Movie News

ఇంతందం.. దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా..!

మొదటి సినిమా సీతారామంతోనే.. సీత పాత్రలో కనిపించి.. తెలుగు ప్రేక్షకుల మనసులను దోచేసింది మృణాల్ ఠాకూర్. ఆ తర్వాత వచ్చిన హాయ్ నాన్న సినిమాతో మరింత మ్యాజిక్ చేసింది. ఈ రెండు సినిమాలతో.. ఈ ముద్దుగుమ్మ తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదగడం ఖాయమని నిరూపించుకుంది.

కానీ అన్నీ మనం అనుకున్నట్లు జరిగితే ఎలా అన్న.. అప్పుడే ఫ్యామిలీ స్టార్ సినిమా వచ్చి డిజాస్టర్‌గా నిలిచింది. తన హిట్‌లకు బ్రేక్ వేసిన ఈ సినిమా.. తన నటనకు, అందానికి మాత్రం బ్రేక్ వేయలేకపోయింది.

ఇక ఈ మధ్యనే డాకాయిట్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల మనసులు దోచుకున్న ఈ హీరోయిన్.. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

సినిమాలతోనే కాకుండా తన ఇన్‌స్టాగ్రామ్ ఫొటోలతో కూడా అభిమానులను తెగ కవ్విస్తూ ఉంటుంది ఈ అందాల భామ.

ముఖ్యంగా మృణాల్ ఠాకూర్ బ్లాక్ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్‌కే కొత్త అందం వచ్చినట్లు ఉంటుంది. ఈ క్రమంలో బ్లాక్ డ్రెస్ లో తాజాగా ఈ హీరోయిన్ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతూ అందరిని తెగ ఆకట్టుకుంటున్నాయి. సొగసైన కళ్లతో,‌ కైపెక్కించే చూపులతో,‌ బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోతూ, గ్రీన్ కలర్ చెవిపోగులు ధరించి యువతకు మత్తెక్కించేలా ఫొటోలు షేర్ చేసింది.

Esquire India కోసం ఈ హీరోయిన్ చేసిన ఈ ఫొటోషూట్.. యువకుల మనసుల్లో ఆమెపై మరింత ప్రేమ పెరిగేలా చేస్తున్నాయి. మొత్తం పైన బ్లాక్ డ్రెస్‌లో మైండ్ బ్లాక్ చేసే అందంతో మృణాల్ ఠాకూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో కెవ్వు కేక పుట్టిస్తోంది. మరోపక్క ఈ హీరోయిన్ మళ్లీ తెలుగు సినిమాల్లో ఎప్పుడు కనిపిస్తుంది అని అభిమానులను మరింత వెయిట్ చేసేలాగా కూడా చేస్తున్నాయి.

This post was last modified on November 5, 2026 7:00 pm

Page: 1 2 3

Share

Recent Posts

ఓడిపోయినా తగ్గేదే లే అంటున్న ఏబీవీ

మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు యూట‌ర్న్ తీసుకున్నారు. విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఆయ‌న స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేసిన…

3 minutes ago

రజినీ అంటే ఇంత ప్రేమ ఏంటయ్యా

స్టార్ హీరోలకు బయట కోట్ల మంది అభిమానులుంటారు. కానీ స్టార్ హీరోల్లో కూడా అభిమానులను సంపాదించుకునే వాళ్లు కొందరే ఉంటారు.…

23 minutes ago

కొత్త సీన్లు కలిపేంత సీన్ ఉందా

థియేటర్ రిలీజ్ జరిగిన నెలలోపే జైలర్ 2 ఓటిటిలో వచ్చేస్తోంది. నవంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు అమెజాన్ ప్రైమ్…

32 minutes ago

ముంబై హీరోయిన్లకు చెంపపెట్టు సమాధానం

ఇటీవలే కరణ్ జోహార్ ఇంటర్వ్యూలో పెద్ది పాత్ర గురించి జాన్వీ కపూర్ చేసిన కామెంట్లు, జీవితంలో ఇలాంటి తప్పు పాత్ర…

1 hour ago

ఏపీని సౌత్ బీహార్ అని పిలుస్తున్నారు

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా టీడీపీ గూండాలు రిగ్గింగ్ కు పాల్పడ్డారని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. కలెక్టర్లు,…

2 hours ago

అక్రమాలు చేశామని ఒప్పుకున్న అంబటి

వైసీపీ హయాంలో స్థానిక సంస్థలు జరిగిన తీరును వైసీపీ నేతలు మరిచిపోయినా...ఏపీ ప్రజలు మర్చిపోరు. టీడీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా…

2 hours ago