తిరుమల తిరుపతి శ్రీవారి పవిత్ర ప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారన్న కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వైసీపీకి చెందిన చిత్తూరు నాయకుడు ఒకరు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఈ సందర్భంగా పిటిషనర్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని అడుగుతున్నారు. రేపు మమ్మల్ని కూడా వేరే రాష్ట్రానికి బదిలీ కావాలని కోరుతారా? అని వ్యాఖ్యానించింది. అంతేకాదు.. ఇలా చేస్తూ పోతే.. దేశంలోని రాష్ట్రాలు చాలవని వ్యాఖ్యానించడం గమనార్హం.
ఏం జరిగింది?
వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ రంగంలోకి దిగింది. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా దీనిని నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఈ విచారణలు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం ఆయా దర్యాప్తు నివేదికలు కోర్టుల పరిధిలో ఉన్నాయి. వీటిపై ప్రాసిక్యూషన్ మాత్రమే జరగాల్సి ఉంది.
అయితే.. ఏపీ సిట్ చేసిన దర్యాప్తులో లోపాలు ఉన్నాయని.. దీనిని వేరే రాష్ట్రానికి అప్పగించాలని.. అలానే హైకోర్టు పరిధిని కూడా మార్చాలని కోరుతూ… చిత్తూరుకు చెందిన మాజీ ప్రజాప్రతినిధి, వైసీపీ నేత ఒకరు గత నెలలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. తాజాగా దానిని కొట్టి వేసింది. న్యాయస్థానాలపైనా.. దర్యాప్తు సంస్థలపైనా విశ్వాసం కలిగి ఉండాలని.. ఎవరినీ నమ్మలేమని అంటే.. మిమ్మల్ని కూడా మేం నమ్మలేని పరిస్థితి వస్తుందని పిటిషనర్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
బాగానే చేశారు..
దర్యాప్తు గురించి సుప్రీంకోర్టు స్పందిస్తూ.. అంతా బాగానే జరిగిందని వ్యాఖ్యానించింది. సీబీఐ విచారణ, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ విచారణలు కూడా బాగానే జరిగాయని.. దీనిలో తప్పుబట్టాల్సిన అవసరం లేదని పేర్కొంది. హైకోర్టు కూడా దీనిపై బాగానే చర్యలు తీసుకుందన్న విషయాన్ని పిటిషనర్ గుర్తించాలని కోరింది. ఈ నేపథ్యంలో వేరే రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేయాలన్న పిటిషనర్ అభ్యర్థనలో పసలేదని తేల్చింది. కారణాలు కూడా సహేతుకంగా లేవని స్ఫష్టం చేస్తూ.. పిటిషన్‌ను కొట్టి వేసింది. కేసు విచారణ మొత్తం ఏపీ పరిధిలోనే కొనసాగుతుందని పేర్కొంది.
This post was last modified on November 5, 2026 9:35 pm
వెంకటేష్‌కు 'ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47' ఆశించిన స్థాయిలో కలిసిరాలేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా కావడంతో మొదటి నుంచి…
మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు యూటర్న్ తీసుకున్నారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన…
మొదటి సినిమా సీతారామంతోనే.. సీత పాత్రలో కనిపించి.. తెలుగు ప్రేక్షకుల మనసులను దోచేసింది మృణాల్ ఠాకూర్. ఆ తర్వాత వచ్చిన…
స్టార్ హీరోలకు బయట కోట్ల మంది అభిమానులుంటారు. కానీ స్టార్ హీరోల్లో కూడా అభిమానులను సంపాదించుకునే వాళ్లు కొందరే ఉంటారు.…
థియేటర్ రిలీజ్ జరిగిన నెలలోపే జైలర్ 2 ఓటిటిలో వచ్చేస్తోంది. నవంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు అమెజాన్ ప్రైమ్…
ఇటీవలే కరణ్ జోహార్ ఇంటర్వ్యూలో పెద్ది పాత్ర గురించి జాన్వీ కపూర్ చేసిన కామెంట్లు, జీవితంలో ఇలాంటి తప్పు పాత్ర…