Movie News

రామాయణ 2 అంచనాలకు రంగం సిద్ధమేనా

కొన్ని నెలల క్రితం టీజర్ వచ్చినప్పుడు ట్రోలింగ్ కు గురైన రామాయణ పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేస్తోంది. ఓవర్సీస్ లోనీ కీలకమైన నార్త్ అమెరికాలో ఏకంగా దురంధర్ రివెంజ్ రికార్డుని తుడిచిపెట్టేసి 29 మిలియన్ మార్కుని దాటేయడం పట్ల డిస్ట్రిబ్యూషన్ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. నార్త్ అమెరికా మార్కెట్ లో ఇది సరికొత్త మైలురాయి. వరల్డ్ వైడ్ 1700 కోట్ల గ్రాస్ దాటేసి రెండు వేలని టార్గెట్ గా పెట్టుకున్న ఈ ఎపిక్ డ్రామా ఫైనల్ థియేటర్ రన్ లోపల దాన్ని సాధ్యం చేసుకునేలా ఉంది.

సరే నెంబర్ల సంగతి కాసేపు పక్కన పెడదాం. రెండేళ్ల తర్వాత విడుదల కాబోయే రామాయణ పార్ట్ 2కి ఇప్పుడీ విజయం వేసిన పునాది ఎంత వరకు ఉపయోగపడుతుందనే కోణంలో బాలీవుడ్ విశ్లేషకులు రకరకాల భాష్యాలు చెబుతున్నారు. ఇంకా హనుమంతుడి ఎంట్రీ జరగలేదు. రామ రావణ యుద్ధం సీక్వెల్ లో ఉంటుంది. రామసేతు నిర్మాణం, సంజీవని పర్వతం లాంటి ఎన్నో కీలకమైన ఎపిసోడ్స్ పార్ట్ 2 కోసం దాచి ఉంచారు. విఎఫ్ఎక్స్ కూడా పెద్ద ఎత్తున అవసరం పడుతుంది. అంచనాలు కూడా అంతే ఉంటాయి.

ఒకరకంగా చెప్పాలంటే బాహుబలి రేంజ్ లో పార్ట్ 2 మీద విపరీతమైన ఎగ్జైట్ మెంట్ కలిగించిందా అంటే లేదనే చెప్పాలి. అయితే బిజినెస్ పరంగా డిమాండ్ సృష్టించడంలో సక్సెస్ అయ్యింది. కలెక్షన్లను ఎక్కువ చేసి చూపించారని, గ్రౌండ్ లెవెల్ లో అంత స్థాయిలో వసూళ్లు లేవని కొందరు క్రిటిక్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నప్పటికీ రామాయణ అంకెలు చాలా స్టడీగా ఉన్నాయి. మంగళవారం 99 రూపాయల ఆఫర్ వల్ల ఉత్తరాది రాష్ట్రాల్లో అనూహ్యమైన పికప్ వచ్చింది.

ఇంకా చాలా టైం ఉంది కాబట్టి రామాయణ పార్ట్ 2 మీద ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ధారణకు రాలేం కానీ ఒక పాజిటివ్ వాతావరణాన్ని సృష్టించడంలో నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితేశ్ తివారి సఫలీకృతులయ్యారు. ఆస్కార్ రేసులో నిలబడుతున్న రామాయణ మరి ఆ గౌరవాన్ని అందుకుంటుందో లేక ఆర్ఆర్ఆర్ లాగా ఏదో ఒక విభాగంతో సరిపుచ్చుకుంటుందో వేచి చూడాలి. రామాయణ 2కి సంబంధించిన షూటింగ్ గతంలో సగంపైనే అయ్యిందట. త్వరలోనే మిగిలిన భాగం పూర్తి చేయబోతున్నారు.

This post was last modified on November 26, 2026 10:03 am

Share

Recent Posts

అనంత్ అంబానీతో షారుఖ్ వీడియో వైరల్.. ఇప్పుడు లీగల్ వార్

బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి సినిమా కారణంగా కాదు.. సోషల్ మీడియాలో…

8 minutes ago

ఇంతకన్నా మంచి ఛాన్స్ రాదు శర్వా

రేపు భోగి విడుదల కానుంది. ప్రమోషన్స్ పరంగా టీమ్ ఎంత చేయాలో అంతా చేసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలు,…

37 minutes ago

కొత్త పాఠం నేర్పించిన రిపీట్ రిజల్ట్

గత వారం విడుదలైన ఈ నగరానికి ఏమైంది రిపీట్ సూపర్ హిట్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. యాభై…

1 hour ago

ఎన్టీఆర్ నవ్వులకు రావిపూడి హామీ

ఎవరూ ఊహించని విధంగా కొద్దిరోజుల క్రితం ప్రకటించిన జూనియర్ ఎన్టీఆర్ - అనిల్ రావిపూడి సినిమా గురించి మూవీ లవర్స్…

2 hours ago

గ్రామాల్లో వైసిపిని కట్టడి చెయ్యడానికి జనసేన అస్త్రం

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన కీల‌క ఆప్ష‌న్‌గా మార‌నుంది. వాస్త‌వానికి ఈ ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థులకు పార్టీలు, జెండాలు వంటివి ఉండ‌క‌పోయినా..…

3 hours ago

మోక్షజ్ఞ అప్పటిదాకా వెయిట్ చేయాలి

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ డెబ్యూకి ఇంకా అడుగులు మొదలు కాలేదు. మైత్రి మూవీ మేకర్స్ భారీ…

5 hours ago