Political News

రాధా రాకతో బెజ‌వాడ రాజ‌కీయాలు మార‌తాయా?!

సుదీర్ఘ విరామం తర్వాత విజయవాడ నగరపాలక సంస్థ మేయర్‌గా వంగవీటి రాధా విజయం సాధించారు. ఇది ఒక రకంగా రంగా కుటుంబానికి, రంగా శ్రేయోభిలాషులకు, అభిమానులకు కూడా ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. వాస్తవానికి రాధా నామినేషన్ తోనే ఆయన గెలుపు పై అనేక అంచనాలు వచ్చాయి. సుమారు రెండు లక్షల ఓట్ల మెజారిటీతో ఆయన గెలుస్తారని కూడా లెక్కలు వేసుకున్నారు. కానీ అనూహ్యంగా పోలింగ్ శాతం తగ్గడంతో అంత భారీ ఓటింగ్ రాకపోయినప్పటికీ 1,35,000 ఓట్లతో రాధా విజయం సాధించారు.

ఇది ఒక రకంగా 2009 నుంచి చూసుకుంటే రాధాకు వచ్చిన గొప్ప విజయం అనే చెప్పాలి. పైగా రంగా కుటుంబానికి ప్రస్తుతం ఒక మంచి గ్రాఫ్ పెరిగే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నాడు. ఇదిలా ఉంటే రాధా కారణంగా బెజవాడ రాజకీయాలు అనూహ్యంగా మారిపోతాయి అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఒకప్పుడు రంగా వర్సెస్ దేవినేని రాజశేఖర్(నెహ్రూ) మధ్య విజయవాడ రాజకీయాలు ఉప్పు నిప్పుగా ఉండేవి. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకోవడంతో పాటు రాజకీయ దాడులు ఘర్షణలు నిత్య కృత్యంగా మారాయి.

మరి ఇప్పుడు కూడా అలాంటి వాతావరణం ఉంటుందా అనేది ఒకవైపు జరుగుతున్న చర్చ. ఎందుకంటే దేవినేని రాజశేఖర్ కుమారుడు దేవినేని అవినాష్ వైసీపీలో ఉన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ప్రస్తుతం ఇన్చార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు నగరంలో రాధా ప్రభావం పెర‌గనుంది. పైగా ఆయన మేయ‌రు కావడం కూడా మరింతగా రాజకీయాల్లో ప్రభావం చూపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ దేవినేని వర్సెస్ వంగవీటి కుటుంబాల మధ్య రాజకీయ ఘర్షణలు లేదా బలమైన రాజకీయ యుద్ధాలు జరిగే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.

మరికొందరు మాత్రం తరం మారింది కాబట్టి ఆ స్థాయిలో ఉండకపోవచ్చు అని కూడా అంచనా వేస్తున్నారు. ఏదేమైనా రాధా గెలుపు రాజకీయాలను స్పష్టంగా మారుస్తుందన్న అంచనా అయితే కనిపిస్తోంది. ఇక‌, అవినాష్ విష‌యాన్ని చూస్తే.. ఫైర్ బ్రాండ్ నాయ‌కుడిగా.. త‌న‌తండ్రి వార‌స‌త్వాన్ని నిల‌బెట్టాల‌న్న దూకుడు ప్ర‌దర్శిస్తున్నారు. ఈ క్ర‌మంలో రాధా సౌమ్యంగానే ఉన్నా అవినాష్ గిల్లి కజ్జాలు పెట్టుకునే అవ‌కాశం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. కుటుంబాల మ‌ధ్య ఉన్న వైరాలు స‌మ‌సిపోలేద‌ని.. ఇటీవ‌ల అవినాష్ చేసిన వ్యాఖ్య‌లను కొంద‌రు ప్ర‌స్తావిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on November 7, 2026 11:03 pm

Share

Recent Posts

చెవిరెడ్డి అడిగితే బిక్ష వేశాం

పరిషత్ ఎన్నికల ఫలితాలపై నాయకులు, అభ్యర్థుల రన్నింగ్ కామెంటరీ కొనసాగుతుంది. క్లీన్ స్వీప్ చేశామని అధికార కూటమి చెబుతుండగా రిగ్గింగ్…

18 minutes ago

ఏబీవీ ప‌రాజ‌యం: కొత్త నేత‌ల‌ ఆశ‌ల‌కు బ్రేక్‌?

మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయడం ఒక సంచలనం అయితే ఆయన ఓటమి…

2 hours ago

ఐటీ ఉద్యోగులకు పార్కులే కొత్త ఆఫీసులు

ఉద్యోగం అంటే ఉదయం ఇంటి నుంచి బయలుదేరి ఆఫీసుకు వెళ్లడం లేదా ఇంట్లో ఒకే చోట కూర్చుని గంటల తరబడి…

4 hours ago

రెబల్ అభ్యర్థుల్లోనూ కూటమిదే పై చేయి

పరిషత్ ఎన్నికల ఫలితాలు కూడా వచ్చేశాయి. మున్సిపల్ ఎన్నికల తరహాలోనే పరిషత్ ఎన్నికల్లో కూడా కూటమి జైత్రయాత్ర కొనసాగింది. కోస్తా,…

4 hours ago

ఎటు చూసినా కూట‌మే… దిక్క‌లు చూస్తున్న వైసీపీ!

ఎటు చూసినా కూట‌మి పార్టీల ప్ర‌భంజ‌న‌మే క‌నిపిస్తోంది. ఏ టీవీ పెట్టినా ఇవే వార్త‌లు వ‌స్తున్నాయి. ఏం చదివినా కూట‌మి…

6 hours ago

‘రామాయణం’పై బాలీవుడ్ ఎందుకు గప్‌చుప్?

గత ఏడాది చివర్లో హిందీ చిత్రం ‘దురంధర్’ సినిమా ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. దానికి కొనసాగింపుగా ఈ ఏడాది…

7 hours ago