గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనసేన కీలక ఆప్షన్‌గా మారనుంది. వాస్తవానికి ఈ ఎన్నికల్లో అభ్యర్థులకు పార్టీలు, జెండాలు వంటివి ఉండకపోయినా.. ప్రధాన పార్టీలన్నీ.. పోటీ చేసేవారికి మద్దతు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో జనసేన ఇప్పుడు చాలా మందికి ఆదరవుగా నిలిచిందన్న టాక్ వినిపిస్తోంది. గ్రామీణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మెజారిటీసభ్యులు.. తాము జనసేన మద్దతు దారులమని చెబుతున్నారు. దీంతో ప్రచారం నుంచిపోటీ వరకు కూడా ప్రధానంగా జనసేన మాటే వినిపిస్తోంది.
ఒకప్పుడు అభ్యర్థులు స్వతంత్రంగా పోటీ చేసే వారు. వేలాది సంఖ్యలో గ్రామ పంచాయతీలకు ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ వేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఇండిపెండెంట్ల సంఖ్య చాలా వరకు తగ్గిపోయిందని నామినేషన్లు స్వీకరిస్తున్న అధికారులు చెబుతున్నారు. ఇదేసమయంలో జనసేన మద్దతు దారుల సంఖ్య పెరుగుతోంది. దీనికి కారణం.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పచ్చ జెండా ఊపడమేనన్న వాదన వినిపిస్తోంది. ఎవరు పోటీ చేసినా.. అడ్డుకోవద్దంటూ పార్టీ నాయకులకు ఆయన తేల్చి చెప్పారు.
అంతేకాదు.. పార్టీ తరఫున పోటీ చేసేవారికి మద్దతుగా.. హెల్ప్‌లైన్‌ను కూడా ఏర్పాటు చేశారు. పార్టీ కేంద్ర కార్యాల యంలో ఏర్పాటు చేసిన ఈ హెల్ప్‌లైన్ 24 గంటలూ పనిచేస్తోంది. అభ్యర్థులకు పోటీ చేయడం నుంచి ప్రచారం చేయడం వరకు, స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించే వరకు కూడా ఈ హెల్ప్‌లైన్ పనిచేస్తోంది. దీంతో అభ్యర్థులు కూడా ఈ ఎన్నికల్లో జనసేనను కీలక ఆప్షన్‌గా ఎంచుకుంటున్నారు. ఫలితంగా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ఒకరకంగా అసెంబ్లీని మించి జరుగుతున్నాయన్న చర్చ తెరమీదికి వచ్చింది.
వైసీపీకి ఈ దఫా పెద్దగా స్పందన లేకపోవడం గమనార్హం. ఒకప్పుడు గ్రామీణ భారతంలో వైసీపీ తరఫున ఎక్కువ మంది పోటీ చేసేవారు. జగన్ సహా వైఎస్ రాజశేఖరరెడ్డి మద్దతుదారులుగా రంగంలోకి దిగిన పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు స్థానిక, కార్పొరేషన్ ఎన్నికల్లో వచ్చిన ఫలితం చూసిన తర్వాత.. వైసీపీ తరఫున లేదా.. వారి మద్దతు దారులుగా రంగంలోకి దిగుతున్నవారు.. చాలా వరకు తగ్గిపోయారని నివేదికలు కూడా స్పష్టం చేస్తున్నాయి. దీనికి ప్రతిగా జనసేనను ప్రధాన ఆప్షన్‌గా ఎంచుకుంటున్నారు. దీంతో గ్రామీణ స్థాయిలో జనసేన పుంజుకుంటుందున్న వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
This post was last modified on November 25, 2026 11:39 pm
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ డెబ్యూకి ఇంకా అడుగులు మొదలు కాలేదు. మైత్రి మూవీ మేకర్స్ భారీ…
"మేము ఆడుకునేవాళ్ళం కాదు..." ఈ మాటలు అన్నది ఎవరో దారినపోయే దానయ్య కాదు. ఏళ్ళ తరబడి దేశాన్ని పాలించిన కాంగ్రెస్…
ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుగా పనిచేస్తున్నారని, ఈ స్పీడు చూస్తే.. అమరావతి రాజధాని నిర్మాణ పనులు అనుకున్న సమయానికంటే కూడా…
కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ(సర్)పై దేశంలోని పలు రాష్ట్రాలు అభ్యంతరం…
ఏపీ అధికార పార్టీ టీడీపీ సంచలన రికార్డును సొంతం చేసుకుంది. పార్టీ ప్రారంభించిన `మై-టీడీపీ` యాప్.. స్వల్పకాలంలోనే 10 లక్షల…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రచ్చ దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్లో ఒక సినిమా కోసం సన్నాహాలు జరిగి.. ఏడాదికి…