి ఎంపీటీసీ స్థానంలో కూడా వైసీపీ అభ్యర్థి అమృతల ప్రసాద్ 172 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుత కూటమి హవాలో కూడా, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గన్నవరం నియోజకవర్గ కేంద్రంలో వైసీపీ పట్టు నిలుపుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇది పూర్తిగా మాజీ ఎమ్మెల్యే వంశీకి ఉన్న బ‌లాన్ని స్ప‌ష్టం చేసింది.

కొడాలి కుదేల్‌..!

గుడివాడ నియోజకవర్గంలో త‌న ప‌ట్టును నిలుపుకొనేందుకు ప్ర‌య‌త్నించిన మాజీ ఎమ్మెమ్యే ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు కొడాలి నాని చ‌తికిల‌ప‌డ్డార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇక్క‌డ ఎమ్మెల్యే రాము నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యం ప్ర‌ద‌ర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న కూటమి ప్రభంజనంలో భాగంగానే గుడివాడ పరిషత్ స్థానాల్లోనూ అభ్యర్థులు విజ‌యం ద‌క్కించుకున్నారు.

గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి గుడివాడ రూరల్ మండల పరిధిలోని వివిధ ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ని వెనక్కి నెట్టి తెలుగుదేశం పార్టీ తన పట్టును నిరూపించుకుంది. మ‌రీ ముఖ్యంగా కొడాలికి ప‌ట్టున్న ప్రాంతాల్లోనూ ఆయ‌న హ‌వా క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. 

This post was last modified on November 8, 2026 5:22 pm

Share

Recent Posts

పోల‌వ‌రంలో సేన మారాల్సిందే.. !

పోల‌వ‌రం జిల్లాలో తాజాగా జ‌రిగిన పరిషత్ ఎన్నికలలో జ‌న‌సేన పూర్తిగా ఇరుకున ప‌డింది. రాష్ట్ర వ్యాప్తంగా జ‌న‌సేన‌కు ప్ర‌జ‌లు జేజేలు…

14 minutes ago

సౌండ్ లేని టపాసులిచ్చిన తెలుగు స్టార్లు

తెలుగునాట అతి పెద్ద పండగల్లో దీపావళి ఒకటి. సెలవులు ఎక్కువ ఉండకపోయినా సెలబ్రేషన్స్ పీక్స్ లో ఉంటాయి. ముఖ్యంగా టపాసుల…

27 minutes ago

ఇప్ప‌టికైనా మార్పు వ‌స్తుందా జ‌గ‌న్‌ గారూ!

ఒక మార్పు మ‌నిషినే కాదు.. రాజ‌కీయాల‌ను కూడా మార్చేస్తుంది. అమ‌రావ‌తికి క‌ట్టుబ‌డి ఉంటామ‌ని.. అమ‌రావ‌తి రాజ‌ధానిని మార్చ‌బోమ‌ని.. అస‌లు అమ‌రావ‌తి…

37 minutes ago

రాజమౌళి రాముడి మీద డౌట్ అక్కర్లేదు

ఇప్పుడు ఎక్కడ చూసినా రామాయణ పార్ట్ 1 కు వచ్చిన స్పందన, రికార్డు కలెక్షన్ల గురించిన చర్చే జరుగుతోంది. హిందీలోనే…

2 hours ago

ఫొటోస్: మాళవిక దీపావళి బ్లాస్ట్

ప్రభాస్ ది రాజా‌ సాబ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన హీరోయిన్ మళవిక మోహనన్.‌ తాజాగా ఈ ముద్దుగుమ్మ.. తన…

2 hours ago

మార్కెటింగ్ రూటు మార్చాల్సిందే దాదా

డిసెంబర్ 24 విడుదల కాబోతున్న దాదా మీద బాలకృష్ణ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. గత ఏడాది అఖండ 2…

3 hours ago