Political News

గడ్డం పెంచినంత మాత్రాన కేటీఆర్ రేవంత్ రెడ్డి కాలేడు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మధ్య కొత్త లుక్ లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి క్లీన్ షేవ్ తో కనిపించే కేటీఆర్…ఈ మధ్య ట్రిమ్ హెయిర్ కట్..లైట్ గడ్డంతో కనిపిస్తున్న వైనం హాట్ టాపిక్ గా మారింది. అయితే, కేటీఆర్ గడ్డం పెంచడం వెనుక ఒక కారణముంది అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న రీతిలో తనను చూసి కేటీఆర్ గడ్డం పెంచుతున్నాడని రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి.

సీఎం రేవంత్ రెడ్డిని అందరూ ఎందుకు అంత గౌరవిస్తారు, కనిపించగానే షేక్ హ్యాండ్ ఇస్తారు అని కేటీఆర్ కు గుబులు పుట్టిందని రేవంత్ అన్నారు. దీంతో, ఓ ఫైవ్ స్టార్ హోటల్లో కేటీఆర్ తెలిసినోళ్లను, కావాల్సినోళ్లను..కన్సల్టెంట్లను పిలిచి మీటింగ్ పెట్టారని రేవంత్ ఆరోపించారు.

రేవంత్ సార్ కు గడ్డం ఉంది..మీకు గడ్డం లేదు…అని కన్సల్టెంట్లు చెప్పడంతో కేటీఆర్ గడ్డం పెంచాడని రేవంత్ ఆరోపించారు. అయితే, కేటీఆర్ పది జన్మలెత్తినా..తలకిందులైనా…తాటిచెట్టుకు ఉరేసుకున్నా…ఆయన తారకరామావేగానీ ఎన్నటికీ రేవంత్ రెడ్డి కాలేడని విమర్శించారు. గడ్డం పెంచడానికి కేటీఆర్ కు 50 ఏళ్లు పట్టిందని, బుద్ధి రావడానికి ఇంకెన్నేళ్లు పడుతుందో అని ఎద్దేవా చేశారు.

కేటీఆర్….రేవంత్ రెడ్డి కావాలంటే కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకునే ధైర్యం కావాలని రేవంత్ అన్నారు. పిడుగు మీద పడ్డా…నమ్మినోళ్ల వెంట ఉండాలని చెప్పారు. కేటీఆర్ కు చంద్ర శేఖర్ రావు కొంచెం..బుద్ధి చెప్పాలని హితవు పలికారు. వాళ్ల జాతిని తెలంగాణ ప్రజలు నమ్మరని, లిక్కర్ మొదలు నీళ్ల వరకు ఇంటిల్లిపాది తెలంగాణను కొల్లగొట్టి పదేళ్లలో లక్ష కోట్లు సంపాదించారని కేసీఆర్ కుటుంబంపై సంచలన ఆరోపణలు చేశారు.

This post was last modified on November 7, 2026 8:46 pm

Share

Recent Posts

జ‌గ‌న్‌కు డబుల్ షాక్‌..

వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం.. పులివెందుల పూర్తిగా టీడీపీ వ‌శం అయిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో పులివెందుల…

34 minutes ago

సూర్యకు మామూలు జాక్‌పాట్ కాదు

ఈ ఏడాది మే 15న తమిళ స్టార్ హీరో సూర్య ఎలాంటి స్థితిలో ఉన్నాడో గుర్తుండే ఉంటుంది. చాలా ఏళ్లుగా…

40 minutes ago

గోల్డ్ డైమండ్స్ తేడా ప్రేక్షకులకు తెలుసు

ఇటీవలే విడుదలైన 'సమ్మర్ హాలిడేస్' టాక్ అయితే డీసెంట్ గానే ఉంది. బాలేదని ఎవరూ అనలేదు. అలాని ఎక్స్ ట్రాడినరి…

2 hours ago

నీళ్లు ఇచ్చినందుకు కార్యకర్తని కొట్టబోయిన రోజా

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడ్డాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇక్కడ కూడా రిపీట్ అయ్యాయి.…

2 hours ago

10 సినిమాల తాకిడిని బాక్సాఫీస్ తట్టుకోగలదా

ఎన్నిసార్లు ఎన్ని పాఠాలు నేర్చుకున్నా అతివృష్టి అనావృష్టి పద్దతిని టాలీవుడ్ ఇప్పట్లో విడిచిపెట్టేలా లేదు. మంచి డేట్లు వదిలేసుకోవడం, ప్యాన్…

4 hours ago

సురేఖ వాణి వీడియో నిజమే కానీ…

సీనియర్ నటి సురేఖ వాణి పేరు నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఆమె ప్రైవేట్ వీడియో ఒకటి…

5 hours ago