పరిషత్ ఎన్నికల ఫలితాలపై నాయకులు, అభ్యర్థుల రన్నింగ్ కామెంటరీ కొనసాగుతుంది. క్లీన్ స్వీప్ చేశామని అధికార కూటమి చెబుతుండగా రిగ్గింగ్ చేసి గెలుపు ప్రకటించుకున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే పులివర్తి నానీ సతీమణి సుధా రెడ్డి చేసిన కామెంట్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. పోలింగ్ రోజు చెవిరెడ్డికి ఎస్కార్ట్ గా తిరిగడం ద్వారా సుధా రెడ్డి ఫేమ్ అయిన సంగతి తెలిసిందే. అదే స్టైల్లో ఆమె ఇప్పుడు చెవిరెడ్డి కుమారుడి విజయం మీద కూడా కామెంట్స్ చేశారు. చెవిరెడ్డి బతిమాలుకుంటే బిక్ష వేశామని చెప్పడం వివాదంగా మారింది.
తిరుపతి రూరల్ జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి ముచ్చెలి ధనలక్ష్మిపై 602 ఓట్ల తేడాతో గెలుపొందారు. హర్షిత్ రెడ్డికి 41,119 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థికి 40,517 ఓట్లు వచ్చాయి. దీంతో వైఎస్సార్సీపీ నాయకుడు అయిన చెవిరెడ్డి భాస్కర రెడ్డి కుమారుడు స్వల్ప మెజారిటీతో గట్టెక్కినట్టయ్యింది. వైసీపీలో కీలక నాయకుడైన చెవిరెడ్డి కుమారుడి గెలుపు చంద్రగిరి నియోజకవర్గంలో చర్చనియాంశంగా మారింది.
ఈ విషయాన్ని సుధారెడ్డి వద్ద మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా ఆమె తీవ్రంగా స్పందించారు. రీకౌంటింగ్‌కు వెళ్దామని భావించామని, చెవిరెడ్డి బెగ్ చేసుకుంటే వదిలేశామని చెప్పారు. గెలుపోటముల మధ్య 600 ఓట్లు మాత్రమే తేడా ఉండగా చెల్లని ఓట్లు రెండు వేల వరకు ఉన్నాయని వివరించారు.
నేను ఒంగోలులో ఓడిపోయాను, నా పెద్ద కొడుకు చంద్రగిరిలో ఓటమి పాలయ్యడు, ఇప్పుడు నా చిన్న కొడుకు కూడా ఓడిపోతే డిప్రెషన్లోకి వెళ్లిపోతాడని చెవిరెడ్డి రిక్వెస్ట్ చేసుకున్నాడని చెప్పారు. అయినా కుటుంబంలో అందర్నీ ఓడించడం మంచిది కాదని రెండో కొడుక్కి జనం ఓటేసి ఉంటారని చురకంటించారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడం గమనార్హం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్ద కుమారుడు మోహిత్ రెడ్డి పోటీ చేసి పులివర్తి నాని మీద ఓటమి పాలయ్యాడు. అప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు చెవిరెడ్డి నానా తంటాలు పడుతున్నారు. ఇప్పుడు కూడా తండ్రి కొడుకులు చంద్రగిరి వదిలిపెట్టకుండా తిరిగారు. చావుతప్పి కన్ను లొట్ట పోయిన చందంగా ఆరు వందల ఓట్లతో బయటపడ్డారు.
This post was last modified on November 8, 2026 2:37 pm
మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయడం ఒక సంచలనం అయితే ఆయన ఓటమి…
ఉద్యోగం అంటే ఉదయం ఇంటి నుంచి బయలుదేరి ఆఫీసుకు వెళ్లడం లేదా ఇంట్లో ఒకే చోట కూర్చుని గంటల తరబడి…
పరిషత్ ఎన్నికల ఫలితాలు కూడా వచ్చేశాయి. మున్సిపల్ ఎన్నికల తరహాలోనే పరిషత్ ఎన్నికల్లో కూడా కూటమి జైత్రయాత్ర కొనసాగింది. కోస్తా,…
సుదీర్ఘ విరామం తర్వాత విజయవాడ నగరపాలక సంస్థ మేయర్‌గా వంగవీటి రాధా విజయం సాధించారు. ఇది ఒక రకంగా రంగా…
ఎటు చూసినా కూటమి పార్టీల ప్రభంజనమే కనిపిస్తోంది. ఏ టీవీ పెట్టినా ఇవే వార్తలు వస్తున్నాయి. ఏం చదివినా కూటమి…
గత ఏడాది చివర్లో హిందీ చిత్రం ‘దురంధర్’ సినిమా ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. దానికి కొనసాగింపుగా ఈ ఏడాది…