జైలుకు వెళ్లిన నాయకులు రాజకీయాల్లో సక్సెస్ అవుతున్నారనే మాట మరోసారి నిజమైంది. తాజాగా జరిగిన జడ్‌పీటీసీ ఎన్నికల్లో ఓ నాయకుడు వైసీపీ తరఫున పోటీ చేశారు. అయితే.. ఆయన హత్య కేసులో చిక్కుకుని జైల్లో ఉన్నారు. జైలు నుంచే ఆయన నామినేషన్ వేశారు. అక్కడి నుంచే రోజుకొక ప్రకటన విడుదల చేసి ప్రచారం చేసుకున్నారు. చివరకు ప్రజలు ఆయననే గెలిపించారు. అదే తిరుపతి జిల్లాలోని పెళ్లకూరు మండలం. ఇక్కడ నుంచి జెడ్పీటీసీ అభ్యర్థిగా వైసీపీ నాయకుడు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి నామినేషన్ వేశారు.
సత్యనారాయణ జైలులో ఉండటంతో, ఆయన సతీమణి కామిరెడ్డి ప్రభావతమ్మ, కుటుంబ సభ్యులు ఆయన తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో 1,719 ఓట్ల తేడాతో కామిరెడ్డి విజయం దక్కించుకున్నారు. ఇదే సీటు నుంచి పోటీ చేసిన కూటమి అభ్యర్థి చైతన్య కృష్ణ శిరసనంబేటి ఓటమి పాలయ్యారు. వాస్తవానికి ఎన్నికల సమయంలో సత్యనారాయణ కేసు వ్యవహారాన్ని చైతన్య విస్తృతంగా ప్రచారం చేశారు. అయినప్పటికీ.. ప్రజలు సత్యనారాయణ వైపే మొగ్గు చూపడం గమనార్హం.
ఇదీ.. కేసు!
చిల్లకూరులో జరిగిన భూ వివాదంలో సత్యనారాయణ చిక్కుకున్నారు. ఆ సమయంలో జరిగిన ఘటనకు సంబంధించి హత్య కేసులో నిందితుడిగా ఆయన పేరును పోలీసులు పేర్కొన్నారు. దీంతో రిమాండ్ ఖైదీగా ఆయన నెల్లూరు జైలులో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని వైయస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కానీ.. పోలీసులు మాత్రం ఆయన పాత్ర ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ పరిధిలో ఉండగానే ఆయన జడ్పీటీసీగా విజయం దక్కించుకోవడం గమనార్హం.
మాజీ ఎంపీ ఓటమి..
తాజా ఎన్నికల్లో మరో చిత్రం.. మాజీ ఎంపీ ఓటమి. అరకు మాజీ ఎంపీ, వైసీపీ నాయకురాలు గొడ్డేటి మాధవి ఓటమి పాలయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొయ్యూరు జడ్పీటీసీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేశారు. అయితే.. ఆమె, తన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి హిమబిందు చేతిలో పరాజయం చెందారు. మాధవి 900 పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి పాలవడం స్థానికంగా చర్చకు దారితీసింది. గొడ్డేటి మాధవి 2019 లోక్‌సభ ఎన్నికల్లో అరకు పార్లమెంట్ స్థానం నుండి వైసీపీ తరఫున ఎంపీగా గెలుపొందారు. 2024 వరకు సేవలు అందించారు. గతంలో ఎంపీగా పనిచేసిన ఆమె, తాజా స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కానీ, ఆమె ఓడిపోయారు.
This post was last modified on November 8, 2026 3:56 pm
పోలవరం జిల్లాలో తాజాగా జరిగిన పరిషత్ ఎన్నికలలో జనసేన పూర్తిగా ఇరుకున పడింది. రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకు ప్రజలు జేజేలు…
తెలుగునాట అతి పెద్ద పండగల్లో దీపావళి ఒకటి. సెలవులు ఎక్కువ ఉండకపోయినా సెలబ్రేషన్స్ పీక్స్ లో ఉంటాయి. ముఖ్యంగా టపాసుల…
ఒక మార్పు మనిషినే కాదు.. రాజకీయాలను కూడా మార్చేస్తుంది. అమరావతికి కట్టుబడి ఉంటామని.. అమరావతి రాజధానిని మార్చబోమని.. అసలు అమరావతి…
ఇప్పుడు ఎక్కడ చూసినా రామాయణ పార్ట్ 1 కు వచ్చిన స్పందన, రికార్డు కలెక్షన్ల గురించిన చర్చే జరుగుతోంది. హిందీలోనే…
ప్రభాస్ ది రాజా సాబ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన హీరోయిన్ మళవిక మోహనన్. తాజాగా ఈ ముద్దుగుమ్మ.. తన…
తాజాగా జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం, గుడివాడ…