Political News

ఏబీవీ ప‌రాజ‌యం: కొత్త నేత‌ల‌ ఆశ‌ల‌కు బ్రేక్‌?

మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయడం ఒక సంచలనం అయితే ఆయన ఓటమి కూడా మరింత సంచలనంగా మారింది. ఏమాత్రం అంచనా లేకుండానే హఠాత్తుగా ఏబీ వెంకటేశ్వరరావు బరిలోకి దిగారు. వాస్తవానికి ఆయన సొంతంగా పార్టీ పెట్టుకుందామని భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల మళ్ళీ వెనక్కి త‌గ్గి, స్వతంత్రంగానే ఆయన విజయవాడ నుంచి పోటీ చేయటం కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా వామపక్షాలు ఆయనకు మద్దతుగా నిలవడం తెలిసిందే.

కానీ ఎంత జరిగినా ఆయనకు 12 వేల పైచిలుకు ఓట్లు మాత్రమే దక్కాయి. దీంతో డిపాజిట్ సైతం కోల్పోయారు. ఏబీ వెంకటేశ్వరరావు సాధించిన ఈ పరాజయం అనేక అంశాలకు దారితీసింది. ప్రధానంగా వచ్చే 2029 ఎన్నికల నాటికి కొంతమంది మాజీ ఐఏఎస్‌లు, మాజీ ఐపీఎస్ లు రాజకీయాల్లోకి రావాలని భావించిన వారు ఆలోచనలో పడ్డారు. వైసీపీ హయాంలో కొన్ని కొన్ని అవకతవకల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వివాదాస్పదమైన ఐఏఎస్‌లు, ఐపీఎస్ లు రిటైర్ అయ్యారు. వీరందరూ వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నారు.

మాజీ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు తో పాటు మరికొందరు ఈ జాబితాలో ఉన్నారు. కనీసంలో కనీసం ఐదుగురు నుంచి ఆరుగురు వరకు వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి కీలక సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు విజయవాడ కార్పొరేషన్ నుంచి పోటీ చేయడం ఇదే సమయంలో ఆయన ఘోర ప‌రాజ‌యం పాలవడం వంటివి అధికారులను అంతర్హ‌త‌నంలో పడేశాయి. దీంతో ఇప్పుడు వారంతా ఆలోచనలో పడ్డారు. ఒక అధికారిగా ఒక విభాగం పై పట్టు సాధించే అవకాశం ఉంటుంది. కానీ అదే అధికారి ప్రజాక్షేత్రంలోకి వస్తే యావత్ ప్రజానీకాన్ని తన వైపు తిప్పుకోగలిగే సామర్థ్యం ఉండాలి.

ఓటు బ్యాంకు రాజకీయాలు చేయగలిగేలా ఉండాలి. అధికారిగా విధులకు రాజకీయాల్లో ఉండే ఒత్తిడిలకు మధ్య భిన్నమైన తేడాను కూడా గమనించాల్సి ఉంటుంది. ఈ విషయంలో దాదాపు అధికారులు అందరూ కూడా విఫలమయ్యారనే చెప్పాలి. గతంలో ఐఏఎస్ అధికారిగా ఉండి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన జయప్రకాష్ నారాయణ వంటి వారు ఒక్కసారి మాత్రమే విజయం సాధించారు. ఆ తర్వాత వచ్చిన వారు దాదాపు విఫలమయ్యారు. గత ఎన్నికల్లో మాజీ ఐఏఎస్‌ రామాంజనేయులు పత్తిపాడు నియోజకవర్గ నుంచి విజయం సాధించినా అది వ్యక్తిగత బలం కన్నా కూటమి పక్షాన ఆయన సాధించిన విజంగానే భావించాల్సి ఉంటుంది.

ఇక విశాఖపట్నం నుంచి పోటీ చేసిన ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ పరాజయం పాలయ్యారు. అలాగే చంద్రగిరి ఏసురత్నం, గుంటూరులో పోటీ చేసి వైసీపీ త‌ర‌ఫున ఓడిపోయారు. ఇట్లా అనేక ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు ఘోరంగా ఓడిపోయిన ద‌రిమిల మాజీ అధికారులు లేదా ప్రస్తుతం ఉద్యోగాలకు రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న వారు కూడా ఆలోచనలో పడిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.

దీనివల్ల పార్టీలకు కానీ ప్రజలకు కానీ నష్టం లేకపోయినా కొత్తగా రాజకీయాలు చేయాలనుకునే వారికి మాత్రం ఈ పరిణామాలు ఒక లెసన్ మాదిరిగా మారి మారడం గమనార్హం. మరి భవిష్యత్తులో ఇలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొని గెలిచినా ఓడిన రాజకీయాల్లోకి వద్దాం అనుకునే వారు ఎంతమంది ఉంటారు అనేది చూడాలి.

This post was last modified on November 8, 2026 1:48 am

Share

Recent Posts

ఐటీ ఉద్యోగులకు పార్కులే కొత్త ఆఫీసులు

ఉద్యోగం అంటే ఉదయం ఇంటి నుంచి బయలుదేరి ఆఫీసుకు వెళ్లడం లేదా ఇంట్లో ఒకే చోట కూర్చుని గంటల తరబడి…

2 hours ago

రెబల్ అభ్యర్థుల్లోనూ కూటమిదే పై చేయి

పరిషత్ ఎన్నికల ఫలితాలు కూడా వచ్చేశాయి. మున్సిపల్ ఎన్నికల తరహాలోనే పరిషత్ ఎన్నికల్లో కూడా కూటమి జైత్రయాత్ర కొనసాగింది. కోస్తా,…

2 hours ago

రాధా రాకతో బెజ‌వాడ రాజ‌కీయాలు మార‌తాయా?!

సుదీర్ఘ విరామం తర్వాత విజయవాడ నగరపాలక సంస్థ మేయర్‌గా వంగవీటి రాధా విజయం సాధించారు. ఇది ఒక రకంగా రంగా…

2 hours ago

ఎటు చూసినా కూట‌మే… దిక్క‌లు చూస్తున్న వైసీపీ!

ఎటు చూసినా కూట‌మి పార్టీల ప్ర‌భంజ‌న‌మే క‌నిపిస్తోంది. ఏ టీవీ పెట్టినా ఇవే వార్త‌లు వ‌స్తున్నాయి. ఏం చదివినా కూట‌మి…

4 hours ago

‘రామాయణం’పై బాలీవుడ్ ఎందుకు గప్‌చుప్?

గత ఏడాది చివర్లో హిందీ చిత్రం ‘దురంధర్’ సినిమా ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. దానికి కొనసాగింపుగా ఈ ఏడాది…

5 hours ago

వారణాసికి మీరు తలుపులు తీయడం ఏమిటయ్యా

రామాయణ పార్ట్ 1 సక్సెస్ తో రన్బీర్ కపూర్ మంచి హుషారు మీదున్నాడు. పేరు తెచ్చుకునే విషయంలో యష్ పోటీ…

7 hours ago