Political News

ఓడిపోయినా తగ్గేదే లే అంటున్న ఏబీవీ

మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు యూట‌ర్న్ తీసుకున్నారు. విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఆయ‌న స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌కు కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాలు కూడా మ‌ద్ద‌తు ప్ర‌కటించా యి. అయితే. చిత్రంగా వామ‌ప‌క్షాలు అంతో ఇంతో బ‌లం ఉన్న సెంట్ర‌ల్‌, తూర్పు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఏబీవీకి ఓట్లు ప‌డ‌లేదు. నిండా ఆయ‌న‌కు 12500 ఓట్లు ప‌డ్డాయి. దీంతో ఆయ‌న డిపాజిట్ కూడా కోల్పోయారు. ఈ ప‌రిణామాల‌తో ఆయ‌న తొలుత త‌న ఓట‌మిని అంగీక‌రిస్తున్నాన‌ని పేర్కొన్నారు.

కానీ.. 24 గంట‌లు గ‌డిచిన త‌ర్వాత‌.. ఏమైందో ఏమో అన్ని పార్టీల‌పైనా నిప్పులు చెరుగుతూ.. తాను ఓడిపోలేద‌ని.. త‌నను ప‌నిగ‌ట్టుకుని ఓడించార‌ని అన్నారు. అంతేకాదు.. తాను ఓడిపోయినా.. జిడ్డులాంటి వాడిన‌ని పేర్కొన్నారు. రాజకీయాల‌ను వ‌దిలేది లేద‌ని పేర్కొన్నారు. త‌నకు వ‌చ్చిన ఓట్లు చూసి తాను భ‌య‌ప‌డ‌డం లేద‌ని.. ఇది ఒక కుట్ర ప్ర‌కారం జ‌రిగింద‌ని.. కాబ‌ట్టి తాను ఎన్నిక‌ల రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొనే ప్ర‌శ‌క్తే లేద‌ని తేల్చి చెప్పారు. కొంద‌రు తాను త‌ప్పుకొంటాన‌ని అనుకుంటున్నార‌ని.. అది జ‌ర‌గ‌ద‌ని పేర్కొన్నారు.

రాజకీయాలను వదిలి వెళ్లే వ్యక్తిని కాదు. సోషల్ మీడియాలో నాపై విమర్శలు, అవహేళనలు, స్పాన్సర్డ్ వీడియోల ప్రచారం మొదలుపెట్టారు. న‌న్ను నాకు మ‌ద్ద‌తిచ్చేవారికి దూరం చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. బహుశా నేను సొంతంగా ఆలోచించలేనని వారి అభిప్రాయమేమో! నా పరువు పోయిందట!. కానీ.. నా ప‌రువు పోలేదు. నాకు 12 వేల మంది ఓట్లేశారంటే.. వారంతా నాపై న‌మ్మ‌కం పెట్టుకున్న‌వారే క‌దా! అని ఏబీవీ వ్యాఖ్యానించారు.

విజయవాడ మేయర్ పదవికి పోటీ చేసినప్పుడు త‌న బాధ్యత విజయవాడ ప్రజల ప్రయోజనాల గురించి మాట్లాడటం, ప్రజా సమస్యలపై ప్రశ్నించడం. బుడమేరు సమస్యపై నిలదీయడం, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని గుర్తుచేయడం. ఇవన్నీ రాజకీయాల కోసం కాదు.. ప్రజల పక్షాన నిలబడటం కోసమేన‌ని ఏబీవీ పేర్కొన్నారు. అవహేళనలతో, స్పాన్సర్డ్ ప్రచారాలతో వెనక్కి తగ్గించగలమని భావించే వారు స‌మ‌యం వేస్ట్ చేసుకోవ‌ద్దు అని వ్యాఖ్యానించారు. గ్రౌండ్‌లోకి దిగిన త‌ర్వాత‌.. తాను విమర్శ‌ల‌కు భ‌య‌ప‌డే వాడిని కాద‌న్నారు.

This post was last modified on November 5, 2026 7:07 pm

Share

Recent Posts

“మీరు ఒంట‌రిగా ఉన్నారా?“… అయితే ఈ `మోసం` మీకోస‌మే!

సోష‌ల్ మీడియాను హ్యాండిల్ చేసే విష‌యంలో అప్ర‌మ‌త్త‌త అత్యంత ముఖ్యం. క‌నిపించిన ప్ర‌తి సందేశాన్నీ.. ఆక‌ట్టుకునే మాట‌ల‌తో ఆక‌ర్షించే అమ్మాయిల…

2 minutes ago

వినాశనాన్ని అడ్డుకునే ‘వృషకర్మ’ సంకల్పం

తండేల్ సూపర్ హిట్ తర్వాత నాగచైతన్యకి గ్యాప్ వచ్చేసింది. కారణం వృషకర్మ. ప్యాన్ ఇండియా బడ్జెట్ తో కెరీర్ లోనే…

2 hours ago

బంధాల మధ్య చిచ్చు పెడుతున్న భోజనాలు

భారతీయ పెళ్లిళ్లలో భోజనానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. పెళ్లికి వచ్చిన అతిథులకు మంచి విందు ఏర్పాటు చేయడం కుటుంబాలు తమ…

2 hours ago

పెళ్లి వేడుకలో పిచ్చి సాహసం.. గుర్రపు పందేల కోసం..

వినోదం కోసం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమం ప్రజల ప్రాణాల మీదకు తెస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? బీహార్‌లో జరిగిన…

4 hours ago

హోమ్ గ్రౌండ్‌లో బయటపడిన ఓమ్ బలహీనత

ధనుష్, మమ్ముట్టి, సాయిపల్లవి, శ్రీలీల లాంటి క్రేజీ క్యాస్టింగ్ తో రూపొందిన ఓమ్ వంద కోట్ల గ్రాస్ దాటేసింది. ఇందులో…

4 hours ago

రామాయణ 2 అంచనాలకు రంగం సిద్ధమేనా

కొన్ని నెలల క్రితం టీజర్ వచ్చినప్పుడు ట్రోలింగ్ కు గురైన రామాయణ పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు…

4 hours ago