Movie News

మెగా హీరో ఇక సింగిల్ కాదు

కొన్ని రోజుల నుంచి ప్రచారంలో ఉన్న వార్త నిజమే అని తేలింది. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకడైన మెగా హీరో సాయిధరమ్ తేజ్ బ్రహ్మచర్యానికి ముగింపు పలికేస్తున్నాడు. గురువారం అతడి నిశ్చితార్థం పూర్తయింది. పెద్దగా హడావుడి లేకుండా సైలెంటుగా ఎంగేజ్మెట్ చేసుకుని షాకిచ్చాడు తేజు. తన చిన్ననాటి స్నేహితురాలు కిర్మణయిని అతను పెళ్లాడబోతున్నాడు. మెగా ఫ్యామిలీకి చెందిన అత్యంత సన్నిహితుల మధ్య నిశ్చితార్థ వేడుక పూర్తయింది.

ఇందులో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు పాల్గొన్నది లేనిదీ స్పష్టత లేదు. రామ్ చరణ్ ఎక్స్‌లో పెట్టిన పోస్టులో మాత్రం తేజు తరానికి చెందిన మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అకీరా నందన్, అల్లు శిరీష్, అల్లు బాబీ, నిహారిక, లావణ్య త్రిపాఠి, సుష్మిత, స్నేహారెడ్డి, ఆద్య, నయనిక.. ఇలా చాలామంది ఉన్నారీ ఫొటోలో.

ఇంకో నెల తర్వాత డిసెంబరు రెండో వారంలో తేజు, కిరణ్మయిల పెళ్లి జరగనున్నట్లు సమాచారం. చాలా కాలం తర్వాత మెగా కుటుంబంలో మరో పెళ్లి వేడుక జరగనుండటంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. తేజుకు ఇప్పటికే 40 ఏళ్లు వచ్చేశాయి. నిజానికి అతను ఇంకా ముందే పెళ్లి చేసుకునేవాడేమో. ఐతే కొన్నేళ్ల ముందు యాక్సిడెంట్ అయి తీవ్ర సమస్యలు ఎదుర్కోవడంతో అతను కోలుకోవడానికి టైం పట్టింది.

సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు తేజు. రీఎంట్రీలో ‘విరూపాక్ష’ అతడికి భారీ విజయాన్నందించింది. దీంతో ‘సంబరాల యేటిగట్టు’ లాంటి పెద్ద సినిమాను లైన్లో పెట్టాడు. కానీ ఆ సినిమా బాగా ఆలస్యం అయింది. దాని బడ్జెట్ తడిసిమోపెడైంది. కేపీ రోహిత్ డైరెక్ట చేసిన ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దీని తర్వాత తేజు నుంచి వచ్చే సినిమాను ఇటీవలే అనౌన్స్ చేశారు.

This post was last modified on November 5, 2026 10:06 pm

Share

Recent Posts

ఆర్-ఆర్ ట్యాక్స్ ఇంత‌లా వ‌సూలు చేస్తున్నారా?!

తెలంగాణ‌లో కొత్తగా ఇళ్లు నిర్మించుకోవాలంటే సామాన్యులు, మ‌ధ్య‌త‌ర‌గ‌తిప్ర‌జ‌లు భ‌య‌ప‌డే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని మాజీ మంత్రి బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్…

1 hour ago

‘ఒరే.. మేం బానే ఉంటాం.. మీరెందుకురా గొడ‌వ ప‌డేది’

అనంత‌పురం జిల్లాకు చెందిన ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు.. జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ, టీడీపీ…

2 hours ago

భోగి మంటలకు మంచి అవకాశం

నవంబర్ 12 శర్వానంద్ భోగి సినిమా విడుదల. అనౌన్స్ మెంట్ ఎప్పుడో ఇచ్చారు. ఆల్రెడీ టీజర్, లిరికల్ సాంగ్ రెండూ…

2 hours ago

గ్యాస్ సిలిండర్‌కు మంటలు వస్తే ఇలాగా చేసేది?

గ్యాస్ సిలిండర్ డెలివరీ అంటే కేవలం వినియోగదారుడి ఇంటికి దానిని చేర్చడం మాత్రమే కాదు. సిలిండర్ భద్రత, గ్యాస్ లీకేజీని…

2 hours ago

తిరుప‌తి ల‌డ్డూ కేసు ఏపీ దాటి వెళ్లడం ఎందుకు

తిరుమ‌ల తిరుప‌తి శ్రీవారి ప‌విత్ర ప్ర‌సాదం ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌న్న కేసు విచార‌ణ‌ను వేరే రాష్ట్రానికి బ‌దిలీ చేయాల‌ని…

3 hours ago

ఆదర్శం ఆదుకోలేదు… అనిల్ మీదే ఆశలు!

వెంకటేష్‌కు 'ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47' ఆశించిన స్థాయిలో కలిసిరాలేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా కావడంతో మొదటి నుంచి…

3 hours ago