Movie News

కోహినూర్ వజ్రంలా మెరిసిపోయిన శ్రీలీల..!

శ్రీలీల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మొదటి సినిమా పెళ్లిసందడితోనే తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత రవితేజ హీరోగా వచ్చిన ధమాకా చిత్రంతో.. నిజంగానే ధమాకా సృష్టించింది. ధమాకా సినిమా ఎప్పుడు వచ్చిందో కానీ, అప్పటి నుంచి ఈ హీరోయిన్‌ ఇప్పటివరకు అవకాశాలు లేని రోజే చూడలేదు అని చెప్పవచ్చు.

ధమాకా తర్వాత ఎన్నో వరుస ఫ్లాపులు వచ్చినా శ్రీలీలకు మాత్రం అభిమానులు తగ్గలేదు, అవకాశాలు కూడా తగ్గలేదు. తాను నటించిన సినిమాల్లో బాలకృష్ణ భగవంత్ కేసరి చిత్రంలో మంచి పాత్రను సొంతం చేసుకుని తన నటనతో కూడా ఆకట్టుకుంది. ఈ హీరోయిన్‌కు ఫ్లాప్ వచ్చిన ప్రతిసారీ.. ఇక ఈమె పని అయిపోయిందని చాలామంది అనుకుంటే..ఆ వెంటనే మూడు నాలుగు సినిమాలకు సైన్ చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తూ వచ్చింది.

తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూనే ఒకపక్క హిందీలో, మరోపక్క తమిళంలో కూడా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.

ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫోటోలు షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా వైట్ డ్రెస్‌లో వజ్రంలా మెరిసిపోతూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ డ్రెస్‌లో శ్రీలీలను చూస్తే ఎవరైనా సరే అతిలోకసుందరి అనకుండా ఉండలేరు. డైమండ్ చెవి కమ్మలు, మెరిసిపోయే డ్రెస్, మైమరిపించే నవ్వుతో కుర్రకారు మనసులను ప్రేమలో పడేస్తోంది.

నిన్న రాత్రి జరిగిన ఫంక్షన్ లో ఫోటోలు అంటూ క్యాప్షన్ పెట్టి.. అందరినీ ఫిదా చేసే ఫోజులతో.. ఇంస్టాగ్రామ్ లో సెగలు పుట్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

This post was last modified on November 7, 2026 6:26 am

Share

Recent Posts

చిన్న వయసులోనే పోటీ.. రిజ‌ల్ట్‌కు ముందు దివ్య‌ మృతి

జ‌న‌సేన పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ పార్టీ త‌ర‌ఫున ఎన్నో ఆశ‌ల‌తో మండ‌ల ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో రంగంలోకి…

30 minutes ago

వైసిపీని తొక్కేసిన కాంగ్రెస్

గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నుంచి ఇంకా తేరుకొని వైసీపీకి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు దిమ్మతిరిగేలా చేస్తున్నాయి. మొత్తం 100…

10 hours ago

45 నిమిషాల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే..

నగరాల్లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. ముఖ్యంగా పర్యాటకులు, భక్తులు అధికంగా వచ్చే ప్రాంతాల్లో రహదారులపై ప్రయాణం చేయడం పెద్ద…

12 hours ago

నటి ఫోన్ కాల్.. డాక్టర్‌కు ఊహించని షాక్!

మలయాళీ సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరు నటులు క్రిమినల్ కేసులో అరెస్టు కావడం కేరళలో సంచలనం సృష్టించింది. వైద్య సహాయం…

12 hours ago

చంద్ర‌బాబు క‌ల నెర‌వేరిందా… ?

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల నెర‌వేరిందా? ఆయ‌న ఆశిస్తున్న‌ట్టుగా మ‌రిన్ని పెట్టుబ‌డులు రాష్ట్రానికి చేర‌నున్నా యా? అంటే.. అవున‌నే స‌మాధాన‌మే…

13 hours ago

సంక్షేమ పథకాలకు ఓటర్ కార్డు ఎందుకు?

సర్ వెనక ఏదో కుట్ర జరుగుతుందని ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆరోపణలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. తొలుత రోహింగ్యాల ఓట్లను…

13 hours ago