గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నుంచి ఇంకా తేరుకొని వైసీపీకి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు దిమ్మతిరిగేలా చేస్తున్నాయి. మొత్తం 100 మున్సిపల్, 13 కార్పొరేషన్ లకు ఎన్నికలు జరిగాయి. రెంటికి కలిపి కేవలం నాలుగు చోట్ల మాత్రమే వైసీపీ విజయం సాధించింది. ఒక్క స్థానంలో కూడా ఏకగ్రీవ ఎన్నిక జరగకుండా చూడాలని జగన్ ఆదేశించారు. స్వయంగా పులివెందుల మున్సిపాలిటీలోనే ఏకగ్రీవాలు జరిగాయి. ఇవన్నీ ఒకెత్తయితే బాపట్ల జిల్లా చీరాలలో వచ్చిన ఫలితాలు మరో ఎత్తని చెప్పవచ్చు. ఇక్కడ వైసీపీ మూడో స్థానంలో నిలిచింది. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ రెండో స్థానం దక్కించుకొంది.
మురసు తుఫాన్ కారణంగా ఈ నెల 3వ తేదీన జరగాల్సిన చీరాల మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా పడింది. శుక్రవారం ఉదయం నుంచి కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. మొదట పోస్టల్ ఓట్లలో మాత్రం వైసీపీ మెరుగైన ఫలితాలు సాధించింది. పోస్టల్ బ్యాలెట్ లో టీడీపీకి 40, వైసీపీకి 37, కాంగ్రెస్ కు 11 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ రెండో స్థానంలో నిలిచింది. హమ్మయ్య పర్వాలేదులే అనుకుంటుండగా అసలు రిజల్ట్స్ రావడం మొదలైంది. చీరాల మున్సిపాలిటీలోని 44 వార్డులకు కౌంటింగ్ జరిగింది. టీడీపీ చైర్మన్ పదవి గెలుచుకుంది.
టీడీపీ 22 వార్డులలో విజయం సాధించి అగ్రస్థానంలో నిలిచింది. 10 వార్డులను కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో నిలిచి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. వైసీపీ కేవలం 8 స్థానాల్లో మాత్రమే విజయం సాధించి మూడో స్థానం దక్కించుకుంది.
వార్డుల్లో కూడా భిన్నమైన రిజల్ట్స్ వచ్చాయి.
25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. ఈ వార్డులో బీజేపీ అభ్యర్థి రెండో స్థానంలో, వైసీపీ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు. 22వ వార్డులో టీడీపీ అభ్యర్థి కైవసం చేసుకోగా, అక్కడ కాంగ్రెస్ రెండో స్థానంలో, వైసీపీ మూడో స్థానంలో నిలిచాయి. పలు వార్డుల్లో వైసీపీ మూడో స్థానంలో నిలవడం స్థానికులకు ఆశ్చర్యం కలిగించింది.
మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు వెంకటేష్ చీరాల వైసీపీ ఇంచార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆర్ధిక బలం, అంగబలం పుష్కలంగా వున్న కరణం లాంటి నాయకుడు వున్నప్పటికి చీరాల బరిలో వైసీపీ తన ప్రభవాన్ని చూపలేక పోవడం చర్చనియాంశంగా మారింది. కాంగ్రెస్ ఇంచార్జి ఆమంచి కృష్ణ మోహన ప్రభావం చీరాలలో ఇంకా కొనసాగుతున్న సంకేతాలు ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందని విశ్లేషకులు చెబుతున్నారు.
This post was last modified on November 6, 2026 8:56 pm
నగరాల్లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. ముఖ్యంగా పర్యాటకులు, భక్తులు అధికంగా వచ్చే ప్రాంతాల్లో రహదారులపై ప్రయాణం చేయడం పెద్ద…
మలయాళీ సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరు నటులు క్రిమినల్ కేసులో అరెస్టు కావడం కేరళలో సంచలనం సృష్టించింది. వైద్య సహాయం…
ఏపీ సీఎం చంద్రబాబు కల నెరవేరిందా? ఆయన ఆశిస్తున్నట్టుగా మరిన్ని పెట్టుబడులు రాష్ట్రానికి చేరనున్నా యా? అంటే.. అవుననే సమాధానమే…
సర్ వెనక ఏదో కుట్ర జరుగుతుందని ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆరోపణలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. తొలుత రోహింగ్యాల ఓట్లను…
2019 ఎన్నికల్లో వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచిన రెడ్డి సామాజిక వర్గం, 2024 ఎన్నికల నాటికి, ఆ తర్వాత కాలంలో తీవ్ర…
ఏపీ రాజకీయాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి అత్యంత కీలకమైన రాజకీయ సమీకరణంగా మారింది. ఈ మూడు పార్టీలు కలిసి…