ఎటు చూసినా కూటమి పార్టీల ప్రభంజనమే కనిపిస్తోంది. ఏ టీవీ పెట్టినా ఇవే వార్తలు వస్తున్నాయి. ఏం చదివినా కూటమి నాయకుల గెలుపే కనిపిస్తోంది. మొత్తంగా అటు స్థానికం, కార్పొరేషన్, తాజాగా ఎంపీటీసీ, జడ్పీటీసీల్లో కూటమి ప్రభంజనం తారస్థాయిలో కనిపిస్తుండడంతో వైసీపీ నేతలు తెల్లబోతున్నారు. బలమైన ప్రభావం చూపుతామని అంచనా వేసుకున్న పల్నాడు జిల్లాలోనూ కూటమి పార్టీలకే ప్రజలు మొగ్గు చూపారు. ఇక, ఉమ్మడి కృష్ణాలోనూ క్లీన్ స్వీప్ లే కనిపిస్తున్నాయి.
మరోవైపు వైసీపీ సీనియర్ నేతల ఇలాకాలుగా చెప్పుకొనే కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, విజయనగరం, విశాఖపట్నం.. ఇలా ఎటు చూసినా.. కూటమి నాయకుల విజయ పరంపర కొనసాగింది. ఏ నలుగురు కలిసినా ఈ విషయాలే చర్చకు వస్తున్నాయి. దీంతో వైసీపీ నాయకులు పోలింగ్ కేంద్రాల నుంచి తీవ్ర ఓటమి భారంతో వెనుదిరగక తప్పలేదు. పైగా ప్రశాంతంగా కౌంటింగ్ జరిగినట్టు వారే చెప్పడం మరో విశేషం. అంతేకాదు.. ఎక్కడా కూడా ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా పోవడం మరో చిత్రం.
వాస్తవానికి బ్యాలెట్ పత్రంపై ఎన్నికలు జరగాలని కోరుకున్నది వైసీపీనే. అలా అయితే.. తమ గెలుపును ఎవరూ ఆపలేరని కూడా వైసీపీ అధినేత జగన్ పేర్కొన్నారు. తాజాగా అదే జరిగింది. ఎన్నికల్లో ఈవీఎంలను వాడకుండా పూర్తిగా బ్యాలెట్ పత్రాలనే వినియోగించారు. కానీ.. ఎక్కడా వైసీపీకి అనుకూల ఓటు బ్యాంకు పెరగలేదు. సరికదా.. ఉన్న ఓటు బ్యాంకులోనూ కోత పడింది. లేకపోతే.. పులివెందుల వంటి బలమైన నియోజకవర్గాల్లోనూ వైసీపీ నేల చూపులు చూడడం ఏంటనేది రాజకీయంగా ఆసక్తికర అంశం.
సౌండ్ లేదు!
వైసీపీ నేతలు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తారని ఆ పార్టీ నాయకులు అనుకున్నారు. కానీ.. ఆ తరహా పరిస్థితి లేకుండా పోయింది. దీంతో సంబరాల కోసం సిద్ధం చేసుకున్న క్రాకర్సును మూల పడేశారు. వాస్తవానికి స్థానిక ఎన్నికల ఫలితం వచ్చిన తర్వాత.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరిగింది. దీంతో తమకు సానుభూతి దక్కుతుందని ఈ ఎన్నికల్లో అయినా.. విజయం లభిస్తుందని అంచనా వేసుకున్నారు. కానీ, అది కూడా సాధ్యం కాలేదు. దీంతో వైసీపీ కార్యాలయాలు బోసిపోతున్నాయి.
This post was last modified on November 8, 2026 1:53 am
ఉద్యోగం అంటే ఉదయం ఇంటి నుంచి బయలుదేరి ఆఫీసుకు వెళ్లడం లేదా ఇంట్లో ఒకే చోట కూర్చుని గంటల తరబడి…
పరిషత్ ఎన్నికల ఫలితాలు కూడా వచ్చేశాయి. మున్సిపల్ ఎన్నికల తరహాలోనే పరిషత్ ఎన్నికల్లో కూడా కూటమి జైత్రయాత్ర కొనసాగింది. కోస్తా,…
సుదీర్ఘ విరామం తర్వాత విజయవాడ నగరపాలక సంస్థ మేయర్గా వంగవీటి రాధా విజయం సాధించారు. ఇది ఒక రకంగా రంగా…
గత ఏడాది చివర్లో హిందీ చిత్రం ‘దురంధర్’ సినిమా ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. దానికి కొనసాగింపుగా ఈ ఏడాది…
రామాయణ పార్ట్ 1 సక్సెస్ తో రన్బీర్ కపూర్ మంచి హుషారు మీదున్నాడు. పేరు తెచ్చుకునే విషయంలో యష్ పోటీ…
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గుడివాడ పరిధిలోని ఎంపీటీసీ, జడ్పీటీసీలలో కూటమి విజయ దుందుభి మోగించింది. ఈ ప్రాంతాల్లోని అన్ని స్థానాల్లోనూ 96.87%…