Movie News

ఫొటోస్: మాళవిక దీపావళి బ్లాస్ట్

ప్రభాస్ ది రాజా‌ సాబ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన హీరోయిన్ మళవిక మోహనన్.‌ తాజాగా ఈ ముద్దుగుమ్మ.. తన అందమైన ఫోటోలతో సోషల్ మీడియాలో అందరిని తెగ ఆకట్టుకుంటోంది.

దీపావళి సందర్భంగా.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోల్లో.. మాళవిక.. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ప్రత్యేకంగా డిజైన్ చేసిన గోల్డ్ లెహంగాలో కనిపించింది.

డ్రెస్సు మాత్రమే కాదు ఆమె వేసుకున్న నగలు కూడా.. ఏమాత్రం తీసిపోయినట్టు ఆమె అందాన్ని మరింత పెంచాయి. ఈ ఫోటోలు చూస్తే దీపావళి కాంతులు.. ఈ ముద్దుగుమ్మ ఫొటోస్ లోనే ఉన్నట్టు మనకు అనిపించక మానదు. అంతేకాకుండా ఆమె డ్రెస్, స్మైల్.. స్టైల్ చూస్తే.. అందానికి కొత్త అర్థం చెప్పేలా ఉన్నాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే.. మాళవిక 2013లో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన పట్టం పోలే‌సినిమాతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత నిర్ణాయకం, నాను మట్టు వరలక్ష్మి వంటి సినిమాల్లో నటించింది. ప్రముఖ దర్శకుడు మజిద్ మజిది తెరకెక్కించిన బియాండ్ ది క్లౌడ్స్ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంలో మళవిక నటనకు ప్రశంసలు లభించాయి.

తమిళంలో పేట, మాస్టర్, మారన్, తంగలాన్ వంటి సినిమాల్లో నటించింది. ఇక ఈ మధ్యనే ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యింది.

ప్రస్తుతం ఈ హీరోయిన్ పాకెట్ నవల చిత్రంతో తెగ బిజీగా ఉంది. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన సూపర్ డీలక్స్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు మరోసారి వీరు కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది.

ఈ చిత్రంలో మళవిక మోహనన్‌తో పాటు రాజ్ బి. శెట్టి, కిషోర్ కూడా నటిస్తున్నారు. 2027 జనవరి 14న సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

This post was last modified on November 8, 2026 7:11 pm

Page: 1 2 3

Share

Recent Posts

టాలీవుడ్ హీరోలు ‘సీన్’ చేసి ఉంటే

సూర్య కొత్త సినిమా 'సీన్' వసూళ్లు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. రివ్యూలు మరీ గొప్పగా రాలేదు. పబ్లిక్ టాక్ సోషల్ మీడియాలో…

5 minutes ago

పోల‌వ‌రంలో సేన మారాల్సిందే.. !

పోల‌వ‌రం జిల్లాలో తాజాగా జ‌రిగిన పరిషత్ ఎన్నికలలో జ‌న‌సేన పూర్తిగా ఇరుకున ప‌డింది. రాష్ట్ర వ్యాప్తంగా జ‌న‌సేన‌కు ప్ర‌జ‌లు జేజేలు…

47 minutes ago

సౌండ్ లేని టపాసులిచ్చిన తెలుగు స్టార్లు

తెలుగునాట అతి పెద్ద పండగల్లో దీపావళి ఒకటి. సెలవులు ఎక్కువ ఉండకపోయినా సెలబ్రేషన్స్ పీక్స్ లో ఉంటాయి. ముఖ్యంగా టపాసుల…

60 minutes ago

ఇప్ప‌టికైనా మార్పు వ‌స్తుందా జ‌గ‌న్‌ గారూ!

ఒక మార్పు మ‌నిషినే కాదు.. రాజ‌కీయాల‌ను కూడా మార్చేస్తుంది. అమ‌రావ‌తికి క‌ట్టుబ‌డి ఉంటామ‌ని.. అమ‌రావ‌తి రాజ‌ధానిని మార్చ‌బోమ‌ని.. అస‌లు అమ‌రావ‌తి…

1 hour ago

రాజమౌళి రాముడి మీద డౌట్ అక్కర్లేదు

ఇప్పుడు ఎక్కడ చూసినా రామాయణ పార్ట్ 1 కు వచ్చిన స్పందన, రికార్డు కలెక్షన్ల గురించిన చర్చే జరుగుతోంది. హిందీలోనే…

2 hours ago

వంశీ గెలిచారు.. కొడాలి ఓడారు.. !

తాజాగా జ‌రిగిన ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో అనేక ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని గ‌న్న‌వ‌రం, గుడివాడ…

3 hours ago